జూన్ 24, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు-today horoscope june 24th rasi phalalu in telugu check your zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జూన్ 24, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు

జూన్ 24, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు

HT Telugu Desk HT Telugu
Jun 24, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ24.06.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూన్ 23వ తేదీ నేటి రాశి ఫలాలు..
జూన్ 23వ తేదీ నేటి రాశి ఫలాలు..

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 24.06.2024

వారం: సోమ‌వారం, తిథి : త‌దియ‌,

నక్షత్రం: ఉత్త‌రాషాఢ‌, మాసం : జ్యేష్టము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు సర్వత్రా అనుకూలదాయకం. గ‌తంతో పోలిస్తే పరిస్థితులు చక్కబడతాయి. చాకచక్యంగా ఆలోచించి అడుగులేస్తారు. ఆదాయానికి త‌గిన‌ ఖర్చులుంటాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త, అనుమానిత వ్యక్తులతో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండండి. మీ నుంచి కీల‌క‌ విషయాల‌ సేకరణకు ప్ర‌య‌త్నించేవారున్నారు. జీవిత భాగ‌స్వామితో ఆనందంగా ఉంటారు. ఆమెతో అన్ని విష‌యాలు పంచుకోండి. సంతాన ప్ర‌య‌త్నం స‌ఫ‌లీకృత‌మ‌య్యే అవ‌కాశం ఉంది. గృహమార్పు కలిసి వస్తుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు పెర‌గ‌వ‌చ్చు. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. కొన్ని విష‌యాల్లో ఇచ్చిన‌ మాట నిలబెట్టుకుంటారు. స‌మాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గ‌డుపుతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కార్యసిద్ధికి ఓర్పు, స‌హ‌నం ఎంతో అవ‌స‌రం. ఇత‌రుల విష‌యాల‌ను పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల మాట‌లు మీలో మంచి మార్పుకు కార‌ణం అవుతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఖర్చులు విపరీతమ‌య్యే అవ‌కాశం ఉంది. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఆరోగ్యం సంతృప్తి కరం.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహ పడవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. తెలియ‌ని విషయాల్లో జోక్యం చేసుకోకపోవ‌డం ఉత్త‌మం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.

సింహ రాశి

కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ప్రముఖులతో మాటామంతీ చేస్తారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కావాల్సిన స‌మ‌యంలో డ‌బ్బు చేతికందుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, ముఖ్య కార్య‌క్ర‌మాల్లో గంద‌ర‌గోళం నెల‌కొంటుంది. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువుల ప‌ట్ల‌ జాగ్రత్త అవ‌స‌రం.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ఆనందంగా గడుపుతారు. బంధువుల రాక‌పోక‌ల‌తో సంద‌డిగా గ‌డుపుతారు. పనులు సానుకూలమవుతాయి. మీ సమర్థతకు త‌గిన‌ గుర్తింపు లభిస్తుంది. మాట తీరుతో ఆకట్టుకుంటారు. విమర్శలు పట్టించుకోవద్దు. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు సర్వత్రా అనుకూలమే. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. మానసికంగా కుదుటపడతారు. ప్రణాళికా బద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చుల విష‌యంలో ఆలోచ‌న అవ‌స‌రం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు అస్స‌లు ప‌ట్టించుకోవ‌ద్దు. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఆచితూచి అడుగేయాలి. ఎవరినీ తప్పుపట్టవద్దు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆత్మీయుల‌ను క‌లుస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ధన లాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం. ఆర్థిక‌, వ్య‌క్తిగ‌త వివరాలు ఇత‌రుల‌తో వెల్లడించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. స్నేహితులు, ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.

మకర రాశి

మకర రాశి వాళ్ళు ఈరోజు ఆర్థిక లావాదేవీలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక విష‌యాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ స‌మ‌స్య‌ల‌ను ఆత్మీయుల‌తో పంచుకుని కాస్త ఊర‌ట పొందుతారు. పనుల్లో ఒత్తిడి అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీ కష్టం ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు ఎక్కువ‌గా ఖర్చులు పెడ‌తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఇత‌రుల విష‌యాల్లో త‌ల‌దూర్చ‌కండి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. కుటుంబ‌స‌భ్యుల‌ ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. రుణ విముక్తులవుతారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. పత్రాలు అందుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel