World Cup 2023 tickets: వరల్డ్ కప్ టికెట్ల అమ్మకాలు ఆ రోజు నుంచే.. ఇండియా మ్యాచ్‌ల తేదీలు ఇవే
World Cup 2023 tickets: వరల్డ్ కప్ టికెట్ల అమ్మకాలపై ఐసీసీ కీలకమైన ప్రకటన చేసింది. ఇండియా మ్యాచ్‌ల టికెట్లను విడతల వారీగా అమ్మనున్నారు. ఆ తేదీలేంటో ఇప్పుడు చూద్దాం.
World Cup 2023 tickets: వరల్డ్ కప్ టికెట్ల అమ్మకాలపై ఐసీసీ కీలకమైన ప్రకటన చేసింది. ఇండియా మ్యాచ్‌ల టికెట్లను విడతల వారీగా అమ్మనున్నారు. ఆ తేదీలేంటో ఇప్పుడు చూద్దాం.: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్ 2023 టికెట్ల అమ్మకాలు త్వరలోనే షురూ కానున్నాయి. బుధవారం (ఆగస్ట్ 9) రాత్రి టికెట్ల అమ్మకాలకు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ టికెట్ల అమ్మకాలు ఆగస్ట్ 25 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది.
అక్టోబర్ 5న వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా.. సరిగ్గా 40 రోజుల ముందు టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టనున్నారు. ఇక ఈ టోర్నీలో ఇండియా మ్యాచ్ లు, మిగతా మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలను వేర్వేరుగా చేపట్టనున్నారు. ఇండియా లేని మ్యాచ్ ల కోసం టికెట్ల అమ్మకాలు ఆగస్ట్ 25 నుంచే ప్రారంభం కానుండగా.. ఇండియా మ్యాచ్ లవి మాత్రం ఆగస్ట్ 30 నుంచి అమ్మకాలు జరగనున్నాయి.
వరల్డ్ కప్ 2023 టికెట్ల అమ్మకాల షెడ్యూల్
ఆగస్ట్ 25: ఇండియా ఆడని వామప్ మ్యాచ్‌లు, ఇతర వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్లు
ఆగస్ట్ 30: గువాహటి, త్రివేండ్రంలో ఇండియా ఆడే వామప్ మ్యాచ్‌ల టికెట్లు
ఆగస్ట్ 31: చెన్నై (ఆస్ట్రేలియాతో), ఢిల్లీ (ఆఫ్ఘనిస్థాన్), పుణె (బంగ్లాదేశ్)లలో ఇండియా ఆడే మ్యాచ్ ల టికెట్లు
సెప్టెంబర్ 1: ధర్మశాల (న్యూజిలాండ్), లక్నో (ఇంగ్లండ్), ముంబై (శ్రీలంక)లలో ఇండియా ఆడే మ్యాచ్ ల టికెట్లు
సెప్టెంబర్ 2: బెంగళూరు (నెదర్లాండ్స్), కోల్‌కతా (సౌతాఫ్రికా) లలో ఇండియా ఆడే మ్యాచ్ ల టికెట్లు
సెప్టెంబర్ 3: అహ్మదాబాద్ (పాకిస్థాన్)లో ఇండియా ఆడే మ్యాచ్ టికెట్లు
సెప్టెంబర్ 15: సెమీఫైనల్స్ (ముంబై, కోల్‌కతా), ఫైనల్ (అహ్మదాబాద్)
టికెట్ల అమ్మకాల ప్రకటనతోపాటు వరల్డ్ కప్ కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం తమ వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. దీనికి సంబంధించిన లింక్ ఆగస్ట్ 15 నుంచి యాక్టివ్ అవుతుంది. మరోవైపు వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సహా 8 మ్యాచ్ ల షెడ్యూల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. కొత్త షెడ్యూల్ ప్రకారం ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14నే జరగనుంది.
సంబంధిత కథనం