Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024కు అర్హత సాధించిన భారత అథ్లెట్ల పూర్తి జాబితా
పారిస్ ఒలింపిక్స్ 2024కు అర్హత సాధించిన భారత అథ్లెట్ల పూర్తి జాబితా ఇక్కడ చూడొచ్చు.
టోక్యో ఒలింపిక్స్‌లో 124 మంది అథ్లెట్లతో కూడిన అతిపెద్ద బృందాన్ని పంపిన భారత్ ఒకే ఎడిషన్లో అత్యధిక పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. టోక్యో 2020 పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా చారిత్రాత్మక స్వర్ణం సాధించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో మరోసారి తన ఈవెంట్‌లో టైటిల్ ను కాపాడుకోవాలని చూస్తున్న నీరజ్‌పై ఇప్పుడు అందరి దృష్టి ఉంటుంది.
రేస్ వాకర్లు ప్రియాంక గోస్వామి, అక్షదీప్ సింగ్ 2024 పారిస్‌లో అథ్లెటిక్స్ ఈవెంట్లకు అర్హత సాధించిన తొలి భారతీయులుగా నిలిచారు. పురుషుల 20 కిలోమీటర్ల నడకలో నలుగురు భారత అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ స్టాండర్డ్‌ను అధిగమించగా, ఒకరు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు. కానీ ప్రతి జాతీయ సమాఖ్య ఈ ఈవెంట్లో గరిష్టంగా ముగ్గురు అథ్లెట్లను మాత్రమే పారిస్‌కు పంపగలదు. కాబట్టి అక్షదీప్, వికాస్, పరంజీత్ సింగ్ అనుమతి పొందారు. రామ్ బాబూ, సూరజ్ పన్వర్ తప్పుకున్నారు. మిక్స్ డ్ రిలే మారథాన్ రేస్ వాక్ ఈవెంట్ లో ప్రియాంక, అక్షదీప్ లకు భారత్ తరఫున కోటా లభించింది.
పారిస్ ఒలింపిక్స్ కోసం అథ్లెట్లు ఫిట్‌గా ఉన్నారని భారత బృందానికి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న ప్రఖ్యాత స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పర్దివాలా మీడియాకు తెలిపారు. 'ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లంతా ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నారు. కొంతమంది అథ్లెట్లకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. గతంలో తగిలిన గాయాల గురించి చర్చించబోను. అయితే అక్కడ ఉన్న వారంతా సమర్థులు. వారు తగినంత ఫిట్ గా ఉంటారు’ అని అన్నారు.
పారిస్ ఒలింపిక్స్ భారత అథ్లెట్ల పూర్తి జాబితా:
ఆర్చరీ
ధీరజ్ బొమ్మదేవర: పురుషుల జట్టు
తరుణ్ దీప్ రాయ్: పురుషుల జట్టు
ప్రవీణ్ జాదవ్: పురుషుల జట్టు
భజన్ కౌర్: మహిళల జట్టు
దీపికా కుమారి: మహిళల జట్టు
అంకితా భకత్: మహిళల జట్టు
అథ్లెటిక్స్
అక్షదీప్ సింగ్: పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్
వికాస్ సింగ్: పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్
పరమ్ జీత్ సింగ్ బిష్త్: పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాక్
ప్రియాంక గోస్వామి: మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్
అవినాష్ సాబుల్: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్
పారుల్ చౌదరీ: మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్, మహిళల 5000 మీటర్ల స్టీపుల్ ఛేజ్
జ్యోతి యర్రాజీ: మహిళల 100 మీటర్ల హర్డిల్స్
కిరణ్ పహల్: మహిళల 400 మీటర్ల హర్డిల్స్
తజిందర్ పాల్ సింగ్ తూర్: పురుషుల షాట్ పుట్
అభా ఖాతువా: పురుషుల షాట్ పుట్
నీరజ్ చోప్రా: పురుషుల జావెలిన్ త్రో
కిశోర్ జెనా: పురుషుల జావెలిన్ త్రో
అన్నూ రాణి: మహిళల జావెలిన్ త్రో
సర్వేష్ కుషారే: పురుషుల హైజంప్
ప్రవీణ్ చిత్రవేల్: పురుషుల ట్రిపుల్ జంప్
అబ్దుల్లా అబూబకర్: పురుషుల ట్రిపుల్ జంప్
మహ్మద్ అనాస్ యాహియా, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, సంతోష్ తమిళరసన్, రాజేష్ రమేష్: పురుషుల 4×400 మీటర్ల రిలే
మిజో చాకో కురియన్: 4×400 మీటర్ల రిలే, 4×400 మీటర్ల మిక్స్ డ్ రిలే
విద్యా రామరాజ్, జ్యోతిక శ్రీ దండి, ఎంఆర్ పూవమ్మ, సుభా వెంకటేశన్, ప్రాచి: మహిళల 4×400 మీటర్ల రిలే
ప్రాచి: 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలే
ప్రియాంక గోస్వామి, సూరజ్ పన్వర్: రేస్ వాక్ మిక్స్ డ్ మారథాన్
బ్యాడ్మింటన్
హెచ్.ఎస్.ప్రణయ్: పురుషుల సింగిల్స్
లక్ష్యసేన్: పురుషుల సింగిల్స్
పీవీ సింధు: మహిళల సింగిల్స్
సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి: పురుషుల డబుల్స్
అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో: మహిళల డబుల్స్
బాక్సింగ్
నిఖత్ జరీన్: మహిళల 50 కేజీల విభాగం
