Goddess Lakshmi : శుక్రవారం ఈ పొరపాట్లు చేశారో, లక్ష్మీదేవిని మీరే చేజేతులా మీ ఇంటి నుంచి బయటికి పంపించినట్లే!-friday bad habits which makes goddess lakshmi angry and invites misfortune ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Goddess Lakshmi : శుక్రవారం ఈ పొరపాట్లు చేశారో, లక్ష్మీదేవిని మీరే చేజేతులా మీ ఇంటి నుంచి బయటికి పంపించినట్లే!

Goddess Lakshmi : శుక్రవారం ఈ పొరపాట్లు చేశారో, లక్ష్మీదేవిని మీరే చేజేతులా మీ ఇంటి నుంచి బయటికి పంపించినట్లే!

Galeti Rajendra HT Telugu
Aug 16, 2024 07:40 AM IST

Goddess Lakshmi : లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం కోసం హిందువులందరూ ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. కానీ తెలిసో.. తెలియకో శుక్రవారం రోజున హడావుడిగా ఈ పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవి అమ్మవారు ఆగ్రహించి మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోతారు.

లక్ష్మీదేవి అమ్మవారు
లక్ష్మీదేవి అమ్మవారు (Unsplash)

Goddess Lakshmi : హిందూ సంప్రదాయంలో శుక్రవారం రోజును చాలా పవిత్రంగా చూస్తారు. పూజలు, వ్రతాలు, నోములు చేసుకునే వారు చాలా మంగళప్రదమైన రోజుగా శుక్రవారాన్ని భావిస్తారు. శుక్రవారం, శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చిన ఈ పుత్రద ఏకాదశి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది. కానీ ఈరోజు ఈ పొరపాట్లు చేశారో అమ్మవారి ఆగ్రహానికి బలికావాల్సి ఉంటుంది.

ఈరోజు శుభ్రం చేయొద్దు

చాలా మంది బిజీ లైఫ్ లేదా తీరిక లేకనో శుక్రవారం ఉదయం నిద్రలేచి పూజగదిలోని విగ్రహాలను, చిత్రపటాలను శుభ్రం చేస్తుంటారు. ఇలా చేయడం శుభప్రదం కాదు. శుభ్రం చేసిన తర్వాత మళ్లీ పసుపు, కుంకుమ పెట్టి పూజిస్తాం కదా అనుకోవచ్చు. కానీ శుక్రవారం రోజున అలా చేస్తే లక్ష్మీదేవి అమ్మవారికి ఆగ్రహం వచ్చి మీ ఇల్లు వదిలి వెళ్లిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి శుక్రవారానికి ఒక రోజు లేదా రెండు రోజుల ముందు పూజగదిలోని విగ్రహాలు, చిత్రపటాలను శుభ్రం చేసుకోవడం ఉత్తమం.

బయట పడేశారో.. డబ్బుని విసిరేసినట్లే

శుక్రవారం రోజున పూజగదిని శుభ్రం చేయడం ఒక తప్పిదమైతే.. ఇంట్లో పగిలిన దేవుళ్ల పటాలు, డ్యామేజ్ అయిన చిన్న విగ్రహాలను గుడి వద్దకి లేదా చెట్ల వద్దకో తీసుకెళ్లి పెట్టడం చేస్తుంటారు. ఇలా చేస్తే ఇంట్లోని లక్ష్మీదేవిని బయటికి తీసుకెళ్లి.. బయటి నుంచి దరిద్రాన్ని ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి.

సంధ్యా సమయం.. డోర్స్ ఓపెన్

పల్లెటూర్లలో సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తెరిచే ఉంచుతారు. కానీ సిటీల్లో ప్రైవసీ, సెక్యూరిటీ కారణాలు చెప్పి తలుపు ఎప్పుడూ మూసి ఉంచుతారు. కానీ సంధ్యా సమయంలో దీపాలు వెలిగించేటప్పుడు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని పండితులు చెప్తున్నారు. ఒకవేళ ఆ సమయంలో మీరు తలుపులు మూసి ఉంచితే.. లక్ష్మీదేవి మీ గడప తొక్కదు.

లక్ష్మీదేవిని మీ చేతులతో ఇవ్వొద్దు

హిందువులు సాధారణంగా గృహ ప్రవేశాలను శుక్రవారం రోజున ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. ఆ కార్యక్రమానికి మీరు హాజరైతే ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీదేవి చిత్రపటం లేదా ప్రతిమలను గిఫ్ట్‌గా వాళ్లకి ఇవ్వొద్దు. ఒకవేళ ఇచ్చారో.. మీ చేతులతో మీరే లక్ష్మీదేవిని వదులుకున్నట్లు అవుతుంది. కాబటి శుక్రవారం బహుమతులు ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది.

డబ్బులు ఇవ్వొద్దు.. తీసుకోవద్దు

శుక్రవారం రోజున డబ్బును ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా చిక్కులు తెచ్చిపెట్టేదే. ఒకవేళ మీరు ఇతరులకి శుక్రవారం డబ్బు ఇస్తే.. మీ అంతకి మీరే లక్ష్మీదేవిని వదులుకున్నట్లు అవుతుంది. ఒకవేళ అప్పుగా మీరు తీసుకుంటే.. ఇక అప్పు దారిద్ర్యం మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాలకి శుక్రవారం దూరంగా ఉండటం ఉత్తమం. మరీ ముఖ్యంగా సంధ్యా సమయంలో ఎలాంటి డబ్బు వ్యవహారాలు చేయొద్దు. ఒకవేళ చేస్తే లక్ష్మీ కటాక్షానికి మీరు దూరం కావాల్సి వస్తుంది.

లక్ష్మీదేవి అమ్మవారి మెప్పు పొందాలంటే

లక్ష్మీదేవి అమ్మవారి మెప్పు పొందాలంటే ప్రతి శుక్రవారం మీరు నియమనిష్ఠలతో కొన్ని పనులు చేయాలి. సాయంత్రం వేళ లక్ష్మీదేవిని అష్టోత్తర నామాలతో పూజించాలి. ఆ తర్వాత ఐదుగురు ముత్తైదువులకి పుసుపు కుంకుమలతో కలిపి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. పూజ మందిరంలో నిత్యం దీప కాంతులతో వెలుగు ఉండేలా చూసుకుంటూ నియమనిష్ఠలతో అమ్మవారిని పూజిస్తూ ఇంట్లోకి ఆహ్వానించాలి.