Chandrayaan-3 latest updates : ఇంకా 1,400 కి.మీలే! చందమామకు చేరువలో చంద్రయాన్​-3!-chandrayaan3 spacecraft only 1 400 km away from moon isro ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chandrayaan-3 Latest Updates : ఇంకా 1,400 కి.మీలే! చందమామకు చేరువలో చంద్రయాన్​-3!

Chandrayaan-3 latest updates : ఇంకా 1,400 కి.మీలే! చందమామకు చేరువలో చంద్రయాన్​-3!

Sharath Chitturi HT Telugu
Aug 12, 2023 08:35 AM IST

Chandrayaan-3 latest updates : చంద్రయాన్​ 3.. చంద్రుడికి చేరువవుతోంది! ఈ మేరకు ఇస్రో ఓ కీలక అప్డేట్​ ఇచ్చింది.

ఇంకా 1,400 కి.మీలే! చందమామకు చేరువలో చంద్రయాన్​-3!
ఇంకా 1,400 కి.మీలే! చందమామకు చేరువలో చంద్రయాన్​-3!

Chandrayaan-3 latest updates : చంద్రయాన్​-3పై మరో కీలక అప్డట్​ ఇచ్చింది ఇస్రో (ఇండియన్​ స్పేస్​ రీసెర్చ్​ ఆర్గనైజేషన్​). ఈ స్పేస్​క్రాఫ్ట్​.. చంద్రుడికి ఇంకా 1,437 కి.మీల దూరంలో ఉందని వెల్లడించింది. వారం రోజుల్లో ఈ దూరం 100కి.మీలకు చేరుతుందని స్పష్టం చేసింది.

అదిగో జాబిల్లి..

ఆగస్ట్​ 1న భూమి కక్ష్యను వీడి.. ఆగస్ట్​ 5న చంద్రుడి కక్షలోకి ప్రవేశించింది చంద్రయాన్​-3. అప్పటి నుంచి ఈ స్పేస్​క్రాఫ్ట్​కు ఆర్బిట్​ రిడక్షన్​ మేన్యువర్​​ చేస్తూ, దూరాన్ని తగ్గిస్తూ వస్తోంది ఇస్రో. తాజాగా.. మరో దఫా రిడక్షన్​ మేన్యువర్​ను విజయవంతంగా పూర్తి చేసినట్టు వెల్లడించింది. ఇక ఆగస్ట్​ 14, 15 తేదీల్లో మరో రెండుసార్లు ఈ ప్రాసెస్​ను పూర్తిచేసి.. చంద్రుడికి, చంద్రయాన్​-3కి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించనున్నట్టు స్పష్టం చేసింది.

Chandrayaan-3 moon landing date : చంద్రయాన్​-3 మిషన్​లో ఇప్పటివరకు అన్ని అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని ఇస్రో వెల్లడించింది. అయితే.. చంద్రుడిపై సాఫ్ట్​ ల్యాండింగ్​ అత్యంత కీలకమని వెల్లడించింది. ఈ నెల 23న సాఫ్ట్​ ల్యాండింగ్​కు ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- ‘హలో చందమామ’.. మన చంద్రయాన్​-3 తీసిన తొలి ఫొటోలు ఇవే!

చంద్రయాన్​-2 కూడా ల్యాండింగ్​ సమయంలోనే విఫలమైంది. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు, ఈసారి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకున్నామని వెల్లడించారు. కీలక దశలో సెన్సార్​, ఇంజిన్​లు విఫలమైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ల్యాండింగ్​ విజయవంతమయ్యే విధంగా మోడల్​ను రూపొందించారు.

Chandrayaan-3 launch date : ఇక చంద్రుడి సౌత్​ పోల్​పై చంద్రయాన్​-3కి చెందిన ల్యాండర్​ దిగుతుంది. అందులో నుంచి రోవర్​ ఒకటి ఉపరితలంపై అడుగు పెడుతుంది. 14 రోజుల పాటు పలు కీలక విషయాలపై పరిశోధనలు చేసి, ఆ డేటాను ఇస్రోకు పంపిస్తుంది.

జులై 14న చంద్రయాన్​-3ని లాంచ్​ చేసింది ఇస్రో. ఈ మిషన్​ సెక్సెస్​ అవ్వాలని యావత్​ భారత దేశం ప్రార్థనలు చేస్తోంది.

చంద్రయాన్​-3కి పోటీగా.. లూనా 25

Luna 25 launch : చంద్రయాన్​-3కి పోటీగా లూనా 25ని లాంచ్​ చేసింది రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ. రష్యాలోని తూర్పు అముర్​ ప్రాంతంలోని లాంచింగ్​ సెంటర్​ నుంచి.. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటల 10 నిమిషాలకు లూన్​ 25 మూన్​ ల్యాండర్​తో కూడిన సోయుజ్​-2.1బీ రాకెట్​ నింగిలోకి ఎగిరింది. ఈ లూనా​ 25, చంద్రయాన్​-3లు ఒకే రోజు చంద్రుడిపై అడుగుపెడతాయని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం