Bengal train accident : పశ్చిమ్ బెంగాల్ రైలు ప్రమాదం ఎలా జరిగింది? మానవ తప్పిదమే కారణమా?
West Bengal train accident : పశ్చిమ్ బెంగాల్లో జరిగిన ఘోర ప్రమాదంలో.. మానవ తప్పిదం ఉన్నట్టు తెలుస్తోంది! ఈ ఘటనలో ఇప్పటివరకు 15మంది మరణించారు.
Kanchanjunga express accident : పశ్చిమ్ బెంగాల్లో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదం.. యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. డార్జిలింగ్ జిల్లాలోని రంగపాణి స్టేషన్‌కి సమీపంలో కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ని ఒక గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 15మంది మరణించారు. మరో 60మంది గాయపడ్డారు. అయితే.. ఈ రైలు ప్రమాదం వెనుక మానవ తప్పిదం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమ్ బెంగాల్ రైలు ప్రమాదం ఎలా జరిగింది..?
పశ్చిమ్ బెంగాల్ రైలు ప్రమాదం ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు అధికారులు. మరోవైపు.. సీనియర్ అధికారులు సైతం ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. గూడ్స్ రైలు.. సిగ్నల్‌ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లి, కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ని ఢీకొట్టినట్టు తెలుస్తోందని అధికారులు వివరించారు.
"ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఇదొక మానవ తప్పిందగా అనిపిస్తోంది. సిగ్నల్‌ని పట్టించుకోకపోవడం ప్రమాదానికి కారణం అని పరిస్థితిని చూస్తే అనిపిస్తోంది. ఈ ఘటనలో.. గూడ్స్ రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ మరణించారు. కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ గార్డు కూడా ప్రాణాలు కోల్పోయాడు," అని రైల్వే బోర్డు ఛైర్మన్- సీఈఓ జయ వర్మ సిన్హ తెలిపారు.
West Bengal train accident today : అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సిల్దాహ్ మధ్య నడుస్తుంది కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్. ఈశాన్య భారతంలో ప్రస్తుతం పర్యటన సీజన్ నడుస్తోంది. ఫలితంగా.. చాలా మంది రైలు సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ సమయంలో.. రైలు ప్రమాదం జరగడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది.
ఉత్తర బంగాల్లోని న్యూ జల్పైగురిలోని రంగపాణి స్టేషన్‌కి సమీపంలో ఈ ఘటన. ఇక్కడ కవచ్ వ్యవస్థని వేగంగా విస్తరించాలని జయ వర్మ అభిప్రాయపడ్డారు.
మరోవైపు.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
మరోవైపు.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగ్గా.. ఆ సమయంలో.. ఐదుగురు మరణించినట్టు, మరో 30మంది గాయపడినట్టు అధికారులు చెప్పారు.
West Bengal train accident death toll : పశ్చిమ్ బెంగాల్ రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
"పశ్చిమ్ బెంగాల్ రైలు ప్రమాద ఘటన బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులతో మాట్లాడి, తాజా పరిస్థితులను తెలుసుకున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ కూడా ఘటనాస్థలాన్ని పరిశీలిస్తారు," అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు మోదీ.
మరోవైపు.. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారాన్ని ఇస్తున్నట్టు పీఎంఓ ప్రకటించింది.
West Bengal train accident live updates : పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం.. ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా.. ఇప్పటికే ఘటనాస్థలం వద్ద సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.
సంబంధిత కథనం