PM Modi, Italy PM selfie video: వైరల్ గా మారిన ఇటలీ పీఎం మెలోనీ, ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో; ట్రెండింగ్ లో #మెలోడీ
#Melodi: ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇటలీ ప్రధాని మెలోనీ తన ‘ఎక్స్’ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పై ప్రధాని మోదీ కూడా స్పందించారు. మెలోనీ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీలోని అపులియాకు వెళ్లారు.
#Melodi: జీ 7 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ పీఎం జార్జియా మెలోనీలు దిగిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోకు సంబంధించి #మెలోడీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఇటలీలోని అపులియాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు నవ్వుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.
హలో ఫ్రం మెలొడీ టీమ్..
జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి నిలబడి ‘మెలోడీ టీమ్ నుంచి హలో’ అంటూ తీసిన సెల్ఫీ వీడియోను ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో, అలాగే, ఇన్ స్టాగ్రామ్ లో శనివారం పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మెలోనీ పక్కన నిల్చుని ప్రధాని మోదీ బిగ్గరగా నవ్వడం వినిపిస్తోంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన మెలోని ‘‘హాయ్ ఫ్రెండ్స్, #Melodi నుంచి’’ అనే క్యాప్షన్ ను ఇచ్చారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. నెటిజన్లు దీనిపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
ఇటలీ ప్రధాని మెలోనీ ఆహ్వానం మేరకు
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఇటలీలోని అపులియాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు నవ్వుతూ ఈ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. మెలోనీ ఫొటో తీస్తుండగా ఇద్దరు నేతలు కెమెరా వైపు నవ్వుతూ కనిపించారు. ఇటలీ ప్రధాని మెలోనీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జీ 7 సదస్సులో పాల్గొనడానికి అపులియా వెళ్లారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే.
ప్రధాని మోదీ స్పందన
మెలోనీ తన ఎక్స్ హ్యాండిల్ లో షేర్ చేసిన ఈ వీడియో పై ప్రధాని మోదీ స్పందించారు. "లాంగ్ లివ్ ఇండియా-ఇటలీ ఫ్రెండ్ షిప్!" అన్న క్యాప్షన్ తో ఆయన రిప్లై ఇచ్చారు. ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ లలో మెలోనీ పోస్ట్ చేసిన ఈ వీడియో వేలల్లో లైక్స్ ను, కామెంట్స్ ను పొందుతోంది.
మోదీ, మెలోనీ స్నేహం
భారత ప్రధాని మోదీ, ఇటలీ పీఎం మెలోనీల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. గత ఏడాది ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో, ఆ తర్వాత దుబాయ్ లో జరిగిన కాప్ 28 సదస్సులో ఈ ఇద్దరు నేతలు కలుసుకున్నారు. ఈ ఇరువురు నేతల మధ్య స్నేహం అనేక ఆన్ లైన్ మీమ్స్ కు స్ఫూర్తినిచ్చింది. డిసెంబర్ లో దుబాయ్ లోని కాప్ 28 వద్ద ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ‘‘కాప్ 28లో మంచి స్నేహితులు, #Melodi’’ అనే క్యాప్షన్తో మెలోని ఈ ఫొటోను ఎక్స్ లో షేర్ చేశారు. ఇరువురు నేతలు కలిసి ఉన్న ఫొటోలు ఆన్ లైన్ లో విస్తృతంగా షేర్ కావడంతో ‘మెలోడి’ (#Melodi) అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది.