IIT student suicide: ఢిల్లీలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య-iit student found hanging in delhi hostel room suicide alleged ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iit Student Suicide: ఢిల్లీలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

IIT student suicide: ఢిల్లీలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

Sudarshan V HT Telugu
Oct 23, 2024 05:10 PM IST

IIT student suicide: భారత్ లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీలో ఎమ్మెస్సీ చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆ విద్యార్థి జార్ఖండ్ కు చెందిన వాడని అధికారులు తెలిపారు.

ఢిల్లీలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
ఢిల్లీలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

IIT student suicide: ఢిల్లీ ఐఐటీలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ విద్యార్థి జార్ఖండ్ లోని దియోఘర్ కు చెందిన వాడని అధికారులు తెలిపారు. ఆ విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

ఉరివేసుకుని..

ఢిల్లీ ఐఐటీలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థి ఉంటున్న గది లోపలి నుంచి తాళం వేసి ఉండడంతో పాటు, ఎంతసేపు పిలిచినా, తలుపు తట్టినా స్పందించకపోవడంతో వేరే గదిలో ఉండే అతని స్నేహితుడు హాస్టల్ సిబ్బందికి సమాచారమిచ్చారు. విద్యార్థులు, ఐఐటీ సిబ్బంది కిటికీ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆ విద్యార్థి సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించాడు. దాంతో, వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మానసిక వ్యాధికి చికిత్స

రూమ్ లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు, మృతుడి మెడికల్ రిపోర్ట్ కార్డు ప్రకారం అతను మానసిక వ్యాధికి చికిత్స పొందుతున్నాడని, డాక్టర్ తో తదుపరి అపాయింట్ మెంట్ అక్టోబర్ 29న ఉందని పోలీసులు తెలిపారు. కాగా, ఆ విద్యార్థి మృతదేహాన్ని మార్చురీలో ఉంచి విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మొబైల్ క్రైమ్ బృందం గదిని పరిశీలించారని, వారికి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడి స్నేహితుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Whats_app_banner