మే 2, నేటి రాశి ఫలాలు.. అన్ని విషయాలలో కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి-daily horoscope may 2nd today rasi phalalu in telugu check your zodiac signs results ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 2, నేటి రాశి ఫలాలు.. అన్ని విషయాలలో కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి

మే 2, నేటి రాశి ఫలాలు.. అన్ని విషయాలలో కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి

HT Telugu Desk HT Telugu
May 02, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ02.05.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 2వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 2వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 02.05.2024

వారం: గురువారం, తిథి : నవమి,

నక్షత్రం : ధనిష్ట, మాసం : చైత్రం,

సంవత్సరం: శ్రీ కోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. మీరు చేసే ప్రతీ పని సత్ఫలితాలనిస్తాయి. అవకాశాలు కలసి వస్తాయి. గత ఇబ్బందులను దూరం చేసుకుంటారు. కుటుంబసభ్యుల సహాయ సహకారాలుంటాయి. ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు వృత్తి ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. సమయానుకూలంగా వ్యవహరించి పెద్దలను ఆకట్టుకుంటారు. అన్ని విషయాలలో కలిసి వచ్చే రోజు. వ్యాపారంలో విశేష ధనలాభముంది. మీ లక్ష్యాన్ని సాధిస్తారు. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల సహాయ సహకారాలుంటాయి. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో తగిన జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి. చెడు ఆలోచించవద్దు. నూతన పరిచయాలు ఇబ్బంది కలిగిస్తాయి. శుభవార్త వింటారు. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అనుకున్నది సాధించే వరకు సహనంతో వ్యవహరించాలి. అపార్థాలకు అవకాశముంది. ఆర్థికపరంగా అనుకూల సమయం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎట్టి పరిస్థితులలోను అశ్రద్ధ వహించవద్దు. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. నూతన విషయాలు తెలుసుకుంటారు. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. మిత్రుల వల్ల కొన్ని పనులు పూర్తవుతాయి. ప్రతీ విషయం అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు ఉద్యోగపరంగా అనుకూల సమయం. మీ ప్రతిభతో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి పనులు చేయాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక విజయం సాధించేవరకు కృషి చేస్తూనే ఉండాలి. ఎవరికైనా ధనం ఇస్తే అది తిరిగిరాదు. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శంకరాచార్య విరాచిత దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు లాభాదాయకం. మీరు పెట్టే పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఆదాయ మార్గాలు గోచరిస్తున్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు కలసివస్తాయి. తులా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. శనగలు భగవంతునికి నివేదనగా సమర్పించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మీరు సకాలంలో పనులు పూర్తి చేస్తే సత్ఫలితాలుంటాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. చెడు ఆలోచనలు చేయవద్దు. నిరుత్సాహం పనికిరాదు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించాలి. ఎదురుచూస్తున్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. వృశ్చిక రాశి మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించాలి. దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు. జీవితాశయాలు నెరవేరతాయి. శుభవార్త వింటారు. ఉద్యోగంలో పదోన్నతులుంటాయి. కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం శ్రీరామరక్షాస్తోత్రాన్ని పరించండి. శ్రీరామనామస్మరణ చేయండి. రామాలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ అలోచనలతోను, మాటలతోను ఇతరులను ఒత్తిడికి గురిచేయు సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు, పని ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రయోజనాలుంటాయి. సంతానపరంగా కొన్ని వ్యవహారాలు చికాకు పెడతాయి. పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేసుకోవాలి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించండి. గురు చరిత్ర పారాయణం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆనందాన్నిస్తాయి. ముఖ్య విషయాల్లో విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సమయానుకూలంగా వ్యవహరించాలి. ఒక పని పూర్తవుతుంది. శత్రుపీడ తొలగుతుంది. రుణ సమస్యలు తొలగుతాయి. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపారపరంగా అనుకూల సమయం. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రతి అడుగూ అచితూచి వేయాలి. తెలియని ఆటంకాలున్నాయి. బుద్ధిబలంతో వ్యవహరించాలి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీకోసం మీరు ఆలోచించుకోవాలి. ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తుంది. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