Saturn rise: ఉదయించబోతున్న శని.. ఈ 5 రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి-saturn rise in kumbha rashi these zodiac signs get full benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Rise: ఉదయించబోతున్న శని.. ఈ 5 రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి

Saturn rise: ఉదయించబోతున్న శని.. ఈ 5 రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి

Gunti Soundarya HT Telugu
Mar 12, 2024 01:38 PM IST

Saturn rise: అస్తంగత్వం చెందిన శని గ్రహం త్వరలో ఉదయించబోతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. ఆర్థికంగా లాభపడతారు. ఏయే రాశుల వారికి శని అనుగ్రహం ఉంటుందో చూద్దాం.

కుంభ రాశిలో ఉదయించబోతున్న శని
కుంభ రాశిలో ఉదయించబోతున్న శని (stock photo)

జ్యోతిష్య శాస్త్రంలో శనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కర్మల అనుసారం ఫలితాలు ఇవ్వడం వల్ల శని దేవుడిని న్యాయాధిపతి అంటారు. శని సంచారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఏడాది మొత్తం శని తన కదలికలు మార్చుకుంటూ కుంభ రాశిలోనే సంచరిస్తాడు. ఇది జాతకులపై శుభ, అశుభ ప్రభావాలు చూపిస్తుంది.

వృత్తి, ధనం, వైవాహిక జీవితం వంటి వాటిపై జాతకంలో శని స్థానం ప్రభావం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అస్తంగత్వ దశలో ఉన్న శని మార్చి 18న ఉదయించబోతున్నాడు. జ్యోతిషశాస్త్రంలో శని ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ఏర్పడబోతోంది.

మేష రాశి

శని ఉదయించడం వల్ల మేష రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీ కోరికలు నెరవేరతాయి. వేతన జీవులకు ఈ సమయం ఎంతో శుభదాయకంగా ఉండబోతోంది. పదోన్నతితో పాటు జీవితంలో పెరుగుదల కూడా లభిస్తుంది. హోలీ తర్వాత మీ ఆదాయం పెరుగుతుంది. అదృష్టం కలిసి వచ్చి కెరీర్ లో అద్భుతమైన విజయాలు పొందుతారు. రోజువారి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఈ సమయంలో ఒక శుభవార్త వింటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు పొందుతారు. న్యాయపరమైన కేసుల్లో నుంచి బయట పడతారు.

మిథున రాశి

శనీశ్వరుడి అనుగ్రహం మిథున రాశి వారికి ఉంటుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. తల్లిదండ్రులకు పూర్తి సహకారం ఉంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటి పనులు ప్రారంభిస్తారు. శని దేవుడు చల్లని చూపుతో సంతోషం, శ్రేయస్సు, ఐశ్వర్యం పొందుతారు. సమాజంలో మీ గౌరవం రెట్టింపు అవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.

సింహ రాశి

కుంభ రాశిలో శని ఉదయించడం సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు. శని దేవుడు అనుగ్రహంతో కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. అవి లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యంగా కొద్దిగా సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ వాటిని అధిగమిస్తారు. వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.

కన్యా రాశి

శని గ్రహం రాకతో కన్యా రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ సమయం ఫలప్రదంగా ఉండబోతుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలలో విజయాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి విజయం లభిస్తుంది. కార్యాలయంలో మీ పనికి ప్రమోషన్, ప్రశంసలు దక్కుతాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారి జీవితం శని అనుగ్రహంతో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో లాభాలు పొందే అవకాశం ఉంది. పనిచేసే ప్రదేశంలో ఎదురయ్యే సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ధన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. శని ఉదయించడం వల్ల రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రయోజనాలు పొందుతారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

Whats_app_banner