Sesame oil: నువ్వుల నూనెతో వంటలు చేయడం వల్ల ఎంత ఆరోగ్యమో... మీకు ఎవరూ చెప్పి ఉండరు, ఒకసారి తెలుసుకోండి-no one told you how healthy cooking with sesame oil is know the benefits of sesame oil ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sesame Oil: నువ్వుల నూనెతో వంటలు చేయడం వల్ల ఎంత ఆరోగ్యమో... మీకు ఎవరూ చెప్పి ఉండరు, ఒకసారి తెలుసుకోండి

Sesame oil: నువ్వుల నూనెతో వంటలు చేయడం వల్ల ఎంత ఆరోగ్యమో... మీకు ఎవరూ చెప్పి ఉండరు, ఒకసారి తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

Sesame oil: నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మంచిది, కానీ ఈ నువ్వుల నూనెతో ఆహారం వండే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. నువ్వుల నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి.

నువ్వుల నూనె ఉపయోగాలు (pexels)

Sesame oil: ఒకప్పుడు నువ్వుల నూనెతో అధికంగా కూరలను వినియోగించేవారు. కానీ ఇప్పుడు నువ్వుల నూనెను వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చాక దీన్ని వాడడమే మానేశారు. నిజానికి వాటన్నిటితో పోలిస్తే నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. నువ్వుల నూనె ఎందుకు తినాలో మీకు ఇంతవరకు ఎవరూ చెప్పి ఉండరు. దీనితో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు కచ్చితంగా ఈ నూనెను వంటల్లో భాగం చేసుకుంటారు.

నువ్వుల నూనె ఎందుకు తినాలి?

నువ్వుల నూనెతో కూరలు వండడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ముఖ్యంగా నువ్వుల నూనెలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. నువ్వుల నూనెతో వండిన ఆహారాలను తినడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం తగ్గుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. నువ్వుల నూనెలో బి విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అవసరమైనవి.

గుండె ఆరోగ్యానికి నువ్వుల నూనె

నువ్వుల నూనెలో మన శరీరానికి అవసరమైన మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కొవ్వులు చాలా అవసరం. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనివల్ల గుండెపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

నువ్వుల నూనెలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే నువ్వుల నూనె తిన్నవారి ఎముకలు చాలా బలంగా ఉంటాయి. ఒకప్పుడు నువ్వుల నూనె ఎక్కువగా ఆహారంలో వినియోగించేవారు. అందుకే వారు చాలా దృఢంగా ఉండేవారు. చిన్న పిల్లలకు నువ్వుల నూనెతో వండిన ఆహారాన్ని తినిపించడం చాలా ముఖ్యం.

జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడడానికి నువ్వుల నూనె ఎంతో మేలు చేస్తుంది. నువ్వుల నూనెతో చేసిన ఆహారాలు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. అలాగే పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియాను కాపాడేందుకు కూడా ఇవి సహకరిస్తాయి.

చర్మం మెరుపుకు నువ్వుల నూనె

యువత నువ్వుల నూనెతో ఉండిన ఆహారాలను తినడం చాలా ముఖ్యం. వారి చర్మం, జుట్టు అందంగా మెరిసిపోతుంది. చర్మానికి, జుట్టుకు కావలసిన పోషణను నువ్వుల నూనె అందిస్తుంది. విటమిన్ ఈ చర్మాన్ని, జుట్టును మెరిపిస్తుంది. చర్మం ఆరోగ్యంగా, జుట్టు మెరుపుతో ఉండాలంటే నువ్వులను ఆహారంలో భాగం చేసుకోండి.

ఆధునిక కాలంలో ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. అలాంటి వ్యాధులకు చెక్ పెట్టాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. ఈ నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, సమ్మేళనాలు ఎన్నో ఉంటాయి. ఈ రోగనిరోధక శక్తిని బలంగా మార్చి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. నువ్వుల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి, కాబట్టి సాధారణ నూనెతో పోలిస్తే నువ్వుల నూనెను తక్కువగా వినియోగిస్తే మంచిది. అంటే రెండు స్పూన్ల సాధారణ నూనె వాడే దగ్గర కేవలం ఒక స్పూన్ నువ్వుల నూనె వాడితే సరిపోతుంది. లేదా ప్రతిరోజు నువ్వుల నూనెతో వండే కన్నా... వారానికి నాలుగైదు సార్లు నువ్వుల నూనె వంటలను తింటే అన్ని పోషకాలను అందుతాయి.