మే 3, నేటి రాశి ఫలాలు..వీరు లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠిస్తే ఆర్థిక సమస్యలు ఉండవు-today rasi phalalu in telugu may 3rd 2024 check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 3, నేటి రాశి ఫలాలు..వీరు లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠిస్తే ఆర్థిక సమస్యలు ఉండవు

మే 3, నేటి రాశి ఫలాలు..వీరు లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠిస్తే ఆర్థిక సమస్యలు ఉండవు

HT Telugu Desk HT Telugu
May 03, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ03.05.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 3వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 3వ తేదీ నేటి రాశి ఫలాలు (pinterest)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 08.05. 2024

వారం: శుక్రవారం, తిథి : దశమి,

నక్షత్రం : శతభిష, మాసం : చైత్రం,

సంవత్సరం: శ్రీ క్రోధినామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియచేయాలి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. మీ కుటుంబ విషయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. రుణదాతల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. తాకట్టు పెట్టిన వస్తువులను విడిపిస్తారు. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. బంధుమిత్రుల కలయికతో ఉత్సాహం చెందుతారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, ప్రమోషన్‌ ఆర్డర్లు చేతికందుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం మంచిది. రాజకీయాలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. బ్యాంకు పనులు, దూరప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కూర, పండ్లు, కొబ్బరి, ధాన్య, స్టాక్ మార్కెట్ వారికి కలసివచ్చే కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్‌ రంగాలలో వారికి అనుకూలం. దూర ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. అర్థాంతరంగా నిలిపి వేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదాలను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగాలేదు. ఉద్యోగస్తులకు రావలసిన క్షైములు మంజూరవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. హోటల్‌, తినుబండారాలు, క్యాటరింగ్‌ పనివారలకు పురోభివృద్ధి. ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. అదనపు రాబడి దిశగా మీ అలోచనలుంటాయి. ప్రింటింగ్‌ రంగాల వారికి అక్షర దోషాల వల్ల చికాకులు తప్పవు. శ్రీకృష్ణుడిని పూజించాలి. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లలితా స్తోత్రాన్ని పఠించండి. లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించడం ఆర్థిక సమస్యలు తొలగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఏకాగ్రత లోపించడం వల్ల విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ప్రింటింగ్‌ రంగాల వారికి బకాయిల వసూళ్ళతో ప్రయాసలు తప్పవు. ప్రేమికులు ఇతరుల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. మీరు కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. తులా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. ఒక్మోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి సదావకాశాలు లభిస్తాయి. మొండి ధైర్యంతో మించి అనుకున్నది సాధిస్తారు. పెద్దల ఆహార ఆరోగ్య విషయాల్లో మెళకువ వహించండి. వృశ్చికరాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. బంధువుల రాకతో ధనం అధికంగా వ్యయంగా చేస్తారు. విజ్ఞతతో వ్యవహరించి రుణదాతలను సమాధానపరుస్తారు. మీ ఆంతరంగిక, కుటుంబ సమస్యలు రహస్యంగా ఉంచండి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. దుబారా ఖర్చులు అధికం. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. మీ పనులు, కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో క్షణం తీరిక ఉండదు. ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు విదేశీ పర్యటనల కోసం చేసే ప్రయత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ కూడదు. గృహ నిర్మాణాలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. గత విషయాలు జ్జప్తికి రాగలవు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel