Zomato share price: జొమాటో 8 శాతం డౌన్.. 2 రోజుల్లో 1 బిలియన్ డాలర్ల విలువ మైనస్
ZOMATO-STOCK Price: బ్లింకిట్ డీల్ అనంతరం రెండు రోజుల్లో జొమాటో వాల్యుయేషన్‌లో 1 బిలియన్ డాలర్ల విలువను కోల్పోయింది
బెంగళూరు, జూన్ 28: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ స్టాక్ (zomato stock price) మంగళవారం 8.2 శాతం పతనమై రూ. 60.55కి పడిపోయింది. లోకల్ గ్రాసరీ డెలివరీ స్టార్టప్ బ్లింకిట్ కొనుగోలులో హేతుబద్ధతను ఇన్వెస్టర్లు ప్రశ్నించడంతో వరుసగా జొమాటో స్టాక్ రెండో రోజూ నష్టాలు చవిచూసింది.
ఏఎన్టీ గ్రూప్ మద్దతు ఉన్న ఫుడ్ డెలివరీ ఫర్మ్ శుక్రవారం బ్లింకిట్ డీల్ వివరాలు వెల్లడించింది. 586.16 మిలియన్ డాలర్లు వెచ్చించి బ్లింకిట్‌ను కొనుగోలు చేస్తున్నట్టు, క్విక్ డెలివరీ మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్టు తెలిపింది.
సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ మద్దతు ఉన్న బ్లింకిట్‌లో గత ఆగస్టులో 9 శాతం వాటా కొనుగోలు చేసింది. రానున్న రెండేళ్లలో క్విక్ కామర్స్ మార్కెట్‌లో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళిక ఉందని తెలిపింది.
‘పెరుగుతున్న పోటీ తీవ్రత కారణంగా బ్లింకిట్ కోసం జోమాటో ఊహించిన 400 మిలియన్ డాలర్లకు మించి పెట్టుబడులు అవసరమవుతాయని మేం నమ్ముతున్నాం..’ అని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్‌లోని విశ్లేషకులు నివేదించారు.
ఆఫర్‌ను ప్రకటించినప్పటి నుండి కంపెనీ షేర్లు దాదాపు 76.78 బిలియన్ రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయింది. గత జూలైలో పబ్లిక్‌కి వచ్చినప్పటి నుండి దాదాపు 48% తగ్గింది.
ప్రత్యర్థులు స్విగ్గీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతుగల డన్జో, టాటా మద్దతు గల బిగ్‌బాస్కెట్, జెప్టో పెద్ద పెట్టుబడులతో క్విక్ కామర్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది.
రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ ప్రకారం.. పరిశ్రమ 2025 నాటికి 10-15 రెట్లు పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.