Tim Cook - Apple Store: ముంబైలో అడుగుపెట్టిన యాపిల్ సీఈవో.. వడాపావ్ టేస్ట్ చేసిన కుక్.. యాపిల్ తొలి స్టోర్ రెడీ
Tim Cook - Apple Store: యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇండియాకు చేరుకున్నారు. భారత్‍లో యాపిల్ తొలి స్టోర్‌ను ఆయన మంగళవారం (ఏప్రిల్ 18) ప్రారంభించనున్నారు.
Tim Cook - Apple Store: యాపిల్ సీఈవో టిమ్ కుక్.. ముంబైలో ల్యాండ్ అయ్యారు. ఇండియాలో యాపిల్ తొలి స్టోర్ (Apple First Store)ను ఆయన మంగళవారం (ఏప్రిల్ 18) ప్రారంభించనున్నారు. ముంబై(Mumbai)లోని బంద్రా కుర్లా కాంప్లెక్స్(Bandra Kurla Complex - BKC)లో ఉన్న జియో వరల్డ్ డ్రైవ్ మాల్(Jio World Drive Mall)లో ఈ యాపిల్ రిటైల్ స్టోర్ ఏర్పాటైంది. దీన్ని టిమ్ కుక్ ప్రారంభించనున్నారు. తొలిరోజున కాసేపు స్వయంగా ఆయనే కస్టమర్లను ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ తొలి ఇండియా స్టోర్ ముంబైదే కానుంది.
Tim Cook - Apple Store: ఇండియాలో సోమవారం అడుగుపెట్టిన తర్వాత టిమ్ కుక్ ట్వీట్ చేశారు. కస్టమర్లను యాపిల్ స్టోర్‌కు ఆహ్వానించేందుకు నిరీక్షించలేకున్నానని పేర్కొన్నారు. యాపిల్ స్టోర్ స్టాఫ్ ఫొటోను పోస్ట్ చేశారు.
మాధురీ దీక్షిత్‍తో వడాపావ్
Tim Cook - Vada Pao:ముంబైకు చేరుకున్న టిమ్ కుక్‍ను ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ (Madhuri Dixit) కలిశారు. టిమ్ కుక్‍కు ముంబై ఫేమస్ స్నాక్ వడాపావ్‍ను రచిచూపారు. కుక్, మాధురీ కలిసి ఓ రెస్టారెంట్‍లో వడాపావ్ తిన్నారు. ఈ ఫొటోను మాధురీ దీక్షిత్ ట్వీట్ చేశారు. వడాపావ్ చాలా రుచికరంగా ఉందంటూ టిమ్ కుక్ కూడా ట్వీట్ చేశారు.
ఢిల్లీలోని సాకేత్‍లో ఈనెల 20వ తేదీన యాపిల్ రెండో స్టోర్ ఓపెన్ కానుంది.
ప్రధాని మోదీతో భేటీ
Tim Cook - Apple Store: ఈ పర్యటనలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో యాపిల్ సీఈవో టిమ్ కుక్ భేటీ అవుతారని తెలుస్తోంది. అలాగే ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తోనూ సమావేశం కానున్నారు.
నెలకు రూ.42లక్షల రెంట్
Apple Store in India: ముంబైలో యాపిల్ స్టోర్ విస్తీర్ణం 20వేల చదరపు అడుగులు ఉంది. రెండు అంతస్తుల్లో ఈ స్టోర్ ఉంది. ఈ స్టోర్ అద్దె నెలకు రూ.42లక్షలుగా ఉంది. అలాగే ఆదాయంలో 2 శాతాన్ని కూడా అంబానీకి చెందిన ఆ మాల్‍కు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ సంవత్సరం రెంట్ 15 శాతం పెరుగుతుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్ స్టోర్లలాగే ముంబై స్టోర్ డిజైన్ కూడా ఉంటుంది. అయితే, కాస్త మార్పులు ఉంటాయి. ముంబైలో ఉండే ఐకానిక్ బ్లాక్, ఎల్లో ట్యాక్సీల థీమ్ ఉంటుంది. రాజస్థాన్ నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రాతి ఫలకాలు ఈ స్టోర్ గోడలకు ఉంటాయి. ఈ స్టోన్ ఒక్కో పీస్ ధర రూ.4.5లక్షలు.