PV Sindhu: ఎవరితోనైనా డేటింగ్ చేశారా?: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఇబ్బందికర ప్రశ్న.. ఆమె ఏం చెప్పారంటే..-pv sindhu responds question on dating during in an interview ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pv Sindhu: ఎవరితోనైనా డేటింగ్ చేశారా?: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఇబ్బందికర ప్రశ్న.. ఆమె ఏం చెప్పారంటే..

PV Sindhu: ఎవరితోనైనా డేటింగ్ చేశారా?: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఇబ్బందికర ప్రశ్న.. ఆమె ఏం చెప్పారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 05, 2023 03:35 PM IST

PV Sindhu: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వీపీ సింధుకు డేటింగ్‍పై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె బెస్ట్ ఆన్సర్ ఇచ్చారు. తన లక్ష్యం గురించి కూడా మాట్లాడారు.

PV Sindhu: ఎవరితోనైనా డేటింగ్ చేశారా?: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఇబ్బందికర ప్రశ్న
PV Sindhu: ఎవరితోనైనా డేటింగ్ చేశారా?: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఇబ్బందికర ప్రశ్న

PV Sindhu: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వీపీ సింధు 2024 పారిస్ ఒలింపిక్ క్రీడలకు సన్నద్ధం అవుతున్నారు. గతంలో ఒలింపిక్స్‌లో ఓ రజతం (2016), ఓ కాంస్యం (2021) సాధించారు సింధు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‍షిప్ బంగారు మెడల్ సహా తన కెరీర్లో ఎన్ని అద్భుత విజయాలు సాధించారు ఈ తెలుగు ప్లేయర్. రానున్న విశ్వక్రీడల్లో బంగారు పతకమే టార్గెట్‍గా పీవీ సింధు ప్రస్తుతం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‍కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

టీఆర్ఎస్ క్లిప్స్ ఛానెల్‍ పోడ్‍కాస్ట్‌లో వీపీ సింధు మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితంపై ఎదురైన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు. తన ప్రస్తుత రిలేషన్ స్టేటస్ గురించి అడగగా.. తాను ‘సింగిల్’ అని సింధు స్పష్టం చేశారు.

“ప్రస్తుతం నాకు బ్యాడ్మింటన్ ఒకటే ముఖ్యం. నా అత్యుత్తమ లక్ష్యం ఇప్పుడు ఒలింపిక్స్ మాత్రమే. నేను ప్రస్తుతం సింగిల్” అని సింధు చెప్పేశారు.

ఎవరితోనైనా డేటింగ్ చేశారా అని సింధును హోస్ట్ అడిగారు. దీంతో లేదు అని సింధు చెప్పేశారు. “లేదు, ఆ విషయంలో మంచి, చెడు అనేది లేదు. జీవితంలో తోడుగా ఎవరోఒకరు ఉండాలి. అయితే, అది జరగాల్సినప్పుడే.. జరుగుతుంది” అని సింధు అన్నారు.

కాబోయే భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అనే ప్రశ్న కూడా సింధుకు ఎదురైంది. “ఆ విషయం గురించి నేను ఇంకా ఎక్కువగా ఆలోచించలేదు. అయితే, భవిష్యత్తులో భాగస్వామి ఉండాలనే అనుకుంటున్నా. అయితే అంతా విధి. ఏం రాసి ఉంటుందో అదే జరుగుతుంది” అని సింధు స్పష్టం చేశారు.

2024 ఒలింపిక్స్ కోసం సింధు ప్రస్తుతం శ్రమిస్తున్నారు. మూడో ఒలింపిక్ మెడల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. దిగ్గజం, కోచ్ ప్రకాశ్ పదుకొణ్ దిశానిర్దేశంలో బెంగళూరులో ఆమె ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎమడ మోకాలి గాయంతో సింధు కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు.

“నేను గత ఆగస్టు నుంచే ప్రకాశ్ సర్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఆయన నాకు మెంటార్ కంటే ఎక్కువ. నా మార్గదర్శకుడు. నా గురువు. అన్నింటిన్నా మించి మంచి స్నేహితుడు. నా ఆట నుంచి బెస్ట్‌ను ఆయన బయటికి బయటికి తీసుకురాగలరని నేను నమ్ముతున్నా” అని పీవీ సింధు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కొరియన్ కోచ్ పార్క్ టే సంగ్‍‍కు గుడ్‍బై చెప్పారు సింధు.

WhatsApp channel