Independence day 2023 : జయహో.. జయజయహో “భారత్​”- నీ ఘనతలు ప్రపంచానికే స్పూర్తి!-voting rights to cricket world cups list of indias achievements post independence ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Independence Day 2023 : జయహో.. జయజయహో “భారత్​”- నీ ఘనతలు ప్రపంచానికే స్పూర్తి!

Independence day 2023 : జయహో.. జయజయహో “భారత్​”- నీ ఘనతలు ప్రపంచానికే స్పూర్తి!

Sharath Chitturi HT Telugu
Aug 12, 2023 10:30 AM IST

మరికొన్ని రోజుల్లో దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో 1947 నుంచి ఇప్పటివరకు భారత్​ సాధించిన ఘనతలను ఒక్కసారి గుర్తుచేసుకుందాము..

జయహో.. జయజయహో “భారత్​”- నీ ఘనతలు ప్రపంచానికే స్పూర్తి!
జయహో.. జయజయహో “భారత్​”- నీ ఘనతలు ప్రపంచానికే స్పూర్తి!

Independence day 2023 : "భారతీయులు చదువు లేని వారు. వారికి ఎలా జీవించాలో తెలియదు. స్వాతంత్ర్యం తర్వాత భారత దేశం పతనమవుతుంది".. ఇది స్వాతంత్ర్యానికి ముందు కొందరు అనుకున్న మాటలు. కానీ దేశ కీర్తి ప్రతిష్ఠతలను ప్రపంచ నలుమూలలా చాటిచెప్పే విధంగా మన భారత్​ ఎదిగింది. అనేక దేశాలకు స్పూర్తిగా నిలిచింది. ఈ 2023 స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో.. ఇండియా సాధించిన ఘనతలను ఒక్కసారి గుర్తు చేసుకుందాము..

ఓటు హక్కు నుంచి పోలియో రహిత దేశం​ వరకు..

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ప్రజలకు ఓటు హక్కు లభించింది! ఇది సాధారణ విషయం అని అనిపించొచ్చు.. కానీ అగ్రరాజ్యం అమెరికాలో ప్రజలు.. తమ ఓటు హక్కు కోసం స్వాతంత్ర్యం తర్వాత దాదాపు 150ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్​ అవతరించింది. బలమైన రాజ్యాంగం ఉండటమే ఇందుకు కారణం.

1951లో భారతీయ రైల్వే ఏర్పడింది. ఇప్పుడు.. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ, రద్దీ రైల్​ నెట్​వర్క్​ కలిగిన దేశంగా ఇండియా ఎదిగింది. 7వేలకుపైగా స్టేషన్స్​ ఉన్న ఏకైక దేశం ఇండియా!

1956లో అప్సర న్యూక్లియర్​ రియాక్టర్​ను డెవలప్​ చేసి, ప్రపంచానికి తన సత్తా చాటింది భారత్​. "మేము లేకపోతే భారత్​ నాశనమవుతుంది" అని చెబుతూ వచ్చిన బ్రిటీషర్లకు సైతం షాకిచ్చింది.

India's achievements post independence in Telugu : వ్యవసాయ దేశంగా గుర్తింపు పొందినప్పటికీ, ఇండియాలో ఆహార లోటు ఉండేది. దీనిని అధిగమించేందుకు 1967లో గ్రీన్​ రివొల్యూషన్​ ఉద్యమం మొదలైంది. ఇప్పుడు.. ధాన్యాలు ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశంగా ఎదిగింది. గోధుమ, వరి, చరకును ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. వీటి ఎగుమతిని ఇండియా నిషేధిస్తే.. ప్రపంచవ్యాప్తంగా ధరలు భారీగా పెరుగుతాయి.

పోలియోను అరికట్టడం.. భారత దేశ ఘనతల్లో అతి ముఖ్యమైనది! 1994లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలియో కేసుల్లో 60శాతం ఇండియావే. అక్కడి నుంచి కేవలం రెండు దశాబ్దాల్లోనే.. పోలియో రహిత దేశంగా ఆవిర్భవించింది ఇండియా.

