Q4 Results: ఈ వారం ఏ కీలక కంపెనీలు క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించనున్నాయంటే! టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ సహా మరిన్ని..-tata motors asian paints vedanta and more companies will announce fy 23 q4 financial results this week ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Q4 Results: ఈ వారం ఏ కీలక కంపెనీలు క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించనున్నాయంటే! టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ సహా మరిన్ని..

Q4 Results: ఈ వారం ఏ కీలక కంపెనీలు క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించనున్నాయంటే! టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ సహా మరిన్ని..

Chatakonda Krishna Prakash HT Telugu
May 07, 2023 04:40 PM IST

Q4 Results this week: టాటా మోటార్స్, ఎల్&టీ, ఏషియన్ పెయింట్స్ సహా మరిన్ని కీలక కంపెనీలు ఈ వారం నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఏ రోజు ఏ సంస్థలు రిజల్ట్స్ వెల్లడిస్తాయంటే..

Q4 Results: ఈ వారం ఏ కీలక కంపెనీలు క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించనున్నాయంటే!
Q4 Results: ఈ వారం ఏ కీలక కంపెనీలు క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించనున్నాయంటే!

Q4 Results this week: భారత స్టాక్ మార్కెట్లలో గత మూడు వారాలుగా ముఖ్యమైన కంపెనీల నాలుగో క్వార్టర్ (Q4) రిజల్ట్స్ కీలకంగా మారాయి. ఐటీ మినహా చాలా రంగాల్లోని కంపెనీలు అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలను సాధించాయి. టీవీఎస్ మోటార్స్, నెస్లే ఇండియా సహా మరికొన్ని కంపెనీలు మెరుగైన క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించాయి. దీంతో స్టాక్ మార్కెట్లు చాలా సెషన్లలో లాభాలను చూశాయి. అయితే, అమెరికాలో బ్యాంకింగ్ రంగ సంక్షోభం సహా అంతర్జాతీయ ప్రతికూలతలతో గత శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ తరుణంలో ఈ వారం(మే 8 - మే 13)లోనూ కీలక కంపెనీలు 2022-23 ఆర్థిక సంవత్సర (FY23) నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇవి మార్కెట్ల కదలికపై ప్రభావం చూపనున్నాయి.

Q4 Results this week: టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, డీఎల్ఎఫ్, వేదాంత, అపోలో పైప్స్‌ సహా చాలా సంస్థలు ఈ వారం నాలుగో క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించనున్నాయి. ఏ రోజు.. ఏ ముఖ్యమైన కంపెనీలు ఫలితాలను వెల్లడించనున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

మే 8

Q4 Results: అవధ్ షుగర్స్, కెనరా బ్యాంక్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ఉగర్ షుగర్ వర్క్, స్టెర్లింగ్ టూల్స్, హిందుస్థాన్ మోటార్స్, ఆంధ్రా పేపర్, ఆపోలో పైప్స్ సంస్థలు 2022-23 ఆర్థిక సంత్సర నాలుగో క్వార్టర్ ఫలితాలను మే 8న వెల్లడించనున్నాయి. అలాగే శ్రీరామ్ పిస్టన్స్, క్రాఫ్ట్స్ మన్, బిర్లాసాఫ్ట్, కల్పతరు పవర్, అలాన్‍కిట్ లిమిటెడ్, ఆర్తి ఇండస్ట్రీస్ సహా మరిన్ని సంస్థలు అదే రోజున రిజల్ట్స్ ప్రకటిస్తాయి.

మే 9

మే 9న (మంగళవారం) మాట్రిమొనీ.కామ్, సువెన్ లైఫ్ సైన్సెస్, మనోరమ ఇండస్ట్రీస్, రేమండ్ లిమిటెడ్, బిర్లా కార్పొరేషన్ Q4 రిజల్ట్స్ ప్రకటిస్తాయి. అదే రోజున ఎవరెడీ ఇండస్ట్రీస్, శాంతి గేర్స్, గణేశ్ హౌసింగ్, టీడీ పవర్ సిస్టమ్, మాన్ ఇన్‍ఫ్రా, నజారా టెక్నాలజీస్, జై ప్రకాశ్ పవర్ సహా మరికొన్ని కంపెనీల ఫలితాలు వెల్లడవుతాయి.

మే 10

Q4 Results: డాక్టర్ రెడ్డీ ల్యాబొరేటరీస్, లార్సెన్ అండ్ టుర్బో (L&T), ప్రొక్టెర్ అండ్ గ్యాంబ్లర్ హైజీన్, గోకుల్ ఆగ్రో, సాగర్ సిమెంట్, సెరా శానిటరీ, బీఎండబ్ల్యూ ఇండస్ట్రీస్, గొద్రేజ్ కన్‍జ్యూమర్ ప్రొడక్ట్స్, ఆర్చిడ్ ఫార్మా, సాగర్ సిమెంట్ కంపెనీలు మే 10వ తేదీన 2022-23 ఫైనాన్షియల్ సంవత్సరం నాలుగో క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటిస్తాయి.

మే 11

Q4 Results: ఏషియన్ పెయింట్స్, ఐచర్ మోటార్స్, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, జీటీఎల్ ఇన్‍ఫ్రా, అజ్మీరా రియాలిటీ, మంగళూరు కెమికల్స్, ఎవరెస్ట్, డీసీడబ్ల్యూ, శంకర్ బిల్డింగ్స్, కేరే రేటింగ్స్, పైసాలో డిజిటల్, న్యూలాండ్ ల్యాబ్ కంపెనీలు మే 11న తమ FY 23 నాలుగో క్వార్టర్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ వెల్లడిస్తాయి. డిలెట్ ఇండియా లిమిటెడ్, డాక్టర్ లాల్‍పత్ ల్యాబ్స్ సహా మరిన్ని కంపెనీలు కూడా క్యూ4 ఫలితాలను డిక్లేర్ చేస్తాయి.

మే 12

Q4 Results: మే 12, శుక్రవారం రోజన టాటా మోటార్స్ (Tata Motors), వేదాంత లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, పిక్స్ టాన్స్‌మిస్, ఇన్ఫోబీన్స్ టెక్, గుల్షన్ పాలీ, రానే హోల్డింగ్స్, సోలారా యాక్టివ్, బటర్‌ఫ్లై, అలంబిక్ టెక్స్‌మాకో, సిప్లా, కోల్గెట్ పాల్మోలివ్ ఇండియా, డిష్ టీవీ సహా మరిన్ని కంపెనీలు 2022-23 నాలుగో క్వార్టర్ ఆర్థిక రిజల్ట్స్ ప్రకటించనున్నాయి.

మే 13

అవెన్సూ సూపర్‌మార్ట్, సొనాటా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, థెమిస్ మెడికేర్, భగీరథ్ కెమికల్స్, డేటా ప్యాటర్న్స్, నవీన్ ఫ్లొరీన్‍తో పాటు మరికొన్ని కంపెనీలు Q4 ఫలితాలు వెల్లడిస్తాయి.

Whats_app_banner