Srinivasan to Dhoni: నువ్వు మాత్రమే ఈ అద్భుతాలు చేయగలవు: ధోనీతో శ్రీనివాసన్-srinivasan to dhoni says you only can do these miracles ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Srinivasan To Dhoni: నువ్వు మాత్రమే ఈ అద్భుతాలు చేయగలవు: ధోనీతో శ్రీనివాసన్

Srinivasan to Dhoni: నువ్వు మాత్రమే ఈ అద్భుతాలు చేయగలవు: ధోనీతో శ్రీనివాసన్

Hari Prasad S HT Telugu
May 30, 2023 05:36 PM IST

Srinivasan to Dhoni: నువ్వు మాత్రమే ఈ అద్భుతాలు చేయగలవు అని ధోనీతో అన్నారు శ్రీనివాసన్. ఈ బీసీసీఐ మాజీ బాస్ సీఎస్కే ప్రధాన స్పాన్సర్ అయిన ఇండియా సిమెంట్స్ వైస్ ఛైర్మన్ అన్న విషయం తెలిసిందే.

సీఎస్కే కెప్టెన్ ధోనీ
సీఎస్కే కెప్టెన్ ధోనీ (AP)

Srinivasan to Dhoni: బీసీసీఐ మాజీ బాస్ శ్రీనివాసన్, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ మధ్య ఎలాంటి బంధం ఉందో మనందరికీ తెలిసిందే. ఆయన బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ధోనీ కెప్టెన్ గా ఉన్నాడు. ఇటు ఆయనకు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకూ ధోనీయే కెప్టెన్. దీంతో సహజంగానే ఇద్దరి మధ్యా గురుశిష్యుల అనుబంధం ఏర్పడింది.

తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఐదో ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ధోనీపై ప్రశంసలు కురిపించాడు శ్రీనివాసన్. ఇదొక అద్భుతమని, దీనిని ధోనీ మాత్రమే చేయగలడని ఆయన అనడం గమనార్హం. సీఎస్కే ప్రధాన స్పాన్సర్ అయిన ఇండియా సిమెంట్స్ వైస్ ఛైర్మన్ గా ఎన్ శ్రీనివాసన్ ఉన్నారు. ధోనీకి శ్రీనివాసన్ పంపిన సందేశం ఇదీ అంటూ పీటీఐ తన రిపోర్టులో వెల్లడించింది.

"అద్భుతమైన కెప్టెన్. నువ్వు ఓ అద్భుతం చేశావు. నువ్వు మాత్రమే ఇలా చేయగలవు. జట్టు, ప్లేయర్స్ ను చూసి చాలా గర్వపడుతున్నాం" అని ధోనీతో శ్రీనివాసన్ అన్నట్లు పీటీఐ తెలిపింది. బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా ధోనీకి శ్రీనివాసన్ సూచించారు. అంతేకాదు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లేయర్స్ తో కలిసి చెన్నై రావాల్సిందిగా కూడా ధోనీని ఆహ్వానించారు.

"ధోనీపై తమకు ఎంత ప్రేమ ఉందో ఈ సీజన్ ద్వారా ఫ్యాన్స్ చాటి చెప్పారు. మేము కూడా అతనిపై ఉన్న ప్రేమను చూపించాం" అని శ్రీనివాసన్ అన్నారు. ఈ ఏడాది ధోనీ ఎక్కడ ఆడినా కూడా పెద్ద ఎత్తున అభిమానులు స్థానిక జట్టును పక్కన పెట్టి సీఎస్కేకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్లోనూ గుజరాత్ టైటన్స్ కంటే సీఎస్కేకే ఎక్కువ మద్దతు లభించింది. ఈ మ్యాచ్ లో చివరి బంతి జడేజా ఫోర్ కొట్టి సీఎస్కేకు ఐదో ఐపీఎల్ టైటిల్ సాధించి పెట్టాడు.

సంబంధిత కథనం