అమిత్ ఫంగల్ : పురుషుల 51 కేజీల విభాగం
నిషాంత్ దేవ్ : పురుషుల 71 కేజీల విభాగం,
ప్రీతి పన్వర్ : మహిళల 54 కేజీల విభాగం
జాస్మిన్ లంబోరియా: మహిళల 57 కేజీల విభాగం
ఈక్వెస్ట్రియన్
అనూష్ అగర్వాలా: డ్రెస్సేజ్
గోల్ఫ్
శుభాంకర్ శర్మ: పురుషుల గోల్ఫ్
గగన్‌జీత్ భుల్లర్: పురుషుల గోల్ఫ్
అదితి అశోక్: మహిళల గోల్ఫ్
దీక్షా డాగర్: మహిళల గోల్ఫ్
హాకీ
పీఆర్ శ్రీజేష్: పురుషుల హాకీ జట్టు
జర్మన్‌ప్రీత్ సింగ్: పురుషుల హాకీ జట్టు
అమిత్ రోగిదాస్: పురుషుల హాకీ జట్టు
హర్మన్‌ప్రీత్ సింగ్ (సి): పురుషుల హాకీ జట్టు
సుమిత్: పురుషుల హాకీ జట్టు
సంజయ్: పురుషుల హాకీ జట్టు
రాజ్‌కుమార్ పాల్: పురుషుల హాకీ జట్టు
షంషేర్ సింగ్ : పురుషుల హాకీ జట్టు
మన్ ప్రీత్ సింగ్ : పురుషుల హాకీ జట్టు
హార్దిక్ సింగ్ : పురుషుల హాకీ జట్టు
వివేక్ సాగర్ ప్రసాద్ : పురుషుల హాకీ జట్టు
అభిషేక్ : పురుషుల హాకీ జట్టు
సుఖ్ జీత్ సింగ్ : పురుషుల హాకీ జట్టు
లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ : పురుషుల హాకీ జట్టు
మన్ దీప్ సింగ్ : పురుషుల హాకీ జట్టు
గుజ్రాంత్ సింగ్ : పురుషుల హాకీ జట్టు
జూడో
తులికా మాన్ : మహిళల 78 కిలోల విభాగం
రోయింగ్
బాల్‌రాజ్ పన్వార్ : ఎం1ఎక్స్
సెయిలింగ్
విష్ణు శరవణన్: పురుషుల వన్ పర్సన్ డింగీ
నేత్రా కుమనన్: మహిళల వన్ పర్సన్ డింగీ
షూటింగ్
పృథ్వీరాజ్ తొండైమాన్: పురుషుల ట్రాప్
రాజేశ్వరి కుమారి: మహిళల ట్రాప్
శ్రేయాసి సింగ్: మహిళల ట్రాప్
అనంత్ జీత్ సింగ్ నరుకా: పురుషుల స్కీట్
రైజా ధిల్లాన్: మహిళల స్కీట్
మహేశ్వరి చౌహాన్: మహిళల స్కీట్
అనంత్ జీత్ సింగ్ నరుకా/మహేశ్వరి చౌహాన్: స్కీట్ మిక్స్ డ్ టీమ్
సందీప్ సింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
అర్జున్ బబుతా: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
ఎలవెనిల్ వలరివన్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
రమితా జిందాల్ : మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
స్వప్నిల్ కుసాలే: పురుషుల 50 మీటర్ల రైఫిల్
ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్: పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్
సిఫ్ట్ కౌర్ సామ్రా: మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్
అంజుమ్ మౌద్గిల్: మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్
సందీప్ సింగ్/ఎలవెనిల్ వలరివన్: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్
అర్జున్ బాబుటా/రమిత జిందాల్: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్
అర్జున్ చీమా: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
సరబ్జోత్ సింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
మను భాకర్: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
రిథమ్ సంగం: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
విజయవీర్ సిద్ధు: పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్
అనీష్ భన్వాలా: పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్
మను భాకర్: మహిళల 25 మీటర్ల పిస్టల్
ఈషా సింగ్: మహిళల 25 మీటర్ల పిస్టల్
సరబ్జోత్ సింగ్/మను భాకర్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్
అర్జున్ చీమా/రిథమ్ సంగం: 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్
స్విమ్మింగ్
ధినిధి దేశింగు: మహిళల 200మీ ఫ్రీస్టైల్
శ్రీహరి నటరాజ్: పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్
టేబుల్ టెన్నిస్
శరత్ కమల్: పురుషుల సింగిల్స్ మరియు పురుషుల జట్టు
హర్మీత్ దేశాయ్: పురుషుల సింగిల్స్ మరియు పురుషుల జట్టు
మానవ్ ఠక్కర్: పురుషుల జట్టు
మనిక బాత్రా: మహిళల సింగిల్స్ మరియు మహిళల జట్టు
శ్రీజ ఆకుల: మహిళల సింగిల్స్ మరియు మహిళల జట్టు
అర్చన కామత్: మహిళల జట్టు
టెన్నిస్
సుమిత్ నాగల్: పురుషుల సింగిల్స్
రోహన్ బోపన్న మరియు శ్రీరామ్ బాలాజీ: పురుషుల డబుల్స్
వెయిట్ లిఫ్టింగ్
మీరాబాయి చాను: మహిళల 49 కేజీలు
రెజ్లింగ్
అమన్ సెహ్రావత్: పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీలు
వినేష్ ఫోగట్: మహిళల 50 కేజీలు
అన్షు మాలిక్: మహిళల 57 కేజీలు
నిషా దహియా: మహిళల 68 కేజీలు
రీతికా హుడా: మహిళల 76 కేజీలు
యాంటిమ్ ఫంఘల్: మహిళల 53 కేజీలు