IPL 2023 MI Vs RCB : ముంబయి వర్సెస్ బెంగళూరు.. వాంఖడేలో ఎవరు స్ట్రాంగ్?
IPL 2023 : IPLలో మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. చాలామందికి ఫేవరెట్ అయిన జట్ల మధ్య పోరు ఉంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మే 9న హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ముంబయి వర్సెస్ బెంగళూరు(Mumbai Vs Begaluru) మ్యాచ్ కోసం రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాంఖడే మైదానంలో(wankhede stadium) జరగడం ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు ప్లస్ పాయింట్. ఎందుకంటే వాంఖడే పిచ్ ముంబై జట్టుకు సొంత మైదానం. ఇక్కడ ఆడిన చాలా మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టు విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ వాంఖడే స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 75 మ్యాచ్‌లు ఆడింది. 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కేవలం 29 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అలాగే ఒక మ్యాచ్ రద్దయింది.
అదే RCB జట్టు వాంఖడే స్టేడియంలో 16 మ్యాచ్‌లు ఆడగా, 8 మ్యాచ్‌లు గెలిచి 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇదే మైదానంలో ఆర్‌సీబీ(RCB), ముంబై ఇండియన్స్ జట్లు 9 సార్లు తలపడ్డాయి. RCB 3 సార్లు మాత్రమే గెలిచింది. అంటే ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్‌లు గెలిచి పైచేయి సాధించింది.
ఈ కారణంగా, ముంబై ఇండియన్స్‌ను వారి సొంత మైదానంలో ఓడించడం అనుకున్నంత సులభం కాదు. అయితే ఈ ఫీల్డ్‌లో టాస్‌దే కీలక పాత్ర. ఎందుకంటే వాంఖడే మైదానంలో మొత్తం 106 మ్యాచ్‌లు జరగగా.. ఛేజింగ్ జట్టు 57 సార్లు విజయం సాధించింది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్(Bowling) ఎంచుకోవడం ఖాయం. RCB జట్టు టాస్ గెలిస్తే, మ్యాచ్ గెలిచే అవకాశాన్ని కొట్టిపారేయలేం.
ముంబై ఇండియన్స్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కెమెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, అర్షద్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రూయిస్, విష్ణు వినోద్, రమణదీప్ సింగ్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, క్రిస్ జోర్డాన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సందీప్ వారియర్, హృతిక్ షోకీన్, డువాన్ జాన్సెన్, రాఘవ్ గోయల్, రిలే మెరెడిత్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు : విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనూజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హస్రంగ, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ పట్లెవుడ్, హర్షల్ కౌల్, కేదార్ జాదవ్, మైకేల్ బ్రేస్‌వెల్, వైశాక్ విజయకుమార్, ఫిన్ అలెన్, సోను యాదవ్, మనోజ్ భాండాగే, షాబాజ్ అహ్మద్, ఆకాశ్ దీప్, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, హిమాన్షు శర్మ.