India’s rice export ban: ఎన్నారైల బియ్యం తిప్పలు; సూపర్ మార్కెట్ల ముందు భారీ క్యూలు-panic buying nris in us canada rush to stock up on rice after indias export ban ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India’s Rice Export Ban: ఎన్నారైల బియ్యం తిప్పలు; సూపర్ మార్కెట్ల ముందు భారీ క్యూలు

India’s rice export ban: ఎన్నారైల బియ్యం తిప్పలు; సూపర్ మార్కెట్ల ముందు భారీ క్యూలు

HT Telugu Desk HT Telugu
Jul 22, 2023 05:06 PM IST

India’s rice export ban: బాస్మతి బియ్యం మినహా ఇతర బియ్యం వెరైటీలను ఎగుమతి చేయడంపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దాంతో, బియ్యం బ్యాగుల కోసం ఎన్నారైలు తమ ప్రాంతాల్లోనూ స్టోర్స్ ముందు క్యూ కడ్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

India’s rice export ban: బాస్మతి బియ్యం మినహా ఇతర బియ్యం వెరైటీలను ఎగుమతి చేయడంపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దాంతో, బియ్యం బ్యాగుల కోసం ఎన్నారైలు తమ ప్రాంతాల్లోనూ స్టోర్స్ ముందు క్యూ కడ్తున్నారు.

అమెరికా, కెనడాల్లో..

ముఖ్యంగా అమెరికా, కెనడాల్లో నివసించే భారతీయులకు భారత ప్రభుత్వం తీసుకున్న బియ్యం ఎగుమతులపై నిషేధం నిర్ణయం షాకిచ్చింది. ముందు, ముందు బియ్యం లభ్యతపై అనుమానాలతో పాటు, భవిష్యత్తులో బియ్యం ధర భారీగా పెరిగే అవకాశముందన్న వార్తలతో తమ ప్రాంతంలోని సూపర్ మార్కెట్లకు, గ్రోసరీ స్టోర్లకు ప్రవాస భారతీయులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా బియ్యాన్ని ప్రధాన ఆహారంగా తీసుకునే దక్షిణ భారత దేశానికి చెందిన ఎన్నారైలు పెద్ద ఎత్తున బియ్యం బ్యాగ్ లను కొనేస్తున్నారు. బియ్యాన్ని ప్రధాన ఆహారంగా తీసుకునే భారతీయులు సోనా మసూరి బియ్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఆ వెరైటీకి ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడడంతో, స్టోర్స్ యజమానులు వాటిని బ్లాక్ చేస్తున్నారని ఎన్నారైలు విమర్శిస్తున్నారు.

ధర పెంపు..

ఇదే అదనుగా అమెరికా, కెనడా సహా భారతీయులు అధికంగా ఉన్న దేశాల్లో గ్రోసరీ స్టోర్స్ యజమానులు బియ్యం ధరను భారీగా పెంచేస్తున్నారు. బియ్యం కోసం ఎన్నారైలు పోటెత్తుతుండడంతో.. షాప్స్ యజమానులు బియ్యం సేల్స్ పై పరిమితి కూడా విధిస్తున్నారు. ఒకరికి ఒక బ్యాగ్ మాత్రమే అని కండిషన్లు పెడ్తున్నారు. ఒక్కసారిగా బియ్యం ధరను భారీగా పెంచడంపై ఎన్నారైలు విమర్శలు చేస్తున్నారు. బియ్యం కోసం స్టోర్స్ లో భారతీయులు ఎగబడుతున్న దృశ్యాలను, స్టోర్స్ ముందు లైన్ లో నిల్చున్న దృశ్యాలను, పెద్ద ఎత్తున బియ్యం బ్యాగ్ లను కార్లో వేసుకువెళ్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

దేశీయంగా బియ్యం ధర

అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా బియ్యం ధరను నియంత్రించడం కోసం బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. బియ్యం నిల్వలు తగ్గిపోవడం, ఈ సారి దిగుబడి ఆశించిన మేర ఉండకపోవచ్చన్న అంచనాలు, ఎన్నికల సంవత్సరంలో బియ్యం ధర పెరిగితే విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న భయం.. తదితర కారణాలతో బాస్మతి బియ్యం మినహా అన్ని బియ్యం వెరైటీలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

Whats_app_banner