Sun transit: మూడు రోజులు ఆగారంటే ఇక వీరి అదృష్టాన్నికి అడ్డు ఉండదు, డబ్బే డబ్బు-sun transit in taurus these three zodiac signs get luck in may month ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: మూడు రోజులు ఆగారంటే ఇక వీరి అదృష్టాన్నికి అడ్డు ఉండదు, డబ్బే డబ్బు

Sun transit: మూడు రోజులు ఆగారంటే ఇక వీరి అదృష్టాన్నికి అడ్డు ఉండదు, డబ్బే డబ్బు

Gunti Soundarya HT Telugu
May 11, 2024 06:05 PM IST

Sun transit: మరో మూడు రోజులు ఆగారంటే చాలు ఇక వీరి అదృష్టాన్ని అడ్డు ఉండదు. ఎటు చూసినా డబ్బుతో నిండిపోతుంది. రాజకీయ నాయకులను పదవి వరించబోతుంది.

సూర్యుడి సంచారం
సూర్యుడి సంచారం

Sun transit: ప్రతినెలా కొన్ని గ్రహాలు తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాల సంచారం ప్రజల జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. మే నెలలో గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు వృషభ రాశి సంచారం చేయబోతున్నాడు. నవగ్రహాలలో సూర్యభగవానుడిది ప్రత్యేకమైన స్థానం. 

మూడు రోజుల్లో సూర్యుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. శక్తి, ఆత్మకు సూర్యుడు కారకుడిగా భావిస్తారు. నెల రోజులకు ఒకసారి సూర్యుడు తన రాశిని మార్చుకుంటాడు. అలా ఈ నెల వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. సూర్య సంచారం మొత్తం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. సూర్యుడి సంచారం వల్ల అదృష్టం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

సూర్యుడు శుభ స్థానంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం, గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కీలకమైన విషయాలలో తెలివిగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మే 14 నుంచి వృషభ రాశిలో సూర్యుడి సంచారం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఆ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. మే నెల వృషభ రాశిలోకి నాలుగు పెద్ద గ్రహాల సంచారం జరుగుతుంది. శుక్రుడు, బుధుడు కూడా మరికొన్ని రోజుల్లో ఇదే రాశిలోకి ప్రవేశిస్తారు. సూర్యుడి సంచారం ఏ రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుందో తెలుసుకుందాం.

సింహ రాశి

సింహ రాశికి సూర్యుడు పాలక గ్రహంగా వ్యవహరిస్తాడు. ఈ రాశి కర్మ గృహంలో సూర్యుడి సంచారం ఉంటుంది. ఫలితంగా వ్యాపారం చేసే వారికి ఈ కాలం ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారంలో వృద్ధి, భారీ లాభాలు గడిస్తారు. కుటుంబంతో నాణ్యమైన సమయం గడిపేందుకు ఇది సరైన సమయం. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. సభ్యులందరి మధ్య పరస్పర సమన్వయం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. జీతాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరించుకోగలుగుతారు.

కర్కాటక రాశి

సూర్యుడి సంచారం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయం, లాభ గృహంలో సూర్యుడి సంచారం జరుగుతుంది. ఈ సమయంలో ఆదాయ స్థాయిలు పెంచేందుకు ఉత్తమ అవకాశాలు వస్తాయి. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఆర్థిక స్థితి మరింత బలోపేతం అవుతుంది. సూర్య సంచారం వల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇతర రకాల ప్రయోజనాలు పొందుతారు. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. గత పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి లాభాలు అందుతాయి. షేర్ మార్కెట్ లేదా లాటరీ మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి

కుంభ రాశి నాలుగో ఇంట్లో సూర్యుడు సంచరిస్తాడు. ఫలితంగా ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అనేక రకాల భౌతిక ఆనందాలను పొందుతారు. రాజకీయ రంగాలలో ఉన్న వారిని పదవి వరిస్తుంది. వాహనం, ఆస్తి మొదలైన వాటిని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలతో పాటు డబ్బుని ఆదా చేయగలుగుతారు. వీరికి నెల రోజుల పాటు అదృష్టం మద్దతుగా ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధం బలంగా ఉంటుంది.

 

Whats_app_banner