Subha yogam: వృషభ రాశిలో నాలుగు శుభ యోగాలు.. లక్ అంటే వీళ్ళదే ఆదాయానికి తిరుగే లేదు-chaturgrahi and many raja yogas form in vrishabha rashi this may month ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Subha Yogam: వృషభ రాశిలో నాలుగు శుభ యోగాలు.. లక్ అంటే వీళ్ళదే ఆదాయానికి తిరుగే లేదు

Subha yogam: వృషభ రాశిలో నాలుగు శుభ యోగాలు.. లక్ అంటే వీళ్ళదే ఆదాయానికి తిరుగే లేదు

Gunti Soundarya HT Telugu
May 10, 2024 11:17 AM IST

Subha yogam: వృషభ రాశిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం జిడ్డు పట్టుకున్నట్టు పట్టుకోబోతుంది. అందులో మీ రాశి ఉందేమో చూడండి.

వృషభ రాశిలో నాలుగు శుభ యోగాలు
వృషభ రాశిలో నాలుగు శుభ యోగాలు (freepik)

Subha yogam: గ్రహాల సంచారంతో మే నెల చాలా ప్రత్యేకంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం మే నెల వృషభ రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది.

ప్రస్తుతం బృహస్పతి వృషభరాశిలో సంచరిస్తున్నాడు. మే 14న సూర్యుడు వృషభ రాశిలోకే ప్రవేశిస్తాడు. మే 19న శుక్రుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే మే 31న గ్రహాల రాకుమారుడు బుధుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఒకే రాశిలో నాలుగు గ్రహాల కలయిక వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది.

ఇది మాత్రమే కాదు వృషభ రాశిలో మరో మూడు శుభ యోగాలు కూడ ఏర్పడనున్నాయి. గురు, శుక్ర గ్రహాల కలయిక వల్ల గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, బుధుడు కలిగిన బుధాదిత్య యోగాన్ని ఇవనున్నారు. సూర్యుడు, శుక్రుడి కలయిక వల్ల శుక్రాదిత్య యోగం కూడా ఏర్పడబోతుంది. ఒకే రాశిలో ఎన్ని శుభయోగాల ప్రభావంతో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఏయే రాశులకు లాభాలు కలుగుతాయనేది చూద్దాం.

వృషభ రాశి

వృషభ రాశిలోనే చతుర్గ్రాహి యోగంతో పాటు అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఈ రాశి వారికి చాలా లాభముంటుంది. ఈ శుభ యోగంలో ఉన్న నాలుగు గ్రహాలు వీరికి అనుకూల ఫలితాలను అందిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారవేత్తలకు మంచి మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం లభిస్తుంది. కుటుంబ జీవితాలలో ఆనందాన్ని పొందుతారు. ఆస్తి, వాహనం మొదలైనవి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లో పురోగతి కోసం చేసే ప్రయత్నాలు విజయాన్ని అందిస్తాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి శుభ యోగాల ప్రభావం విజయాన్ని ఇస్తుంది. విద్యార్థులకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. కెరర్ పరంగా ఇది ఉత్తమ కాలం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆశించిన విజయాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలని మీ కోరిక ఈ కాలంలో సఫలమవుతుంది. చతుర్గ్రాహి యోగం వల్ల సంతానం పొందాలనే వారి కోరికలు నెరవేరుతాయి.

వృశ్చిక రాశి

చతుర్గ్రాహి యోగం వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంతో నిండుతుంది. కష్టమైన సమయాలలో కుటుంబం పూర్తి మద్దతు పొందుతారు. పూర్వికుల ఆస్తుల నుండి లాభాలను పొందుతారు. వివాహితులకు అత్తమామల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. తీర్థయాత్ర లేదా మతపరమైన యాత్రకు వెళ్ళే అవకాశాన్ని పొందుతారు.

మకర రాశి

వృషభ రాశిలో ఏర్పడే అనేక రాజయోగాలు మకర రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటాయి. ఈ రాశి తొమ్మిదో ఇంట్లో గురు గ్రహం దృష్టి ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిదవ ఇల్లు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో జీతాలు పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్ కూడా వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ శుభయోగం ప్రభావంతో ఆవివాహితులకు కొత్త ప్రతిపాదనలు వస్తాయి.