పచ్చిమామిడి కాయ వల్ల అందమే కాదు ఆరోగ్యం కూడా

pixabay

By Haritha Chappa
Jun 23, 2024

Hindustan Times
Telugu

పచ్చి మామిడిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అందం కూడా పెరుగుతుంది. 

pixabay

పచ్చి మామిడిలో విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పుల్లని మామిడి తినడం వల్ల చర్మం మెరిసిపోతుంది.

pixabay

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వల్ల సెల్ డామేజ్ కాకుండా ఉంటుంది. చర్మాన్ని కాపాడుతుంది. 

pixabay

పచ్చి మామిడి కాయను తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్ధకం కూడా దూరమవుతుంది.

pixabay

పచ్చి మామిడి కాయ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు రక్షణ కల్పిస్తుంది. 

pixabay

పచ్చి మామిడి కాయ తినడంవల్ల డయాబెటిస్ రోగులకు మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

pixabay

కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ అవసరం. విటమిన్ ఎ మామిడి కాయలో అధికంగా ఉంటుంది. కంటి చూపును కాపాడుతుంది.

pixabay

మామిడి పండు రసాన్ని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. 

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels