Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు భారీగా తరలివస్తున్న భక్త జనం; గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన యాత్రికులు-historic start for char dham yatra uttarkashi welcomes over 3 60 000 pilgrims ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు భారీగా తరలివస్తున్న భక్త జనం; గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన యాత్రికులు

Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు భారీగా తరలివస్తున్న భక్త జనం; గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన యాత్రికులు

HT Telugu Desk HT Telugu
May 26, 2024 09:37 AM IST

ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. ఈ యాత్రలో పవిత్ర హిందూ పుణ్యక్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ లను భక్తులు దర్శించుకుంటారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది.

భక్తులతో కిటకిటలాడుతున్న కేదార్ నాథ్ ఆలయం
భక్తులతో కిటకిటలాడుతున్న కేదార్ నాథ్ ఆలయం (PTI)

ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర అక్షయ తృతియ రోజు అయిన మే 10వ తేదీన ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 15 రోజుల్లోనే యమునోత్రి, గంగోత్రి ధామ్ లకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. శుక్రవారం యమునోత్రి ధామ్ ను 9,812 మంది, గంగోత్రి ధామ్ ను 13,602 మంది దర్శించుకున్నారు. ఈ సంవత్సరం ఈ రెండు పుణ్యక్షేత్రాలను సందర్శించిన వారి సంఖ్య 3,63,537కి చేరింది.

లాస్ట్ ఈయర్ తో పోలిస్తే..

గత సంవత్సరాలతో పోల్చి చూస్తే, చార్ ధామ్ యాత్రకు తరలివస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023లో ఇదే సమయంలో 1,97,413 మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. 2022లో 2,22,852 మంది యాత్రికులు వచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువైనప్పటికీ.. అధికారుల కచ్చితమైన ప్రణాళిక, సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి..

చార్ ధామ్ యాత్ర చేయాలనుకునే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ఈ యాత్రలో పాల్గొనే అవకాశం కల్పించరు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో చార్ ధామ్ యాత్రకు రిజిస్టర్ చేసుకోవచ్చు ‘‘రిజిస్ట్రేషన్ లేకుండా ఏ వ్యక్తిని ఈ యాత్రలో అనుమతించరు’’ అని జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ బిష్త్ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల యాత్రికులను పరిమిత సంఖ్యలో అనుమతించడానికి వీలవుతుందని, వారికి సరైన సౌకర్యాలు కల్పించగలుగుతామని ఆయన చెప్పారు.

నాలుగు పుణ్య క్షేత్రాలకు..

ఈ ఏడాది మే 10న ప్రారంభమైన చార్ ధామ్ యాత్రలో పవిత్ర హిందూ పుణ్యక్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ ఉన్నాయి.

Whats_app_banner