Bengal train accident : పశ్చిమ్ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. ఎక్స్‌ప్రెస్‌ని ఢీకొట్టిన గూడ్స్!
Bengal train accident : పశ్చిమ్ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ని ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
West Bengal train accident : పశ్చిమ్ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ జల్పైగురి ప్రాంతంలో సోమవారం ఉదయం.. కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ని ఓ గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. ఫలితంగా.. రెండు రైళ్లకు చెందిన పలు బోగీలు పట్టాలు తప్పాయి.
పశ్చిమ్ బెంగాల్ రైలు ప్రమాదం ఘటనలో ఐదుగురు మరణించారని అధికారులు వెల్లడించారు. మరో 25 నుంచి 30మందికి గాయాలైనట్టు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. గూడ్స్ రైలు సిగ్నల్‌ని అతిక్రమించి, కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ని ఢీకొట్టినట్టు తెలుస్తోందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. యుద్ధప్రాదిపతికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించినట్టు స్పష్టం చేశారు.
Kanchenjunga Express accident today : “డార్జిలింగ్ జిల్లా ఫాన్సిదేవా ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదం వార్త విని షాక్ అయ్యాను. కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ని ఓ గూడ్స్ రైలు ఢీకొట్టినట్టు తెలుస్తోంది. జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్‌లు ఘటన స్థలానికి వెళ్లాయి,” అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు మమతా బెనర్జీ.
మీడియా కథనాల ప్రకారం.. కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ని గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఫలితంగా ఎక్స్‌ప్రెస్‌కి చెందిన రెండు బోగీలు డీరైల్ అయ్యాయి.
త్రిపురలోని అగర్తల నుంచి కోల్‌కతాలోని సీల్దా స్టేషన్‌కి వెళ్లాల్సిన కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ ఇది. కానీ ఉదయం 8 గంటల సమయంలో గూడ్స్ రైలు.. ఎక్స్‌ప్రెస్‌ని ఢీకొట్టడంతో పశ్చిమ్ బెంగాల్ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.
ఘటనాస్థలం నుంచి విషాదకర దృశ్యాలు వెలువడుతున్నాయి. గూడ్స్ రైలుకు చెందిన అనేక బోగీలు పట్టాలు తప్పాయి. వాటి మీద నుంచి.. ఎక్స్‌ప్రెస్‌కి చెందిన ఒక బోగీ గాలిలోకి ఎగిరి ఉండిపోయింది. వాటిని చూసేందుకు స్థానికులు భార సంఖ్యలో గుమిగూడారు.
పశ్చిమ్ బెంగాల్ రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ స్పందించారు.
“ఎన్ఎఫ్ఆర్ జోన్లో దిగ్భ్రాంతికర ఘటన జరిగింది. యుద్ధప్రాదిపతికన చర్యలు చేపడుతున్నాము. రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కలసిగట్టుగా పనిచేస్తున్నాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సీనియర్ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లారు,” అని అశ్విణి వైష్ణవ్ వెల్లడించారు.
Train accident today : దేశంలో ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతంది. గత అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఇక గతేడాది జూన్‌లో జరిగిన ఒడిశా రైలు ప్రమాదం.. యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. నాడు.. బహనాగా రైల్వే స్టేషన్లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్.. గూడ్స్ రైలును ఢీకొట్టింది. కొన్ని బోగీలు.. అదే సమయంలో అటువైపు వెళుతున్న బెంగళూరు హౌరా ఎక్స్‌ప్రెస్ మీద పడ్డాయి. ఈ ఘటనలో 290కిపైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1200 మంది గాయపడ్డారు.
సంబంధిత కథనం