Team India for World Cup: వరల్డ్ కప్‌కు టీమిండియా కోర్ గ్రూప్ ఇదే!-cricket news in telugu team india core group for world cup 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Team India For World Cup: వరల్డ్ కప్‌కు టీమిండియా కోర్ గ్రూప్ ఇదే!

Team India for World Cup: వరల్డ్ కప్‌కు టీమిండియా కోర్ గ్రూప్ ఇదే!

Hari Prasad S HT Telugu
Aug 08, 2023 04:57 PM IST

Team India for World Cup: వరల్డ్ కప్‌కు టీమిండియా కోర్ గ్రూప్ ఇదే అని వార్తలు వస్తున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ అతి త్వరలోనే తమ ప్రాథమిక జట్టును అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

ఇండియన్ క్రికెట్ టీమ్
ఇండియన్ క్రికెట్ టీమ్ (AP)

Team India for World Cup: వన్డే వరల్డ్ కప్‌కు టైమ్ దగ్గర పడుతోంది. మరో రెండు నెలలు కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా తమ ప్రాథమిక జట్టును అనౌన్స్ చేసింది. ఇక స్వదేశంలో ఆడబోతున్న ఇండియన్ టీమ్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కోర్ గ్రూప్ ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి.

సెప్టెంబర్ 5లోపు ప్రతి దేశం తమ ప్రాథమిక జట్టును ప్రకటించాల్సి ఉంది. ఆలోపే ఇండియన్ టీమ్ ఆసియా కప్ కూడా ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆసియాకప్, వరల్డ్ కప్ లకు ఈ కోర్ గ్రూపు నుంచే సెలక్టర్లు టీమ్ ను ఎంపిక చేయనున్నారు. తాజా రిపోర్టు ప్రకారం ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, జైదేవ్ ఉనద్కట్ లకు కూడా ఈ కోర్ గ్రూపులో చోటు దక్కినట్లు తెలుస్తోంది.

ఇక గాయాలతో చాలాకాలంగా దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్‌ప్రీత్ బుమ్రాలాంటి వాళ్లు కూడా తిరిగి రానున్నారు. బుమ్రా ఇప్పటికే ఐర్లాండ్ సిరీస్ కు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ లెక్కన అతడు ఆసియాకప్ ఆడటం ఖాయం. ఇక రాహుల్, అయ్యర్ ఫిట్‌నెస్ ల గురించే తేలాల్సి ఉంది. ఆసియా కప్ సమయానికి ఫిట్ గా ఉంటే వీళ్లు జట్టులో ఉండటం ఖాయం.

అదే సమయంలో వీళ్ల రాకతో మిడిలార్డర్ కూడా బలోపేతం అవుతుంది. అయితే వీళ్లకు బ్యాకప్ గా సూర్యకుమార్, సంజూ శాంసన్ లాంటి ప్లేయర్స్ ను కూడా ఈ కోర్ గ్రూపులో ఉండనున్నారు.

ఆసియా కప్, వరల్డ్ కప్‌లకు టీమిండియా కోర్ గ్రూప్ ఇదే

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, జైదేవ్ ఉనద్కట్, ముకేశ్ కుమార్, యుజువేంద్ర చహల్

Whats_app_banner

సంబంధిత కథనం