Ice Cream Cone Business : బిజినెస్ చేయాలనుకుంటున్నారా? లాభాలు తీసుకొచ్చే ఐస్ క్రీమ్ కోన్ వ్యాపారం!
Ice Cream Cone Business : ఇటీవల వ్యాపారం ప్రారంభించి జీవితంలో ఎదగాలి అనుకునేవారి సంఖ్య పెరుగుతుంది. ఒకేసారి అధిక మెుత్తంలో పెట్టుబడి పెట్టి నష్టాలు చూసే బుదులు చిన్న వ్యాపారంపై వైపు చూడండి. అలాంటి ఒకటి ఐస్ క్రీమ్ కోన్ వ్యాపారం. దీనిని ఎలా ప్రారంభించాలి?
పిల్లల నుండి పెద్దల వరకు ఐస్ క్రీం అంటే అందరికీ ఇష్టమే. వేసవి రోజుల్లో ఐస్ క్రీం కంపెనీలు, శీతల పానీయాల కంపెనీలు మంచి బిజినెస్ చేస్తాయి. ఈ మధ్యకాలంలో ఏ కాలంలో అయినా ఐస్ క్రీమ్ బిజినెస్ బాగానే నడుస్తుంది. ఇప్పుడు పెళ్లి వేడుకల్లో ఐస్ క్రీం పెట్టడం సాధారణమైపోయింది. దీన్ని బట్టి మనం ఐస్‌క్రీమ్‌ల అభిమానుల సంఖ్యను తెలుసుకోవచ్చు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఐస్ క్రీమ్ కోన్స్, కప్పులను విక్రయించవచ్చు. దీని ద్వారా మీరు ఇంటి నుండి రోజుకు 1000 నుండి 3000 రూపాయలు సంపాదించవచ్చు.
ముడి పదార్థాలు
మీ వ్యాపారం కస్టమర్ అవసరాల గురించి తెలుసుకోవాలి. దీనిపై విశ్లేషణ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ కప్పులు, కోన్‌ల తయారీకి అవసరమైన అన్ని ముడి పదార్థాలు, ఖర్చులు, మార్కెట్ ధరలను తెలుసుకోండి. మైదా, పంచదార, నెయ్యి, పాలు, ఐస్ క్రీం కోన్‌లు, కప్పులను తయారు చేయడానికి అవసరమైన ఇతర పదార్థాల గురించి అధ్యయనం చేయాలి. మీ ఉత్పత్తి నాణ్యత వీటిపైనే ఆధారపడి ఉంటుంది. నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా.. అదే సమయంలో తక్కువ ధరకు లభించే ఉత్పత్తులను కొనుగోలు చేయండి.
ఖర్చులు అంచనా వేయాలి
నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా ఉత్పత్తిని పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తే ధర తగ్గుతుంది. ఇది మీ లాభాన్ని పెంచుతుంది. ఆ తర్వాత కోన్‌లు, కప్పులు తయారు చేసిన తర్వాత ప్యాకింగ్‌కు అయ్యే ఖర్చు రూ.5 నుంచి రూ.15 అవుతుంది. ఇది కాకుండా విద్యుత్ బిల్లు, నీరు, ఉద్యోగుల జీతం వంటి ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. ఇవన్నీ ముందుగానే ప్రాజెక్ట్ రిపోర్టు చేసుకోవాలి.
లైసెన్స్ ముఖ్యం
చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి బ్యాంకులు రుణాలు అందిస్తాయి. మైక్రో లోన్ కంపెనీల ద్వారా మీరు మీ కంపెనీకి అవసరమైన పెట్టుబడిని కూడా పొందవచ్చు. ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీకి FSSAI లైసెన్స్ ముఖ్యం. మీరు ఐస్ క్రీమ్ కోన్, కప్పుల తయారీ కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటే మీరు FSSAI లైసెన్స్ పొందాలి. దీనిని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. వాటితోపాటు పంచాయతీ అనుమతి, మున్సిపల్ అనుమతి కూడా తీసుకోవాలి.
ఇంతకు అమ్ముకోవచ్చు
ఒక ఐస్ క్రీమ్ కోన్ తయారీ యంత్రం నిమిషానికి 10 నుండి 30 కోన్‌లను ఉత్పత్తి చేస్తుంది. దీని ఉత్పత్తి వ్యయం కోన్‌కు 50 పైసల నుండి 2 రూపాయల వరకు ఉంటుంది. మార్కెట్‌లో కోన్ రూ.5 వరకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఐస్ క్రీమ్ కప్పుల తయారీకి కప్పుకు 75 పైసల నుండి 2 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. వీటిని మార్కెట్‌లో రూ.3 నుంచి రూ.6 వరకు విక్రయించవచ్చు. కోన్ రూ.2కు ఉత్పత్తి చేస్తే మార్కెట్ లో రూ.5కు అమ్మవచ్చు. దీంతో ఒక్కో కోన్ 3 రూపాయల వరకు లాభం వస్తుంది.
ఇక 2 రూపాయలతో కప్పు తయారు చేస్తే 6 రూపాయల వరకు అమ్మవచ్చు. అంటే కప్పుకు రూ.4 లాభం పొందవచ్చు. మీరు రోజుకు 1000 కోన్‌లు లేదా కప్పులు విక్రయిస్తే 1000 నుండి 3000 రూపాయలు సంపాదించవచ్చు.
గమనిక : మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇది కూడా ఒక మార్గం అని చెప్పడం మా ఉద్దేశం. ఏదైనా వ్యాపారం ప్రారభించేముందు పూర్తిగా అధ్యయనం చేయాలి.
టాపిక్