సెప్టెంబర్ 8, నేటి రాశి ఫలాలు- నూతన గృహం కొనుగోలు చేస్తారు, ప్రయాణాలు లాభిస్తాయి-today 8th september 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సెప్టెంబర్ 8, నేటి రాశి ఫలాలు- నూతన గృహం కొనుగోలు చేస్తారు, ప్రయాణాలు లాభిస్తాయి

సెప్టెంబర్ 8, నేటి రాశి ఫలాలు- నూతన గృహం కొనుగోలు చేస్తారు, ప్రయాణాలు లాభిస్తాయి

HT Telugu Desk HT Telugu
Sep 08, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ08.09.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబర్ 8 నేటి రాశి ఫలాలు-
సెప్టెంబర్ 8 నేటి రాశి ఫలాలు-

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 08.09.2024

వారం: ఆదివారం, తిథి: పంచ‌మి,

నక్షత్రం: స్వాతి, మాసం: భాద్ర‌ప్ర‌ద‌,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఫలిస్తాయి. వ్యాపార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. షాపుకు మ‌ర‌మ్మ‌త్తులు చేయించాలన్న ఆలోచనలు చేస్తారు. హాస్పిటల్స్, డయాగ్నస్టిక్స్ సెంటర్స్ నడిపే వారికి అనుకూలంగా ఉంటుంది. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలరు ధరించండి. ప్రజల ఆదరణ పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది.

వృషభం

వైద్య విద్య చేపట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సమేతంగా విహార యాత్రలు చేస్తారు. కుటుంబంలో ఏర్పడుతున్న స్పర్థలకు పరిష్కారంగా మంచి నిర్ణయాలను తీసుకుంటారు. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి.

మిథునం

నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. సువర్ణాభరణాలను మార్పిడి చేసే ఆలోచనలు కలిసి వస్తాయి. ఆరోగ్య వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఆర్థికంగా కొంత మందికి అభయ హస్తం ఇచ్చేముందు, ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఇవ్వండి. నూతన ప్రణాళికలను వేయగలుగుతారు. మీ సలహాలు, సూచనలు కొంత మందికి ఉపయోగపడతాయి. దైవ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

కర్కాటకం

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వాళ్ళు సఖ్యత లేని వ్యక్తులతో జీవితం గడపడం అనవసరం అని భావిస్తారు. ఏకాకిగా ఉండటం మంచి ఆలోచన కాదన్న భావన ఏర్పడుతుంది. నూతన గృహం కొనుగోలు గురించి ఆలోచిస్తారు. భూ సంబంధ వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. క్రయ-విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. విదేశీ ద్రవ్యం చేతికందుతుంది. భూ సంబంధ వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. అమ్మ‌వారి ద‌ర్శ‌నం శుభ‌ప్ర‌దం.

సింహం

శీతల పానీయాలు, ఆహార పదార్థాలు కొనుగోలు- అమ్మకాలు వ్యాపారస్తులకు, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకు అనుకూలం. ప్రయోజనాలు ఆశించిన‌ కొంత మందికి ఉపకారం చేస్తారు. హనుమాన్ వత్తులు, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. వివాహాది శుభ కార్యాలకు సంబంధించిన కార్యక్రమాలు ముడి పడతాయి. శంకుస్థాపన ముహూర్తాలు కలిసొస్తాయి.

కన్య

కొన్ని కార్యక్రమాల నిమిత్తం కొత్త రుణాలు చేస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి అనుకూలం. ప్రజా సంబంధ బాంధవ్యాలు మెరుగు పడతాయి. ప్రతి పనినీ కష్టపడి సాధించాలని అనుకుంటారు. అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. ఇతరుల మీద ఆధారపడకూడదని నిర్ణయించుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు.

తుల

పిల్లలతో, స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఎన్ని పనులు వున్నప్పటికీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కోసం సమయం కేటాయిస్తారు. జీవితాశయాన్ని సాధించడం కోసం కొన్ని పనులు ప్రారంభిస్తారు. సౌర కంకణం ధరించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంత్రోపదేశం పొందాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దేవీ దేవతలు పూజలు ప్రతిరోజూ చేసుకోవాలని ఆలోచిస్తారు.

వృశ్చికం

విదేశాలకు వెళ్లే అవకాశాలు కలిసి వస్తాయి. మీ ఉత్పత్తులు విదేశాల్లో అమ్ముకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక సంతోషం, ధైర్యం కలిగి ఉంటారు. ప్రతిరోజూ దేవతలకు ప్రథమ తాంబూలం సమర్పించండి. వ్యాపారంలో ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని మంచితనంతో, ఓర్పుతో ఎదుర్కొంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో రాజకీయ మంతనాలు చేస్తారు.

ధనుస్సు

వృత్తిలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సమస్యలు సృష్టించేవారు కార్యాలయంలో ఉన్నప్పటికీ వాళ్ల ఆలోచనలు తిప్పికొడతారు. నూతన కార్యక్రమాలను స్నేహితుల సహాయంతో ప్రారంభిస్తారు. సిద్ధ గంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చన జరిపించండి. ఫుడ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలం. శ్రమకు తగిన ఆదాయం అందుకుంటారు. రుణాలను తీర్చడంలో విఫలమవుతారు.

మకరం

ఇంట్లో చోటు చేసుకునే చిన్నా పెద్ద విషయాలకు మీదే బాధ్యత వహించాల్సి వస్తుంది. అన్ని విధాలా అందరికీ దగ్గరవ్వాలని ప్రయత్నిస్తారు. జిల్లేడు వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కొంతమంది రాగద్వేషాలు, ఈర్ష్య అసూయలతో నరదృష్టి బారిన పడి అవస్థకు గురవుతారు. అప్రమత్తంగా ఉండండి. నరఘోష యంత్రాన్ని ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాల్లోనూ పెట్టించండి.

కుంభం

ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాల్లోనూ సాయంత్రం వేళ త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి. నరదృష్టి సోకకుండా ఉంటుంది. కుటుంబ సమేతంగా విహార యాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలు వాయిదా వేయాల్సి వస్తుంది. సంతానం పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు. మహా పాశుపత కంకణం ధరించండి. ఎదురు చూస్తున్న ఉద్యోగం లభిస్తుంది.

మీనం

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారిని దీర్ఘకాలికంగా వేధిస్తున్న వ్యవహారాల ఉండి సునాయాసంగా బయట పడగలుగుతారు. మధ్యవర్తుల ద్వారా చేసే ప్రయత్నాలు పంపే రాయబారాలు ఉపకరిస్తాయి. మీరు చేసే పనులను కొంతమంది గుర్తించడం ఎంతగానో నచ్చుతుంది. ఏ ఆశ లేని చోట ఒక కొత్త ఆకాంక్ష చిగురిస్తుంది. గృహోపకరణాలను అధునాతన, సాంకేతిక వస్తువులను పరికరాలు కొనుగోలు చేస్తారు. శుభ వార్తలు వింటారు.

ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