CBSE sample question papers: ఈ వెబ్ సైట్ లో సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫైనల్ ఎగ్జామ్స్ సాంపుల్ క్వశ్చన్ పేపర్స్
CBSE sample question papers: 2024 సంవత్సరానికి గానూ 10 వ తరగతి, 12వ తరగతి ఫైనల్ పరీక్షల నమూనా ప్రశ్నా పత్రాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రిలీజ్ చేసింది. వాటిని విద్యార్థులు cbseacademic.nic.in. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
CBSE sample question papers: 2024 సంవత్సరానికి గానూ 10 వ తరగతి, 12వ తరగతి ఫైనల్ పరీక్షల నమూనా ప్రశ్నా పత్రాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రిలీజ్ చేసింది. వాటిని విద్యార్థులు cbseacademic.nic.in. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మార్కుల విధానం కూడా..
2024 సంవత్సరానికి గానూ 10 వ తరగతి, 12వ తరగతి ఫైనల్ పరీక్షల నమూనా ప్రశ్నా పత్రాలతో పాటు, ఆయా తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ వారీగా మార్కులు నిర్ణయించే విధానాన్ని కూడా సీబీఎస్ఈ ప్రకటించింది. 2024 సంవత్సరానికి గానూ 10 వ తరగతి, 12వ తరగతి ఫైనల్ పరీక్షలు 2024 ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశముంది. ఫిబ్రవరి 15వ తేదీ నంచి ఆ పరీక్షలు ప్రారంభం అయ్యే అవకాశముంది. దాదాపు 55 రోజుల పాటు ఆ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 10వ తేదీలోగా ఆ పరీక్షలు ముగిసే అవకాశముంది. అయితే, ఈ ఎగ్జామ్స్ పూర్తి షెడ్యూల్ ను సీబీఎస్ఈ త్వరలో వెల్లడించనుంది.
నమూనా ప్రశ్నా పత్రాలతో ఉపయోగం..
నమూనా ప్రశ్నా పత్రాలను పరిశీలించడం ద్వారా విద్యార్థులు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ పాటర్న్ ను అర్థం చేసుకోవచ్చు. ఏ తరహా ప్రశ్నలు వస్తాయనే విషయంలో, ప్రశ్నలను ఏ విధంగా అడుగుతారనే విషయంలో అవగాహన వస్తుంది. ఆ క్వశ్చన్ పేపర్స్ ను ప్రాక్టిస్ చేయడం ద్వారా సమయ పాలనపై అవగాహన వస్తుంది. ప్రశ్నా పత్రంలో ఏ విభాగానికి ఎంత సమయం కేటాయించాలనేది తెలుస్తుంది. సాధారణంగా సాంపుల్ క్వశ్చన్ పేపర్స్ ఆధారంగానే మెయిన్ ప్రశ్నా పత్రాలను రూపొందిస్తారని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు.
How to download: ఎలా డౌన్ లోడ్ చేసుకోవడం?
- 2024 సంవత్సరానికి గానూ 10 వ తరగతి, 12వ తరగతి ఫైనల్ పరీక్షల నమూనా ప్రశ్నా పత్రాలను ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా cbseacademic.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీపై కనిపించే question paper ట్యాప్ పై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత SQP 2023-24.పై క్లిక్ చేయాలి.
- 10వ తరగతా? లేక 12 వ తరగతా? క్లాస్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
- సబ్జెక్ట్ వారీగా నమూనా ప్రశ్నా పత్రాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
- హెచ్ టీ తెలుగు పాఠకుల కోసం డైరెక్ట్ లింక్ ఇది..
- CBSE Class 10 sample question paper 2023-24
- CBSE Class 12 sample question paper 2023-24.