1947కి ముందు ఇండియాలో ఆయుర్దాయం రేటు 32ఏళ్లుగా ఉండేది. స్వాతంత్ర్య తర్వాత అది దాదాపు 70ఏళ్లకు చేరింది. దేశ ఆరోగ్య వ్యవస్థ శక్తిని ఇది చాటిచెబుతోంది.

ఇక్కడ కొవిడ్​పై భారత్​ చేసిన పోరాటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. తన ఔషధ శక్తిని భారతీయులకే కాకుండా.. ప్రపంచానికి సైతం అందించి, ఆపదలో ఆదుకుని హీరోగా నిలిచింది ఇండియా.

స్వాతంత్ర్య తర్వాత మిలిటరీని బలోపేతం చేసుకోవడంలో ఇండియా చాలా ఫోకస్​ చేసింది. ఫలితంగా ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక దళం కలిగిన దేశంగా ఎదిగింది.

ఇదీ చూడండి:- Independence Day 2023: మన జాతీయ జెండా గురించి ఎవ్వరికీ తెలియని అరుదైన విశేషాలు.. మీ కోసం..

పోక్రాన్​ నుంచి క్రికెట్​ వరల్డ్​ కప్స్​ వరకు..

ఇక ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్​ సంస్థగా ఆవిర్భవించింది ఇండియా. త్వరలోనే నెం.2 స్థానానికి చేరుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఎలక్ట్రిక్​ వాహనాలకు ఇండియా మార్కెట్​ హాట్​స్పాట్​గా మారింది.

Independence day 2023 Theme : ఇండియా గ్రోత్​ స్టోరీపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో 5వ స్థానంలో ఉంది. 2075 నాటికి నెం.2కి చేరుతుందని అంచనాలు వెలువడుతున్నాయి.

1974లో పోక్రాన్​లో తొలిసారిగా న్యూక్లియర్​ బాంబ్​ను పరీక్షించి, ప్రపంచదేశాలను విస్మయానికి గురిచేసింది ఇండియా. ఈ "స్మైలింగ్​ బుద్ధ" ప్రాజెక్ట్​ సక్సెస్​తో.. ప్రపంచంలోనే 6వ న్యూక్లియర్​ నేషన్​గా పేరు తెచ్చుకుంది.

1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏర్పడింది. 1975లో తొలి స్పేస్​క్రాఫ్ట్​ "ఆర్యభట్ట"ను లాంచ్​ చేసింది ఇండియా. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు! 2008లో మార్స్​పై మంగళ్యాన్​ను పంపించింది. 2008లో చంద్రుడిపై ప్రయోగించిన చంద్రయాన్​-1.. జాబిల్లి ఉపరితలంపై నీటి జాడనలు కనుగొని సంచలనం సృష్టించింది. ఇక ప్రస్తుతం చంద్రయాన్​-3.. చంద్రుడికి అతి సమీపంలో ఉంది. ఇది సక్సెస్​ అయితే, చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్రలో నిలిచిపోనుంది.

2023 Cricket World cup India : ఇండియాలో క్రికెట్​ అంటే ఒక ఎమోషన్​. 1983, 2011 వరల్డ్​ కప్స్​ ఇండియా పేరిట ఉన్నాయి. 2007 ఓపెనింగ్​ టీ20 వరల్డ్​ కూడా ఇండియానే సొంతం చేసుకుంది.

ఇక వేల కోట్ల బిజినెస్​.. ఇండియన్​ ఫిల్మ్​ ఇండస్ట్రీ సొంతం. ఆర్​ఆర్​ఆర్​ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రతి యేటా.. కోట్లల్లో రెవెన్యూ జనరేట్​ అవుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే భారత్​, భారతీయులు సాధించిన ఘనతలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ప్రపంచానికి స్పూర్తిదాయకంగా నిలిచాయి.

Whats_app_banner

సంబంధిత కథనం