Ganga saptami 2024: రేపే గంగా సప్తమి.. గంగా నదిలో స్నానామాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయి
Ganga saptami 2024: గంగా దేవి భూమి మీదకు దిగి వచ్చిన రోజుని గంగా సప్తమిగా జరుపుకుంటారు. ఈరోజు గంగా నదిలో పుణ్య స్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుంది. ఈరోజు చేసే దానం ఫలితం మరు జన్మలో కూడా ఉంటుంది.
Ganga saptami 2024: హిందూ మతంలో గంగా సప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మే 14వ తేదీన గంగా సప్తమి జరుపుకుంటున్నారు. స్వర్గం నుంచి ఈరోజు గంగా మాత భూలోకానికి దిగి వచ్చిందని చెబుతారు.
పురాణాల ప్రకారం పరమేశ్వరుడు గంగా నదిని ఏడు ప్రవాహాలుగా విభజించాడు. మూడు ప్రవాహాలలో నళిని, హలదిని, పావని, పశ్చిమాన సీత ,సువక్షు, సింధ్, భగీరథిగా విభజించాడు. కూర్మ పురాణం ప్రకారం గంగా మాత సీత, అలకనంద, సుచక్షు, భధ్ర నాలుగు ప్రవాహాలలో ప్రవహిస్తుంది.
మందాకిని భూమ్మీద గంగా రూపంలో, పాతాళంలో భోగావతి రూపంలో ప్రవహిస్తుంది. గంగ సప్తమినాడు గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
శుభ యోగాలతో గంగా సప్తమి
గంగా సప్తమి అనేక శుభయోగాల మధ్య జరుపుకుంటున్నారు. ఈరోజు పుష్య నక్షత్రంతో పాటు సర్వార్ధ సిద్ధియోగం, రవియోగంతో గంగా సప్తమి జరుపుకుంటున్నట్లు పండితులు తెలిపారు. గంగా స్నానం ఆచరిస్తే రిద్ధి సిద్ధి కలుగుతాయి. కీర్తి, గౌరవం పెరుగుతుంది. సకల పాపాలు తొలగిపోతాయి.
అశుభ గ్రహాల దుష్ప్రభావాలు తగ్గుతాయి. సానుకూలత పెరుగుతుంది. పుష్య నక్షత్రం గంగా సప్తమి ఈరోజు మధ్యాహ్నం 03.01 గంటల వరకు ఉంటుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వస్తుంది. రవి యోగం, సర్వార్ధ సిద్ధి యోగం కలయిక జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో వీటిని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున దానధర్మాలు, ధార్మిక కార్యాలు చేయడం ద్వారా మరు జన్మ వరకు పుణ్యం లభిస్తుందని చెబుతారు. పద్మ పురాణం ప్రకారం గంగా మాతను పూజిస్తే మోక్షం లభిస్తుంది.
శుభ ముహూర్తం
గంగా సప్తమి తిథి ప్రారంభం మే 14 తెల్లవారుజాము 2:50 గంటల నుంచి సప్తమి తేదీ మే 15 ఉదయం 4.19 గంటల వరకు
ఉదయం 11.4 గురించి మధ్యాహ్నం 1.42 వరకు
గంగామా సప్తమి ప్రాముఖ్యత
గంగామాతను మోక్షధాయని అని కూడా పిలుస్తారు. ఈ రోజున గంగా మాతను పూజించడం ద్వారా మరణం తర్వాత మోక్షం లభిస్తుంది. గంగాదేవిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయి. అందుకే ఈరోజు తప్పనిసరిగా గంగా నదిలో పవిత్ర నది స్నానం ఆచరించాలి. గంగమ్మ అనుగ్రహం వల్ల జాతకంలో అశుభ గ్రహాల ప్రభావం కూడా తగ్గుతుంది.
జపించాల్సిన మంత్రం
పవిత్రమైన ఈ రోజున గంగా దేవిని సంతోషపెట్టేందుకు ఈ మంత్రం పఠించాలి
ఓం నమో గంగాయై విశ్వరూపిణ్యై నారాయణయే నమో నమః.
గంగాజలంతో ఇలా చేయండి
గంగా సప్తమి రోజు గంగా జలాన్ని ఇంటికి తెచ్చి దానితో ఇంటిని శుద్ధి చేసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. అలా చేయడం వల్ల ఇంట్లో నుంచి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూలత నెలకొంటుంది. ఇంటి పరిసరాలు స్వచ్ఛంగా మారుతాయి. ఇంట్లో ఆనందం ఉంటుంది.
గంగా స్నానం చేస్తే కలిగే ఫలితాలు
గంగా సప్తమి రోజు గంగా నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు హరించుకుపోతాయి. అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేయడం వల్ల పది రకాల పాపాలు నశిస్తాయి. పద్మ పురాణంలో ఈ పాపాల గురించి ప్రస్తావించారు.
హింసకు పాల్పడటం, వేరొకరితో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వంటి పాపాలు గంగానదిలో స్నానం ఆచరించడం వల్ల తొలగిపోతాయి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, అబద్ధం చెప్పడం, ఒకరి గురించి వెనుక మాట్లాడటం వంటివి పాపాలు నశిస్తాయి.
ఇతరుల నుంచి వస్తువులను అన్యాయంగా తీసుకోవాలని ఆలోచించడం, ఒకరికి చెడు చేయాలని కోరిక ఉండటం, తప్పుడు పనులు చేయడం వంటి పాపాల నుంచి విముక్తి కలగాలంటే గంగా నది స్నానం ఆచరించాలి.