Monsoon diet : ఇవి ఆరోగ్యానికి మంచివే.. కానీ వానాకాలంలో మాత్రం తినొద్దు..-you should avoid these healthy foods in monsoon ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monsoon Diet : ఇవి ఆరోగ్యానికి మంచివే.. కానీ వానాకాలంలో మాత్రం తినొద్దు..

Monsoon diet : ఇవి ఆరోగ్యానికి మంచివే.. కానీ వానాకాలంలో మాత్రం తినొద్దు..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 11, 2022 01:30 PM IST

ఆరోగ్యంగా అనిపించే కొన్ని ఆహారాలు.. వర్షాకాలంలో కొన్ని సమస్యలను కలిగిస్తాయి. మరి ఈ మాన్‌సూన్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనే విషయాలపై క్లారిటీ ఉండాలి అంటున్నారు ఆహార నిపుణులు. వానాకాలంలో ఎలాంటి డైట్ తీసుకోవాలనే అంశంపై పలు సూచనలిచ్చారు.

<p>ఈ ఫుడ్ వానాకాలంలో తినకండి..</p>
ఈ ఫుడ్ వానాకాలంలో తినకండి..

Monsoon Diet : కొన్ని ఆహారాలు వర్షాకాలంలో తప్పా.. మిగిలిన అన్ని సమయాల్లోనూ మంచివే. ఆరోగ్యానికి కూడా మంచి చేస్తాయి. ఆరోగ్యానికి మంచివి కదా అని మనం వానాకాలంలో వాటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తాం. అయితే ఇలా అస్సలు చేయవద్దు అంటున్నారు ఆహార నిపుణులు. ఇంతకీ ఏమి తినకూడదు? ఏమి తినాలి.. తినకూడనివి తినాల్సి వస్తే ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిపై ఆహారనిపుణులు ఇచ్చే సూచనలు ఏంటో తెలుసుకుందాం.

పెరుగు తినండి

వర్షాకాలంలో ఎక్కువ పెరుగు లేదా ఇతర ప్రోబయోటిక్స్ తినండి. ఇలా చేయడం వల్ల పొట్ట సమస్యలు దూరమవుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

పచ్చి కూరగాయలు 

ఈ సమయంలో పచ్చి కూరగాయలు తినవద్దు. ముఖ్యంగా సలాడ్లకు దూరంగా ఉండాలి. ఇవి కడుపు సమస్యలను కలిగిస్తాయి. వర్షాకాలంలో కూరగాయలు, ఆకుకూరల్లో సూక్ష్మక్రిములు సులువుగా పెరిగిపోతాయి. కాబట్టి కూరగాయలు తినేముందు బాగా ఉడికించి తర్వాత తినాలి.

వడకట్టని నీటిని తాగవద్దు

మాన్‌సూన్‌ సమయంలో నీటిలో వివిధ రకాల సూక్ష్మజీవులు పెరుగుతాయి. కాబట్టి నీరు తాగేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు తాగే సమయంలో ఫిల్టర్ చేసి తాగాలి. లేకపోతే నీటిని కాచి వడబోసి చల్లార్చి తాగాలి. 

సీఫుడ్ అస్సలు వద్దు

సీఫుడ్ ఈ సమయంలో అస్సలు తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు. వీటికి నో చెప్పడమే మంచిది అంటున్నారు. వీటిని బాగా వండినా కూడా ఒక్కోసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. 

Whats_app_banner

సంబంధిత కథనం