Chandrayaan-3 latest news : ‘హలో చందమామ’.. మన చంద్రయాన్​-3 తీసిన తొలి ఫొటోలు ఇవే!-isro releases first images of moon as captured by chandrayaan 3 spacecraft ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chandrayaan-3 Latest News : ‘హలో చందమామ’.. మన చంద్రయాన్​-3 తీసిన తొలి ఫొటోలు ఇవే!

Chandrayaan-3 latest news : ‘హలో చందమామ’.. మన చంద్రయాన్​-3 తీసిన తొలి ఫొటోలు ఇవే!

Sharath Chitturi HT Telugu
Aug 07, 2023 10:21 AM IST

Chandrayaan-3 latest news : చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత చంద్రయాన్​-3 కొన్ని ఫొటోలు తీసింది. వాటిని ఇస్రో విడుదల చేసింది.

చంద్రయాన్​-3 తీసిన తొలి ఫొటోలు ఇవి!
చంద్రయాన్​-3 తీసిన తొలి ఫొటోలు ఇవి!

Chandrayaan-3 latest news : 'ఇస్రో (ఇండియన్​ స్పేస్​ రీసెర్చ్​ ఆర్గనైజేషన్​) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​-3.. ఇటీవలే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్పేస్​క్రాఫ్ట్​ తొలిసారిగా తీసిన చందమామ ఫొటోలను ఇస్రో తాజాగా విడుదల చేసింది.

"లూనార్​ ఆర్బిట్​ ఇన్సర్షన్​ (ఎల్​ఓఐ) సమయంలో చంద్రయాన్​-3 స్పేస్​క్రాఫ్ట్​ నుంచి కనిపించిన చంద్రుడు," అని ఇస్రో ట్వీట్​ చేసింది.

మరో కీలక ఘట్టం పూర్తి..!

చంద్రుడిపై 14రోజుల పాటు పరిశోధనల కోసం.. జులై 14న చంద్రయాన్​-3ని లాంచ్​ చేసింది ఇస్రో. ఈ లాంచ్​ను యావత్​ భారత దేశం చాలా ఆసక్తి, ఉత్కంఠగా తిలకించింది. అప్పటి నుంచి 5 దశలుగా స్పేస్​క్రాఫ్ట్​ ఆర్బిట్​ను పెంచుకుంటూ వచ్చింది ఇస్రో. ఆగస్ట్​ 1న.. ఈ స్పేస్​క్రాఫ్ట్​.. భూమి కక్ష్యను వీడి చంద్రుడివైపు ప్రయాణించింది. ఇక ఆగస్ట్​ 5 రాత్రి 7 గంటల ప్రాంతంలో.. ఈ స్పేస్​క్రాఫ్ట్​ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ తర్వాత తీసిన ఫొటోలను ఇస్రో పంచుకుంది.

Chandrayaan-3 photos : ఇక ఆగస్ట్​ 6న.. చంద్రయాన్​-3పై ఆర్బిట్​ రిడక్షన్​ మేన్యువర్​​ను విజయవంతంగా చేపట్టింది అంతరిక్ష పరిశోధన సంస్థ. మళ్లీ ఈ నెల 9న మరో దఫా ఆర్బిట్​ రిడక్షన్​ మేన్యువర్​ను చేపట్టనుంది. ఇలా పలు దఫాలుగా చేసిన తర్వాత స్పేస్​క్రాఫ్ట్​ చంద్రుడికి సమీపం వరకు వెళుతుంది.

ఇప్పటివరకు ఈ మిషన్​ అనుకున్న విధంగా సాగుతోందని ఇస్రో వెల్లడించింది. ఆగస్ట్​ 23న జాబిల్లిపై సాఫ్ట్​ ల్యాండింగ్​ చేస్తామని స్పష్టం చేసింది.

భారతీయుల ప్రార్థనలు..

Chandrayaan-3 moon photos : చంద్రయాన్​ ప్రాజెక్ట్స్​లో భాగంగా.. ఇప్పటివరకు మూడు ప్రయోగాలు చేపట్టింది ఇస్రో. మొదటి ప్రయోగమైన చంద్రయాన్ 1 విజయవంతమైంది. అంతేకాకుండా.. చంద్రుడిపై నీటి జాడలున్నాయని నిరూపించి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇక 2019లో చేపట్టిన రెండో ప్రయోగం.. చంద్రయాన్ 2 విఫలమైంది! చివరి దశ అయిన ల్యాండింగ్ వరకు ఈ ప్రయోగం వెళ్లగలిగింది. కానీ చంద్రుడి ఉపరితలంపైకి దిగే సమయంలో విఫలమై, కుప్పకూలిపోయింది. దీనితో పూర్తి జాగ్రత్తలు తీసుకుని, సాఫ్ట్​వేర్​ను అప్డేచ్​ చేసి, చంద్రయాన్ 3ని సిద్ధం చేసింది ఇస్రో.

ఈ ప్రయోగంలో.. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అత్యంత కీలక ఘట్టం. ఈ ప్రయోగం విజయవంతమైతే, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. అమెరికా, సోవియట్ యూనియన్, చైనాలు ఇప్పటివరకు ఈ ఘనత సాధించాయి. ఈసారి ప్రయత్నం సఫలం అవ్వాలని యావత్​ భారత దేశం ప్రార్థనలు చేస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం