PM Modi Brand Value: ప్రధాని నరేంద్ర మోదీ ‘బ్రాండ్ వాల్యూ’ ఎంతో తెలుసా?
PM Modi Brand Value: భారత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రాండ్ వాల్యూ చెక్కు చెదరలేదు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో నరేంద్ర మోదీ పేరు ఇప్పటికీ టాప్ మోస్ట్ ప్రయారిటీనే. ఇంతకీ నరేంద్ర మోదీ బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా?
PM Modi Brand Value: సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత ప్రధాని నరేంద్రమోదీకి తిరుగు లేదు. ఎంతో మంది యువ నాయకులను మించి ఆయన సాంకేతికతను వినియోగిస్తుంటారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ప్రజలకు దగ్గరయ్యే కళ ను ఎవరైనా మోదీ దగ్గర నేర్చుకోవాల్సిందే.
PM Modi Brand Value: బ్రాండ్ వాల్యూ..
‘చెక్ బ్రాండ్’ అనే సంస్థ రెగ్యులర్ గా భారత్ లోని ప్రముఖ రాజకీయ నాయకుల బ్రాండ్ వాల్యూని లెక్కగడుతుంటుంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై వారి గురించిన వార్తలు, వారి గురించి సెర్చ్ లను గణించి, వారి బ్రాండ్ వాల్యూని నిర్దారిస్తుంది. ముఖ్యంగా, ట్విటర్, ఫేస్ బుక్, గూగుల్ సెర్చ్, ఇన్ స్టా గ్రామ్, వికీ పీడియా, గూగుల్ ట్రెండ్స్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ఆయా నేతల ప్రజెన్స్ ను లెక్కగట్టి వారి బ్రాండ్ వాల్యూ ని వెల్లడిస్తుంది. దాదాపు 10 కోట్లకు పైగా ఆన్ లైన్ ఇంప్రెషన్స్ ను విలువ కట్టి బ్రాండ్ వాల్యూని నిర్ధారిస్తుంది.
PM Modi Brand Value: మోదీనే మళ్లీ టాప్..
2022 సంవత్సరానికి గానూ చెక్ బ్రాండ్ వెల్లడించిన వివరాల మేరకు.. ప్రధాని మోదీ 413 కోట్ల విలువైన బ్రాండ్ వాల్యూ కలిగి ఉన్నారు. ఇది 2020 సంవత్సరం కన్నా 86 కోట్లు ఎక్కువ. బ్రాండ్ వాల్యూలో తరువాతి స్థానంలో కేంద్ర హో మంత్రి అమిత్ షా ఉన్నారు. అమిత్ షా బ్రాండ్ వాల్యూ 96.8 కోట్లు. 2020లో అమిత్ షా బ్రాండ్ వాల్యూ 88. 2 కోట్లు. అమిత్ షాకు ట్విటర్లో సుమారు 3 కోట్ల మంది ఫాలోవర్లు, ఇన్ స్టా లో సుమారు 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మూడో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో కేజ్రీవాల్ గురించిన చర్చ అనునిత్యం కొనసాగుతుంటుంది. మొత్తంగా చెక్ బ్రాండ్’ లెక్కల ప్రకారం కేజ్రీవాల్ బ్రాండ్ వాల్యూ 72.3 కోట్లు. 2020 లో ఇది 61.7 కోట్లుగా ఉంది.
PM Modi Brand Value: మమత, నితీశ్
డిజిటల్ రేసులో ముందంజలో ఉన్న ఇతర విపక్ష నేతల్లో ప్రముఖులు పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్. ఫైర్ బ్రాండ్ మమత బెనర్జీ డిజిటల్ బ్రాండ్ వాల్యూ 23.7 కోట్లు కాగా, నితీశ్ కుమార్ బ్రాండ్ వాల్యూ 18.91 కోట్లు. ఈ డిజిటల్ రేసులో కాంగ్రెస్ లో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కొంత వెనుకబడి ఉన్నారు.