మార్చి 12, నేటి రాశి ఫలాలు.. రాజకీయ నాయకులకు ఊహించని పదవులు, వ్యాపారులకు అనుకూలం
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ12.03.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 12.03.2024
వారం: మంగళవారం, తిథి : విదియ,
నక్షత్రం : రేవతి, మాసం : ఫాల్గుణం
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: ఉత్తరాయణం
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. అనుకోని ఖర్చులుంటాయి. వ్యాపారస్తులు వ్యాపారాలను విస్తరిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. బంధువుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మేష రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపారాధన చేయండి. రాహు కాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. వాహన, గృహయోగాలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. పైఅధికారుల నుండి ప్రశంసలు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యాపారస్తులకు గతం కంటే ఎక్కువ లాభదాయకం. నూతన విద్య, ఉద్యోగావకాశాలుంటాయి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించటం మంచిది. దేవీ ఖడ్గమాల పఠించండి.
మిథున రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. వస్తు, వస్త లాభాలుంటాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూల మార్పులుంటాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలుంటాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్యుని ఆలయం దర్శించటం మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి, రుణాలు తీరుస్తారు. కొన్ని ఇబ్బందులుంటాయి. అయితే పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. ధనవ్యయముండును. ఆంజనేయ స్వామి వారిని పూజించండి. అప్పాలను ఆంజనేయస్వామికి నివేదించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాలను స్వశక్తితో పూర్తి చేస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న ఆటంకాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కోరుకున్న మార్పులుంటాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. దుర్గాదేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని దర్శించడం మంచిది.
కన్యా రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. నూతన పరిచయాలుంటాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహంగా విధులు నిర్వర్తిస్తారు. ఆస్తి వివాదాలుండును. విద్యార్థులకు అనుకూల సమయం. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం మంచిది. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి.
తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. స్థిరాస్తి వివాదాలతో సతమతమవుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ అధికం. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు మరింత బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలుంటాయి. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు స్థానచలన మార్పులుంటాయి. శుభవార్తలుంటాయి. వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. రాజకీయనాయకులకు ఊహించని పదవులు రావచ్చు. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.
మకర రాశి
మకర రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. దూరప్రయాణాలుంటాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గణపతి స్తోత్రం పఠించాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలం. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. కొన్ని పనులు సాఫీగా పూర్తి చేస్తారు. భూముల వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. అనారోగ్య సమస్యలుంటాయి. రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. క్రీడాకారులకు అనుకూలం. కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారపరంగా కలసి వచ్చేటటువంటి సమయం. ఆస్తి వివాదాలుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలుంటాయి. శ్రమ పెరుగుతుంది. రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000