Hindu Dharma: హిందూ ధర్మం ప్రకారం ఈ పాపాలు చేసిన వారికి ఎప్పటికీ విముక్తి ఉండదు
Hindu Dharma: ప్రపంచంలోని పురాతన మతాలలో హిందూ మతం ఒకటి. దీని ప్రకారం కొన్ని రకాల పాపాలు చేసిన వారికి మోక్షం లభించదు. ఆ పాపాలు ఏమిటో తెలుసుకోండి.
Hindu Dharma: హిందూ మతం పురాతన మతాలలో ప్రధానమైనది. హిందూ మత గ్రంథాలు ఈ ప్రపంచానికి ఎన్నో విభిన్న బోధనలను అందించాయి. మత గ్రంథాలు హిందువులను వారి జీవితంలో నీతిగా జీవించమని మార్గదర్శనం చేశాయి. పాపాలను చేయవద్దని, మంచి పనులను మాత్రమే చేయాలని నిర్దేశించాయి. హిందూ మత గ్రంథాలు చెబుతున్న ప్రకారం కొన్ని రకాల పాపాలు చేసిన వారికి ఎప్పటికీ మోక్షం లభించదు. ఆ పాపాలు ఏంటో తెలుసుకోండి.
హింస
ఒకరిని హింసించడం హిందూ మత గ్రంథాల ప్రకారం పెద్ద పాపం. దానికి క్షమాపణ ఉండదు. హింస ఏ రూపంలో ఉన్నా, ఏ జీవికైనా భౌతికంగా హాని కలిగించినా, మానసికంగా హింసించినా మీరు పెద్ద పాపం చేసినట్టే. హిందూ గురువులు, మేధావులు అహింసా విధానాన్ని బోధించారు. ఒక జీవిని చంపడం, గాయపరచడం, వారితో కఠినంగా మాట్లాడడం వంటివి మీ కర్మలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అది ఘోర పాపాలుగా భావిస్తాయి. దీనికి ఎలాంటి విముక్తి , మోక్షం ఉండదు.
అధర్మం
హిందూ తత్వవేత్తలు చెబుతున్న ప్రకారం అధర్మంగా నడుచుకోవడం, నీతిగా లేకపోవడం మరో ఘోరమైన పాపంగానే భావించాలి. అధర్మం అంటే నిజాయితీ లేని పనులు, ఒకరికి ద్రోహం చేయడం, పేదలను పీడించడం ఇవన్నీ కూడా హిందూ మతంలో ఘోర పాపాలుగా చెబుతున్నారు. అధర్మం చేసిన వారు క్షమాపణలు పొందలేరని, వారి చెడు కర్మలకు తగిన మూల్యాన్ని చెల్లించాల్సిందేనని గ్రంథాలు వివరిస్తున్నాయి.
దొంగతనం
దొంగతనం మరొక ఘోరమైన పాపంగా చెబుతోంది. హిందూయిజం మరొక వ్యక్తికి సంబంధించిన వస్తువులను వారికి తెలియకుండా తీసివేయడం అనేది పాపం చేయడమేనని వివరిస్తోంది. కేవలం ఆస్తులు దొంగలించడం, వస్తువుల దొంగలించడమే కాదు వారి గౌరవాన్ని తగ్గించడం కూడా దొంగతనంతోనే సమానం. ఇలాంటి పాపాలకు క్షమాపణ దక్కదు.
అసూయ
ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడడం కూడా పాపంతోనే సమానం. ఎవరికో ఎక్కువ ఆస్తులు ఉన్నాయని, వారు సుఖవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నారని... మీలో మీరు అసూయ పడడం అనేది పాపంతోనే సమానం. అది దుష్ట స్వభావం కలవారికే వస్తుంది. అసూయ పడడం అనేది ఒక అనారోగ్యంతో సమానం. ఇతర జీవుల పట్ల సంతృప్తిగా, ఉదారంగా, కరుణతో ఉండటమే మంచి పద్ధతి.
గురుద్వేషం
హిందూమతంలో గురువు భగవంతుడితో సమానం. హిందూ తత్వ శాస్త్రంలో గురువుకు ఉన్న ప్రాముఖ్యత ఎక్కువ. గురువును దైవంతో సమానంగా చూసుకోవాలని చెబుతారు. అలాంటి గురువును కించపరచడం, బాధ పెట్టడం, తిట్టడం ఇవన్నీ ఘోరమైన పాపంగానే పరిగణించాలి. హిందూ సంప్రదాయంలో గురు శిష్యుల మధ్య ఉన్న బంధం పవిత్రమైనది. ఆ పవిత్రమైన బంధానికి అందరూ విలువను ఇవ్వాలి.
టాపిక్