PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..-pv sindhu lost in second round of all england open badminton tournament sports news in telugu ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pv Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

Hari Prasad S HT Telugu
Mar 14, 2024 05:04 PM IST

PV Sindhu: స్టార్ షట్లర్ పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఆమె వరల్డ్ నంబర్ వన్ యాన్ సె యంగ్ చేతుల్లో వరుస గేమ్స్ లో ఓడిపోయింది.

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి (PTI)

PV Sindhu: హైదరాబాదీ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ గెలిచిన పీవీ సింధు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. గురువారం (మార్చి 14) జరిగిన ఈ మ్యాచ్ లో సింధు 19-21, 11-21 తేడాతో రెండు వరుస గేమ్స్ లో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ కేవలం 42 నిమిషాల్లోనే ముగిసింది.

yearly horoscope entry point

సింధు ఓటమి

వరల్డ్ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన యాన్ సె యంగ్ ఈ మ్యాచ్ లో సింధును పూర్తిగా డామినేట్ చేసింది. తొలి గేమ్ లో ఆమెకు సింధు కాస్త పోటీ ఇచ్చినా.. రెండో గేమ్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. యంగ్ తో ఇప్పటి వరకూ ఏడుసార్లు తలపడ్డ సింధు.. అన్ని మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. ఈ ఏడు మ్యాచ్ లలో ఒకే ఒక్క గేమ్ మాత్రమే సింధు గెలిచింది.

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ రెండో రౌండ్లో మాత్రం సింధు మొదట్లోనే కాస్త దూకుడుగా కనిపించింది. 4-1 లీడ్ లోకి దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత యాన్ సె యంగ్ నుంచి గట్టి పోటీ ఎదురవడంతో క్రమంగా చేతులెత్తేసింది. కొరియాకు చెందిన యంగ్.. తన డిఫెన్స్ ను సడెన్ గా అటాకింగ్ గా మార్చేసి సింధుపై పైచేయి సాధించింది.

తొలి గేమ్ ఫస్ట్ హాఫ్ లో 11-8తో యంగ్ లీడ్ లోకి దూసుకెళ్లింది. ఈ దశలో కోర్టు పక్కనే ఉన్న తన మెంటార్, బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాశ్ పదుకోన్ తో సింధు మాట్లాడింది. యంగ్ పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. అయితే సెకండాఫ్ లో కాస్త ఎక్కువగా అటాకింగ్ ఆడటానికి ప్రయత్నించిన సింధు తగిన మూల్యం చెల్లించుకుంది.

దీంతో తొలి గేమ్ ను 19-21తో కోల్పోయింది. సెకండ్ గేమ్ లో ఇక యంగ్ ఆటకు తిరుగులేకుండా పోయింది. అటాకింగ్, డిపెన్స్ కలగలిపిన యంగ్ ముందు సింధు నిలవలేకపోయింది. 21-11తో గేమ్ తోపాటు మ్యాచ్ గెలిచి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. సింధు ఓటమితో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వుమెన్స్ సింగిల్స్ కేటగిరీలో ఇండియా పోరాటం ముగిసింది.

ఇంతకుమందు తొలి రౌండ్లోనే ఆకర్షి కశ్యప్ ఓటమి పాలైంది. ఇప్పటి వరకూ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇద్దరు ఇండియన్స్ మాత్రమే విజేతలుగా నిలిచారు. 1981లో ప్రకాశ్ పదుకోన్, 2001లో పుల్లెల గోపీచంద్ గెలిచారు.

Whats_app_banner

టాపిక్