Mercury transit: మే నెలలో మరోసారి రాశిని మార్చుకోబోతున్న బుధుడు.. ఈ రాశుల వారికి టెన్షన్ టెన్షన్-mercury transit second time in may 31st 2024 these zodiac signs get tension life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: మే నెలలో మరోసారి రాశిని మార్చుకోబోతున్న బుధుడు.. ఈ రాశుల వారికి టెన్షన్ టెన్షన్

Mercury transit: మే నెలలో మరోసారి రాశిని మార్చుకోబోతున్న బుధుడు.. ఈ రాశుల వారికి టెన్షన్ టెన్షన్

Gunti Soundarya HT Telugu
May 29, 2024 11:27 AM IST

Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు మే నెలలో మరోసారి రాశిని మార్చుకోబోతున్నాడు. మే 31వ తేదీ బుధుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి టెన్షన్ పెరుగుతుంది.

బుధుడి సంచారంతో ఈ రాశుల వారికి టెన్షన్
బుధుడి సంచారంతో ఈ రాశుల వారికి టెన్షన్ (pinterest)

Mercury transit: జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహాన్ని తెలివితేటలు, విచక్షణ, వాక్కు, ఉల్లాస స్వభావం, సంతోషం, అదృష్టానికి కారకంగా భావిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం గ్రహాల రాకుమారుడు మే నెలలో మరోసారి రాశిని మార్చుకుంటున్నాడు.

మే 31 మధ్యాహ్నం మేష రాశిని వదిలి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 14 వరకు ఇదే రాశిలో ఉంటాడు. అక్కడ ఇప్పటికే సూర్యుడు, బృహస్పతి, శుక్రుడు ఉన్నారు. జ్యోతిష లెక్కల ప్రకారం బుధుడి సంచారం బుధాదిత్య యోగం, గజలక్ష్మీ రాజయోగం, లక్ష్మీనారాయణ యోగం సహా అనేక శుభకార్యాలను సృష్టిస్తుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. కానీ కొంతమంది జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేష రాశి నుంచి మీనం వరకు బుధుడి సంచార ప్రభావం ఎలా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం.

మేష రాశి

బుధుడి సంచారం వల్ల మేష రాశి వారికి శుభ ఫలితాలను లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు విజయానికి బాటలు వేస్తాయి. పనికి తగిన ఫలితం ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి రాబడి వస్తుంది. వ్యాపారం విస్తరించుకుంటారు. ఈ సమయంలో మేషరాశి జాతకులు పేదలు అవసరమైన వారికి ఆకుపచ్చ వస్తువులు దానం చేయాలి.

వృషభ రాశి

బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన సమయంలో ఈ రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. పనులు చేయాలనిపిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ కలలన్నీ నిజమవుతాయి. ముఖమైన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆఫీసులో ప్రతిభను ప్రదర్శించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకు ఆకుపచ్చ రంగు దుస్తులు దానం చేయండి.

మిథున రాశి

మిథున రాశి వారి జీవితంలో బుధుడి సంచారం ఒడిదుడుకులకు కారణం అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గత జ్ఞాపకాలతో మనసు కలత చెందుతుంది. భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. కార్యాలయంలో సహోద్యోగులతో సన్నిహితంగా పనిచేస్తారు. అశుభ ప్రభావాలను నివారించేందుకు ప్రతి గురువారం పెసరపప్పు దానం చేయాలి. అలాగే వాటిని తినడం మంచిది.

కర్కాటక రాశి

బంధు మిత్రుల నుంచి మద్దతు లభిస్తుంది. వినూత్న ఆలోచనలతో చేసే పనులు సత్ఫలితం ఇస్తాయి. కార్యాలయంలో ఉన్నతాధికారులు మీ పనులను మెచ్చుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి .ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. బుధ గ్రహం శుభ ప్రభావాన్ని పొందేందుకు సోంపుని ఉదయం భోజనం తర్వాత తీసుకోండి.

సింహ రాశి

సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఆఫీసులో కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విజయం సాధించేందుకు కష్టపడతారు. అలాగే ఇతరుల సలహాలు జాగ్రత్త వినాలి. అవి ప్రగతి మార్గాన్ని సులభతరం చేస్తుంది. ప్రతికూల ప్రభావాలను నివారించడానికి బుధుడికి సంబంధించిన మంత్రాలు ప్రతిరోజు జపించాలి.

కన్యా రాశి

బుధుడి సంచార ప్రభావంతో కన్యా రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో గందరగోళానికి గురవుతారు. అయితే న్యాయ శాస్త్రం, సంస్కృతి వంటి రంగాల్లో ఉన్న విద్యార్థులు, పనిచేస్తున్న ఉద్యోగులు వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఒంటరి జాతకులు ఆసక్తికరమైన వ్యక్తిని కలుసుకుంటారు .జీవితంలో కొత్త విషయాలు అన్వేషించేందుకు సిద్ధంగా ఉండాలి.

తులా రాశి

పెట్టుబడులు మంచి రాబడి ఇస్తాయి. వృత్తిలో కృషి, నిజాయితీతో చేసిన పని అద్భుతమైన ఫలితాలని వస్తుంది. ధన లాభం పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బుధుడి అనుగ్రహం కోసం సామాజిక సేవలో పాల్గొనండి. శక్తి మేరకు పేదలకు నిరుపేదలకు ఆహారం, డబ్బు దానం చేయాలి.

వృశ్చిక రాశి

బుధ సంచారం వల్ల వృశ్చిక రాశి వారు వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. కార్యాలయంలో ప్రశంసలు ఉంటాయి .ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి. ఈ సమయంలో సంబంధాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు అనువుగా ఉంటుంది. ఆకుపచ్చని వస్తువులు మీతో ఉంచుకుంటే బుధుడి అనుగ్రహం లభిస్తుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో సవాళ్లు అధికమవుతాయి. కఠోర శ్రమ అంకితభావం గొప్ప విజయానికి దారితీస్తాయి. సోమరితనానికి దూరంగా ఉండాలి. మితిమీరిన ఖర్చుల వల్ల మనసు కలత క చెందుతుంది. డబ్బు ఆదా చేసుకోవడానికి ప్రయత్నించాలి. కెరీర్ ఎదుగుదల కోసం ఈ సమయంలో కొత్త కోర్సులు నేర్చుకోవడం మంచిది.

మకర రాశి

ఈ సమయం మకర రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలోచనలతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. ధన లాభానికి అవకాశాలను పెంచుతుంది. వినాయకుడికి పూజలు చేయడం మరెన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

బుధుడి సంచారం కుంభ రాశి వారి జీవితంలో సానుకూలతను పెంచుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు. విద్యార్థుల పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. వృత్తి సమస్యలు దూరం అవుతాయి. లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటే కెరీర్ ఎదుగుదలకు అనేక అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో వినాయకుడిని పూజించి మోదక్ సమర్పించాలి.

మీన రాశి

బుధుడి సంచారం మీన రాశి జాతకుల జీవితంపై అశుభ ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో ఏకాగ్రత లోపిస్తుంది. వృత్తిలో సవాళ్లు అధికమవుతాయి. పని చేయాలని అనిపించదు. ఆఫీస్ లో పనుల వల్ల ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. దీని కారణంగా కుటుంబంతో సమయం గడపలేకపోతారు. ఈ కాలంలో వ్యాపార పరంగా ఎలాంటి రిస్కు తీసుకోవద్దు. ఈ సమయంలో ఇత్తడి వస్తువులు, పెసరపప్పు, పండ్లు దానం చేయడం మంచిది.

 

WhatsApp channel