Planet transit: 2025 మార్చి వరకు ఈ రాశులకు అన్నీ మంచి రోజులే.. ఆనందం, డబ్బు, అదృష్టం వీరిదే-until march 2025 all are good days for these zodiac signs happiness money and luck belong to them ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Planet Transit: 2025 మార్చి వరకు ఈ రాశులకు అన్నీ మంచి రోజులే.. ఆనందం, డబ్బు, అదృష్టం వీరిదే

Planet transit: 2025 మార్చి వరకు ఈ రాశులకు అన్నీ మంచి రోజులే.. ఆనందం, డబ్బు, అదృష్టం వీరిదే

Gunti Soundarya HT Telugu
May 11, 2024 11:05 AM IST

Planet transit: గ్రహాల శుభ స్థానాలు, సంచారం వల్ల మార్చి 2025 వరకు కొన్ని రాశుల వారికి దశ మారబోతుంది. అన్నింతగా ఆనందం, డబ్బు, అదృష్టం పొందబోతున్నారు. మరి ఆ రాశులు ఏవో తెలుసుకోండి.

2025 మార్చి వరకు ఈ రాశుల వారిదే అదృష్టం
2025 మార్చి వరకు ఈ రాశుల వారిదే అదృష్టం

Planet transit: గ్రహాల సంచారం వల్ల 2025 మార్చి వరకు కొన్ని రాశుల వారి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. మంచి ఫలితాలతో కోరుకున్న జీవితం లభిస్తుంది. ఏ రంగంలోనైనా విజయం వీరిదే అవుతుంది. అటువంటి అదృష్టం పొందిన ఆరు రాశుల గురించి తెలుసుకుందాం. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి.

మేష రాశి

మీరు మేషరాశి జాతకులు అయితే వచ్చే ఏడాది వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. మార్చి 2025 వరకు శని దేవుడు అనుగ్రహాన్ని పొందుతారు. తర్వాత మేష రాశికి శని సడే సతి ప్రారంభం అవుతుంది. కెరీర్, ఆర్థిక జీవితం, ప్రేమ జీవితంలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు కొన్ని సమస్యలు, అడ్డంకులు కూడా ఏర్పడతాయి. బృహస్పతి అనుగ్రహంతో డబ్బు సంపాదించింది. కెరీర్ లో ముందుకు సాగేందుకు అనేక అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సంబంధాల్లో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరం లాభం పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. ఆగస్టు తర్వాత నుంచి మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. రాహు, కేతు అనుగ్రహంతో మీ జీవితంలో పురోగతి ఉంటుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా పొందుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి కూడా 20025 వరకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. శని దేవుడి అనుగ్రహం వీరికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక జీవితం, ప్రేమ జీవితం బాగుంటుంది. బృహస్పతి సంచారం మీకు లాభాలను ఇస్తుంది. ఈ కాలంలో మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. కెరీర్ లో అపారమైన ప్రగతి సాధిస్తారు. ఈ సంవత్సరం మీ జీవితంలో ప్రతి రంగానికి మంచి సమయం.

మిథున రాశి

ఈ ఏడాది మొత్తం మిథున రాశి జాతకులు ఆనందంగా గడుపుతారు. 2025 వరకు శని స్థానం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీకు సహాయపడుతుంది. కార్యాలయంలో మంచి పురోగతి ఉంటుంది. అన్ని విషయాలతో సంతృప్తిగా ఉంటారు. విదేశాల నుండి జాబ్ ఆఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2025 సంవత్సరం మీ పురోగతికి మంచి సమయం అవుతుంది. అయితే జులై 13 నుంచి నవంబర్ 28 వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి

ఈ ఏడాది మొత్తం మకర రాశి వారికి సంతృప్తిగా ఉంటుంది. కెరీర్ లో మంచి అవకాశాలు లభిస్తాయి. విజయం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బృహస్పతి సంచారంతో డబ్బుకు సంబంధించిన విషయాలలో విజయాన్ని సాధిస్తారు. రాహువు, కేతువు ఆశీర్వాదంతో ఆర్థిక పరిస్థితి ఉత్తమంగా ఉంటుంది. జులై నెలలో ఆర్థిక సంక్షోభాన్నిఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత నెలలో శుక్రుడు మీ ఐదో ఇంట్లో బలమైన స్థానంలో ఉంటాడు. అందువల్ల ఆర్థిక పరిస్థితికి బలపడుతుంది. తగినంత డబ్బు అందుకుంటారు. సంబంధాలు కూడా బలపడతాయి.

తులా రాశి

తులా రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మార్చి 2025 వరకు శని మీ ఆరో ఇంట్లో ఉంటాడు. అందువల్ల కెరీర్, ఆర్థిక జీవితం, ప్రేమ సంబంధాల్లో మంచి ఫలితాలు ఏర్పడతాయి. రాహు, కేతు ఆశీస్సులు మీపై ఉంటాయి. డబ్బుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి

మార్చి 2025 వరకు శని కర్కాటక రాశి తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు. శని స్థానం వలన అధిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రీత్యా పురోభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.