Ravi Shastri on Shubman Gill: కోహ్లి రికార్డును గిల్ బ్రేక్ చేస్తాడు:రవిశాస్త్రి
Ravi Shastri on Shubman Gill: కోహ్లి రికార్డును గిల్ బ్రేక్ చేస్తాడని రవిశాస్త్రి ఓ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇంతకీ శాస్త్రి చెబుతున్న ఆ రికార్డు ఏంటి? నిజంగానే గిల్ బ్రేక్ చేయగలుగుతాడా?
Ravi Shastri on Shubman Gill: ఐపీఎల్లో ఇప్పటి వరకూ ఎవరూ కనీసం దరిదాపుల్లోకి కూడా వెళ్లని ఓ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. ఏడేళ్ల కిందట విరాట్ సాధించిన ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. అయితే అలాంటి రికార్డును శుభ్‌మన్ గిల్ బ్రేక్ చేస్తాడని మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పడం విశేషం. ఆ రికార్డు బ్రేక్ చేయడం చాలా కష్టమైన పనే అయినా.. అది గిల్ కు మాత్రమే సాధ్యమని అన్నాడు.
ఆ రికార్డు ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు. 2016లో విరాట్ కోహ్లి ఏకంగా 973 రన్స్ చేశాడు. ఆ సీజన్ లో టాప్ ఫామ్ లో ఉన్న కోహ్లి ఏకంగా నాలుగు సెంచరీలు కూడా బాదాడు. అలాంటి రికార్డును బ్రేక్ చేయడం నిజంగా అసాధ్యమే అనిపిస్తుంది. గతేడాది జోస్ బట్లర్ 863 రన్స్ తో దానికి కాస్త దగ్గరగా వచ్చాడు. మరి అలాంటి రికార్డును బ్రేక్ చేయడం ఓ ఓపెనర్ కు సాధ్యమయ్యే అవకాశం ఉందని రవిశాస్త్రి అన్నాడు.
"అతడు కచ్చితంగా ఓపెనింగ్ బ్యాటర్ అయి ఉండాలి. అప్పుడే అతనికి అన్ని పరుగులు చేసే అవకాశం వస్తుంది. అతడు శుభ్‌మన్ గిల్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతడు మంచి ఫామ్ లో ఉన్నాడు. పైగా టాపార్డర్ లో ఆడతాడు. అందుకే అతనికి రన్స్ చేయడానికి చాలా అవకాశాలు వస్తాయి. పిచ్ లు కూడా బాగున్నాయి. అతడు రెండు, మూడు ఇన్నింగ్స్ లో 80-100 రన్స్ చేస్తే అతడు అప్పటికే 300-400 రన్స్ చేసి ఉంటాడు" అని రవిశాస్త్రి అన్నాడు.
"నా అభిప్రాయం ప్రకారం ఆ రికార్డును బ్రేక్ చేయడం కష్టం. ఎందుకంటే 900 ప్లస్ రన్స్ చాలా ఎక్కువ. కానీ ఓపెనింగ్ బ్యాటర్ రెండు అదనపు మ్యాచ్ లు, రెండు అదనపు ఇన్నింగ్స్ పొందుతాడు. ఒకవేళ ఈ రికార్డు సాధ్యమైతే అది ఓపెనింగ్ బ్యాటర్ వల్లే అవుతుంది" అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.
2023లో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో మొదలుపెట్టాడు. తొలి మ్యాచ్ లో సీఎస్కేపై ఫిఫ్టీ ప్లస్ రన్స్ చేశాడు. అయితే తర్వాతి రెండు మ్యాచ్ లలో 14, 39 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
సంబంధిత కథనం