ఒకటి ఐస్, మరొకటి ఫైర్.. Yezdi Roadsterలో రెండు కొత్త కలర్స్!
క్లాసిక్ మోటార్‌సైకిల్ మోడల్ Yezdi Roadster ఇప్పుడు మరిన్ని ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తోంది. వాటి వివరాలు, ధరలను ఇక్కడ తెలుసుకోండి.
దేశంలో అత్యంత జనాదరణ పొందిన మోటార్‌సైకిల్ బ్రాండ్లలో ఒకటైన Yezdi తమ మోటార్‌సైకిల్ మోడల్ 'రోడ్‌స్టర్' (Yezdi Roadster) ను మరిన్ని ఆకర్షణీయమైన రంగుల్లో తీసుకొచ్చింది. మార్కెట్లో ఈ క్లాసిక్ మోటార్‌సైకిల్‌కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఇన్ఫెర్నో రెడ్, గ్లేసియల్ వైట్ అనే సరికొత్త పెయింట్ స్కీములలో విడుదల చేసింది. ఫ్యూయల్ ట్యాంక్‌పై గ్లాస్ ఫినిషింగ్, మోటార్‌సైకిల్ అంతటా అబ్సిడియన్ బ్లాక్ థీమ్‌తో ఈ బైక్స్ ఉంటాయి. ఇందులో రెడ్ కలర్ బైక్ మోడల్‌ను 'ఫైర్' పేరుతో అలాగే వైట్ కలర్ మోడల్‌ను 'ఐస్' పేరుతో పిలుస్తున్నారు.
ఈ సరికొత్త యెజ్డీ రోడ్‌స్టర్- ఫైర్ అలాగే ఐస్ కలర్ ఆప్షన్‌ల ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 2,02,142 లక్షలుగా నిర్ణయించారు.
అయితే ఈ రెండు కొత్త కలర్ ఆప్షన్లు యెజ్డీ రోడ్‌స్టర్ డార్క్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. క్రోమ్ వేరియంట్‌లో ఇప్పటికీ అవే పాత రెండు రంగులలో లభిస్తాయి.
మొత్తంగా Yezdi Roadster ఇప్పుడు ఏడు కలర్ ఆప్షన్లలో లభ్యంకానుంది. మిగతావి స్మోక్ గ్రే, స్టీల్ బ్లూ, హంటర్ గ్రీన్, గాలంట్ గ్రే, సిన్ సిల్వర్ వంటి ఐదు మ్యాట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో హంటర్ గ్రీన్, స్టీల్ బ్లూ ఆప్షన్ ధరలు మాత్రం రూ. 2.05 లక్షలుగా ఉంది.
Yezdi Roadster ఇంజన్ కెపాసిటీ
Yezdi రోడ్‌స్టర్‌లో కూడా ఈ బ్రాండ్ నుంచి మిగతా మోడల్స్ అయినటువంటి Yezdi స్క్రాంబ్లర్ అలాగే Yezdi అడ్వెంచర్ మోటార్ సైకిళ్లలో ఉన్నట్లుగానే 334cc సామర్థ్యం కలిగిన లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. దీనిని 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇది 29 bhp శక్తిని, 29 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
ఈ బైక్ గంటకు 140 కిమీ కాగా, ఇది లీటరుకు 29.5 కిమీల మైలేజ్ అందిస్తుందని నివేదికలు పేర్కొన్నాయి.
యెజ్డీ రోడ్‌స్టర్ బైక్ భారతీయ రోడ్లపై రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350, హోండా హెచ్‌నెస్ సిబి 35, జావా ఫార్టీ-టూ వంటి మోటార్‌సైకిళ్లతో పోటీపడుతుంది.
సంబంధిత కథనం