Sri rama navami 2024: ఈ మంత్రాలు నిత్యం పఠించారంటే శ్రీరాముడి ఆశీస్సులు ఎప్పుడు మీ వెంటే
Sri rama navami 2024: శ్రీరాముడికి సంబంధించిన కొన్ని మంత్రాలు పఠించడం వల్ల ఆయన ఆశీస్సులు పొందుతారు. జీవితంలోని కఠినమైన సవాళ్ళను సులభంగా అధిగమించగలుతారు.
Sri rama navami 2024: 'రామ' అనే ఈ రెండు అక్షరాలు ఎంతో శక్తివంతమైన మంత్రాలు. శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు. శ్రీరామ అని మూడు సార్లు జపించడం వల్ల విష్ణు సహస్రనామం పారాయణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది.
కష్టాల్లో ఉన్నప్పుడు, కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సినపుడు శ్రీరామ అనే మంత్రం జపించడం అన్నిటికీ పరిష్కారమని పండితులు సూచిస్తున్నారు. ఏడుకోట్ల మంత్రాలలో అత్యంత శక్తివంతమైన మంత్రం రామ అని మనుస్మృతిలో పేర్కొన్నారు.
రామ అనే మంత్రం జపించడం వల్ల ఆధ్యాత్మిక పరిపూర్ణతకు మార్గం ఏర్పడుతుంది. శ్రీరాముని పట్ల భక్తిని సూచిస్తుంది. ఆయన అనుసరించిన సూత్రాలకు కట్టుబడి ఉంటేనే మనిషిగా పరిపూర్ణత సాధిస్తారు. శ్రీరాముడికి సంబంధించిన కొన్ని మంత్రాలని జపించడం వల్ల భౌతిక శ్రేయస్సు లభిస్తుంది. సంతోషంగా జీవనం సాగిస్తారు. ఈ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన ఈ మంత్రాలు పఠించారంటే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. సకల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. శ్రీరాముని అనుగ్రహంతో మనసు ప్రశాంతతో నిండిపోతుంది.
రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథాయ నాథాయ సీతాయః పతయే నమః
ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. శ్రీరాముడు ఎప్పుడూ మీ వెంటే ఉన్న భావన కలుగుతుంది. జీవితాన్ని సరైన మార్గంలో నడిపించగలుగుతారు. శ్రీరాముడిని తండ్రి దగ్గర నుంచి భార్య సీతమ్మ వరకు ఒక్కొక్కరూ ఒక్కో పేరుతో పిలిచే వాళ్ళు. ఆ పేర్లన్నీ కలగలిపిన మంత్రమే ఇది.
ఓం క్లీం నమో భగవతే రామచంద్రాయ సకలజన్ వశ్యం కరాయ స్వాహా
ఈ మంత్రం జపించడం వల్ల సద్గుణాలు అలవడతాయి. శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తారు.
ఓం దశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నో రామం ప్రచోదయాత్
పవిత్రమైన రామ గాయత్రీ మంత్రం పఠించడం వల్ల వైవాహిక జీవితంలోని ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి. శ్రీరాముడిని ఆరాధించే సీతమ్మ తల్లికి ఈ మంత్రం అంకితం చేయబడింది. ఈ మంత్రాన్ని పఠించినప్పుడు మెదడు సమతుల్యం అవుతుంది.
శ్రీరామ జయరామ కోదండరామ
శ్రీరాముడిని కోదండరాముడు అని కూడా పిలుస్తారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో విజయాలను సాధిస్తారు. సామరస్యం నెలకొంటుంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఆందోళనలు తొలగిపోతాయి.
హీన్ రామ్ హీన్ రామ్
ఆధ్యాత్మికంగా బలపడేందుకు ఈ మంత్రం ఉపయోగపడుతుంది.
రామాయ నమః
ఈ మంత్రం పఠించడం వల్ల వ్యక్తి ఏకాగ్రత మెరుగుపడుతుంది. జ్ఞానం పొందుతారు. శ్రద్ధగా తప్పులు లేకుండా సరైన ఉచ్చారణతో ఈ మంత్రం పఠించడం వల్ల నైతిక స్వచ్ఛత, మనసులోని మలినాలను ప్రక్షాళనకు సహాయపడుతుంది
శ్రీరామ శరణం మమ
ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల భక్తుడు గొప్ప శారీరక, మానసిక ధైర్యాన్ని పొందుతాడు. శరీరం ఆనందంతో నిండుతుంది. శారీరక స్వస్థత పొందుతారు.
శ్రీరామచంద్రాయ నమః
ఈ మంత్రాన్ని పఠిస్తే చంద్ర దేవుడిని, శ్రీరాముడిని పూజించినట్లే అవుతుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక ఆందోళన నుంచి బయటపడతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది.