Shreyas Iyer highest run-scorer in 2022: సూర్యకుమార్‌ను మించిన శ్రేయస్‌.. 2022లో అత్యధిక రన్స్‌-shreyas iyer highest run scorer in 2022 for team india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Shreyas Iyer Highest Run Scorer In 2022 For Team India

Shreyas Iyer highest run-scorer in 2022: సూర్యకుమార్‌ను మించిన శ్రేయస్‌.. 2022లో అత్యధిక రన్స్‌

Hari Prasad S HT Telugu
Dec 14, 2022 09:40 PM IST

Shreyas Iyer highest run-scorer in 2022: సూర్యకుమార్‌ను మించిపోయాడు శ్రేయస్‌ అయ్యర్‌. 2022లో ఇండియా అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ (AP)

Shreyas Iyer highest run-scorer in 2022: టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ ఏడాది టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. తాను ఆడిన మూడు ఫార్మాట్లలోనూ చెలరేగుతున్న శ్రేయస్‌.. తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రేయస్‌ 82 రన్స్‌తో అజేయంగా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు

అయితే ఈ ఇన్నింగ్స్‌తో 2022లో ఇండియా తరఫున అత్యధిక రన్స్‌ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో టీ20ల్లో రెచ్చిపోతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ను మించిపోయాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ శ్రేయస్‌ మూడు ఫార్మాట్లలో కలిపి ఇండియాకు 38 ఇన్నింగ్స్‌ ఆడి 1489 రన్స్‌ చేశాడు. ఈ ఏడాది అతని అత్యధిక స్కోరు సౌతాఫ్రికాతో రాంచీలో జరిగిన వన్డేలో 111 బాల్స్‌లో చేసిన 113 రన్స్‌.

సూర్యకుమార్‌ యాదవ్‌ 2022లో 43 ఇన్నింగ్స్‌లో 1424 రన్స్‌ చేశాడు. అతని అత్యధిక స్కోరు 117 రన్స్‌. ఇక ఈ లిస్ట్‌లో విరాట్ కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 39 ఇన్నింగ్స్‌లో 1304 రన్స్‌ చేశాడు. కోహ్లి అత్యధిక స్కోరు 122 నాటౌట్‌. నాలుగో స్థానంలో 41 ఇన్నింగ్స్‌లో 1278 రన్స్‌తో రిషబ్‌ పంత్‌, 40 ఇన్నింగ్స్‌లో 995 రన్స్‌తో రోహిత్‌ శర్మ ఐదో స్థానంలో ఉన్నారు.

శ్రేయస్‌ అయ్యర్‌ 2022 మొత్తం అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ 112 రన్స్‌కే 4 వికెట్లు పడిన సందర్భంలో క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి టీమ్‌ను ఆదుకున్నాడు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 149 రన్స్‌ జోడించడంతో తొలి రోజు ఇండియా చెప్పుకోదగిన స్కోరు సాధించగలిగింది.

పుజారా 90 రన్స్‌ దగ్గర ఔటై.. సెంచరీ మిస్‌ అయినా రెండో రోజు శ్రేయస్‌ మూడంకెల స్కోరు అందుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. కఠినమైన పరిస్థితుల్లో ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడిన అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఏడాది శ్రేయస్‌కు బాగా కలిసొస్తోందని, అతనికి పోటీయే లేదని ఫ్యాన్స్‌ కామెంట్ చేస్తున్నారు.

WhatsApp channel