తెలుగు న్యూస్ / ఫోటో /
ఇస్రోలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే!
- ఎస్ఏసీ (స్పేస్ అప్లికేషన్స్ సెంటర్)- అహ్మదాబాద్‌లో టెక్నీషియన్ బీ, డ్రాట్స్‌మెన్ బీ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసింది ఇస్రో. వేకెన్సీ, ఎలిజెబులిటీ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
- ఎస్ఏసీ (స్పేస్ అప్లికేషన్స్ సెంటర్)- అహ్మదాబాద్‌లో టెక్నీషియన్ బీ, డ్రాట్స్‌మెన్ బీ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసింది ఇస్రో. వేకెన్సీ, ఎలిజెబులిటీ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
(1 / 5)
ఈ దఫా రిక్రూట్మెంట్లో 35 పోస్టులను భర్తీ చేయనుంది ఇస్రో. వీటిల్లో టెక్నీషియన్ బీ పోస్టులు 34 ఉండగా.. ఒక పోస్టు డ్రాట్స్‌మెన్ బీ ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు www.isro.gov.in లో అప్లై చేసుకోవచ్చు.(HT Photo)
(2 / 5)
ఇస్రోలో ఉద్యోగం కోసం అప్లై చేస్తున్న వారి వయస్సు 18-35 మధ్యలో ఉండాలి. ఆగస్టు 21లోపు దరఖాస్తు వేయాల్సి ఉంటుంది.(HT_PRINT)
(3 / 5)
రిక్రూట్మెంట్లో భాగంగా రాత పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తుంది ఇస్రో. రాత పరీక్షకు 90 నిమిషాల సమయం ఉంటుంది. 80 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. సరైన సమాధానానికి 1 మార్కు, తప్పు సమాధానానికి మైనస్ 0.33 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష ఫలితాల ఆధారంగా స్కిల్ టెస్ట్ కోసం అభ్యర్థుల జాబితాను రూపొందిస్తుంది ఇస్రో.(HT_PRINT)
(4 / 5)
ఇస్రో రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫీజు రూ. 500. మినహాయింపు ఉన్న వారికి ఫీజు రూ. 100. కానీ ముందు రూ. 500 కడితే, రూ. 400 రీఫండ్ చేస్తారు.(PTI)
ఇతర గ్యాలరీలు