Mercury transit: ఈ రాశుల వారికి బాధలు ఇవ్వబోతున్న బుధుడు.. ఆర్థిక కష్టాలు, వ్యాపారంలో నష్టాలు
Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు అక్షయ తృతీయ రోజు తన రాశిని మార్చుకోబోతున్నాడు. మే 10 నుంచి మేష రాశిలో సంచరిస్తాడు. ఫలితంగా ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు, వ్యాపారంలో నష్టాలు తప్పవు.
Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు అక్షయ తృతీయ రోజు తన రాశిని మార్చుకోబోతున్నాడు. మేధస్సు, తెలివితేటలు, తర్కం, శ్రేయస్సును బుధుడు అందిస్తాడు. ఈ గ్రహం శుభ స్థానంలో ఉంటే వ్యక్తి మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి. బుధుడి అనుగ్రహం పొందటం కోసం బుధవారం పూజిస్తారు.
మే 10వ తేదీ బుధుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడి స్థానం శుభమగా ఉంటే ఆనందాన్ని, జీవితంలోని అడ్డంకులని అధిగమించగలుగుతారు. మేష రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలో ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడాల్సి వస్తుంది.
మేష రాశి
బుధుడు మేష రాశి మూడు, ఆరో ఇంటికి అధిపతిగా వ్యవహరిస్తాడు. బుధుడి సంచారం ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఇవ్వదు. అందువల్ల కార్యాలయంలో ఎక్కువ లాభాలను పొందలేరు. ఖర్చులు పెరుగుతాయి. అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. కొంచెం డబ్బు కొరత ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి రెండవ, ఐదవ ఇంటి పాలకుడిగా వ్యవహరిస్తాడు. పన్నెండో ఇంట్లో బుధుడి సంచారం జరుగుతుంది. ఫలితంగా ఈ సమయంలో విజయం పొందటం కష్టమవుతుంది. పురోగతి సాధించాలనుకుంటే మీరు అనేక అడ్డంకులు దాటవలసి ఉంటుంది. కెరీర్ లో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం లేదు. కార్యాలయంలో కూడా వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇది ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. వృషభ రాశిలో బుధుడి సంచారం వల్ల డబ్బుకు సంబంధించిన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే నష్టాలను భరించాల్సి ఉంటుంది.
కన్యా రాశి
బుధుడు కన్యా రాశి మొదటి, పదవ ఇంటికి అధిపతి. ఎనిమిదో ఇంట్లో సంచరిస్తాడు. బాధ్యతలు పెరుగుతాయి. అననుకూల ఫలితాలు ఏర్పడతాయి. కుటుంబ అవసరాలను తీర్చలేకపోతారు. వాటి కోసం రుణాన్ని తీసుకోవాల్సి వస్తుంది. బాధ్యతలు పెరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల ఆందోళన కలిగిస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి ఎనిమిది, పదకొండో ఇంటికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఆరో ఇంట్లో సంచరిస్తాడు. అందువల్ల ఈ రాశి వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాన్ని నడుపుతున్న వారికి లాభాలు ఆర్జించేందుకు కొన్ని సమస్యలు ఎదుర్కోల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రభావితం అవుతుంది. జీవనానికి తగినంత డబ్బు సంపాదించడంలో విఫలమవుతారు. అవసరాలు, బాధ్యతలు తీర్చేందుకు రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక భారం గణనీయంగా పెరుగుతుంది.
కుంభ రాశి
కుంభ రాశి ఐదు, ఎనిమిదో ఇంటికి పాలకుడుగా బుధుడు వ్యవహరిస్తాడు. మూడో ఇంట్లో సంచరిస్తాడు. పురోగతిలో సమస్యలు ఉంటాయి. కెరీర్ లో అనేక ప్రతికూల ఫలితాలు పొందుతారు. వ్యాపారాలు నడుపుతున్న వారికి కష్టాలు, నష్టాలు ఎదురవుతాయి. ఈ కాలంలో డబ్బు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.
మీన రాశి
బుధుడి సంచారం మీన రాశి వారికి నష్టాలను ఇస్తుంది. నాలుగు, ఏడో ఇంటికి పాలకుడు. రెండో ఇంట్లో సంచరిస్తాడు. ఫలితంగా వ్యాపారంలో పతనం చవి చూడాల్సి వస్తుంది. ఉద్యోగులకు సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన విషయాల కోసం డబ్బులు వృధాగా ఖర్చుపెడతారు. అజాగ్రత్త కారణంగా వ్యాపారంలో నష్టాన్ని కూడా అనుభవిస్తారు.
కన్యారాశి