Varalakshmi Vratham Wishes: లక్ష్మీదేవి అనుగ్రహం మీ బంధుమిత్రులకు కలగాలని కోరుకుంటూ వరలక్ష్మివ్రతం శుభాకాంక్షలు చెప్పండి
Varalakshmi Vratham Wishes: శ్రావణమాసం వచ్చిందంటే మహిళలు లక్ష్మీదేవిని ఆరాధించేందుకు సిద్ధమవుతారు. మీ బంధుమిత్రులను తెలుగులోనే ఇలా శుభాకాంక్షలు చెప్పండి.
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు (pexels)
Varalakshmi Vratham Wishes: శ్రావణమాసంలో వచ్చే అతి పెద్ద పండుగ వరలక్ష్మి వ్రతం. శ్రావణమాసం హిందువులకు పవిత్రమైన మాసం. శ్రావణమాసంలో ప్రతిరోజూ శుభదినమే. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించుకుంటారు. ఈ వ్రతాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు అంతగా లభిస్తాయని భక్తుల నమ్మకం. వివాహమైన మహిళలు తమ కుటుంబ సంక్షేమం కోసం, సిరి సంపదల కోసం లక్ష్మీదేవి ఘనంగా ఆరాధిస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం చేస్తే అష్టలక్ష్ములను ఒకేసారి పూజించిన ఫలితం దక్కుతుంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీ బంధుమిత్రులకు మెసేజ్‌లు, వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలియజేయండి. ఇక్కడ మేము కొన్ని వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అందించాము.
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
1. మీరు ప్రారంభించే మంచి పనులలో
ఆ మహాలక్ష్మి దీవెనలు మీకు ఉండాలని ఆశిస్తూ
మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
2. పవిత్ర మాసమైన శ్రావణంలో
వరలక్ష్మీ వ్రతం పండుగ నిర్వహించుకునే మహిళలు
వారి కుటుంబ సభ్యులకు
ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు లభించాలని కోరుతూ
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
3. స్త్రీలకూ సకల సౌభాగ్యాలను ఇచ్చే
వరలక్ష్మీ వ్రతం చేసిన వారికి ఎంతో సౌభాగ్యం
అలాంటి సకల సౌభాగ్యాలు కలిగించే వరలక్ష్మీదేవి
మీకు సకల ఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు
4. లక్ష్మీదేవి అనుగ్రహంతో
ప్రతి ఒక్కరూ సకల శుభాలు
సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ
వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు
5. తెలుగింటి ఆడపడుచులకు
సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం
అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు
6. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం
సదా మీపై ఉండాలని కోరుతూ
మీకు మీ కుటుంబ సభ్యులకు
వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు
7. ఆ వరలక్ష్మి దేవి అనునిత్యం
మిమ్మల్ని కాపాడాలని
మీకు సకల సౌభాగ్యాలను కల్పించాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు
వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు
8. ఎలాంటి అడ్డంకులు లేకుండా
మీ జీవితాన్ని మీరు సాఫీగా గడపాలని కోరుకుంటూ
ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
9. వరలక్ష్మీదేవి మీ కుటుంబానికి
సిరిసంపదలు, ఆయురారోగ్యాలు
ప్రసాదించాలని కోరుకుంటూ
వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు
10. పద్మాసనే పద్మ కరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియాదేవి సుప్రీతాభవ సర్వదా
క్షీరోధార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురా సుర నమస్కృతి
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః
మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు
11. నమస్తేస్తు మహామాయే
శ్రీ పీఠే సురపూజితే
శంఖ చక్ర గదాహస్తి
మహాలక్ష్మి నమోస్తుతే
మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు