Best country: ప్రపంచంలో అత్యుత్తమ దేశం ఏదో తెలుసా?.. మరింత దిగజారిన భారత్ స్థానం-switzerland is worlds best country in 2024 india drops three spots survey ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Best Country: ప్రపంచంలో అత్యుత్తమ దేశం ఏదో తెలుసా?.. మరింత దిగజారిన భారత్ స్థానం

Best country: ప్రపంచంలో అత్యుత్తమ దేశం ఏదో తెలుసా?.. మరింత దిగజారిన భారత్ స్థానం

Sudarshan V HT Telugu
Sep 10, 2024 06:48 PM IST

యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ 2024 వ సంవత్సరానికి గానూ అత్యత్తమ దేశాల జాబితాను వెలువరించింది. ఈ బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ లో వరుసగా మూడో ఏడాది స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. కాగా, ఈ జాబితాను భారత్ స్థానం మరింత దిగజారింది.

ప్రపంచంలో అత్యుత్తమ దేశం స్విట్జర్లాండ్
ప్రపంచంలో అత్యుత్తమ దేశం స్విట్జర్లాండ్

యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ 'బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024'లో స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మరోసారి నిలిచింది. సాహసం, చురుకుదనం, వారసత్వం, వ్యవస్థాపకత, జీవన నాణ్యత, సాంస్కృతిక ప్రయోజనం వంటి 10 విభిన్న ప్రమాణాలను ఉపయోగించి 89 దేశాలకు ఈ సర్వే ర్యాంకులు ఇచ్చింది. ఈ ప్రమాణాలను ఒక దేశానికి చెందిన 73 విభిన్న లక్షణాలతో రూపొందించారు.

టాప్ లో మళ్లీ స్విట్జర్లాండ్

జీవన నాణ్యత, వ్యాపార సానుకూలత కొలమానాలలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా, సాంస్కృతిక వారసత్వ (heritage) కొలమానంలో అత్యల్ప స్థానంలో ఉంది. ఈ సర్వేలో మధ్య యూరోపియన్ దేశమైన స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలవడం ఇది ఏడోసారి కాగా, వరుసగా మూడో సారి. ఈ సంవత్సరం జాబితాలో టాప్ 25లో యూరోపియన్ దేశాలే ఉన్నాయి.

రెండో స్థానంలో జపాన్

తాజా ర్యాంకింగ్స్ లో స్విట్జర్లాండ్ తర్వాత జపాన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఈ జాబితాలో ఆసియా నుంచి జపాన్, సింగపూర్, చైనా, దక్షిణ కొరియా మాత్రమే టాప్ 25లో చోటు దక్కించుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వరుసగా 17, 25 స్థానాల్లో నిలిచాయి.

భారత్ స్థానం

2023లో ఈ జాబితా 30వ స్థానం సంపాదించిన భారత్.. ఈ సంవత్సరం మరో మూడు స్థానాలు దిగజారి 33 వ స్థానానికి చేరుకుంది. అయితే, భారత్ 'మూవర్స్' (7వ స్థానం), హెరిటేజ్ (10వ స్థానం) విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 'మూవర్స్' అనే ఉప-ర్యాంకింగ్, భారీ వెయిటేజీతో, ఒక దేశం స్థితిస్థాపకత, అనుకూలతను కొలుస్తుంది. సామాజిక ప్రయోజనం, సాహసం విభాగాల్లో భారత్ చెత్త ప్రదర్శన కనబరిచింది.

తొమ్మిదేళ్లుగా ర్యాంకింగ్స్

యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ గత 9 సంవత్సరాలుగా బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024 జాబితాను ప్రకటిస్తోంది. ఈ జాబితాలో కేవలం దేశాల సంపదను మాత్రమే కాకుండా, ఇతర కొలమానాల్లోనూ ఆయా దేశాల విలువను గణిస్తుంది.36 దేశాలకు చెందిన 16,960 మందిని సర్వే చేసి ఈ ర్యాంకింగ్ ను రూపొందించారు.

వార్టన్ బిజినెస్ స్కూల్ నమూనా

వార్టన్ బిజినెస్ స్కూల్ అభివృద్ధి చేసిన నమూనాను ఉపయోగించి, ఒక సంవత్సరంలో ఆ దేశం సాధించిన విజయాలకు సంబంధించిన గుణాత్మక లక్షణాలను కొలుస్తారు. ఈ సర్వే ప్రకారం స్విట్జర్లాండ్ అన్ని సబ్ ర్యాంకింగ్స్ లోనూ నిలకడగా రాణిస్తోందని, స్థిరత్వం కారణంగా అత్యుత్తమ దేశంగా రేటింగ్ పొందే అవకాశం ఉందని పేర్కొంది.