రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా హోండా నుంచి హెచ్‌నెస్ CB350 యానివర్సరీ ఎడిషన్ -honda h ness cb350 anniversary edition rivals the likes of royal enfield meteor 350 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా హోండా నుంచి హెచ్‌నెస్ Cb350 యానివర్సరీ ఎడిషన్

రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా హోండా నుంచి హెచ్‌నెస్ CB350 యానివర్సరీ ఎడిషన్

Manda Vikas HT Telugu
Jan 30, 2022 10:47 AM IST

హోండా హెచ్‌నెస్ CB350 యానివర్సరీ ఎడిషన్ మోటార్‌సైకిల్‌ను కూడా సంస్థ విడుదల చేసింది. ఇది చూడటానికి అచ్ఛంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ నుంచి వచ్చిన బై-ప్రొడక్ట్ లాగే కనిపిస్తుంది.

Honda has launched anniversary edition of the H'ness CB350 motorcycle in India.
Honda has launched anniversary edition of the H'ness CB350 motorcycle in India. (HT Photo)

రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350, బెనెల్లీ ఇంపీరియాల్ 400, జావా బ్రాండ్ మోటార్‌సైకిళ్లకు పోటీగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా తమ బ్రాండ్ నుంచి H'ness CB350 మోటార్‌సైకిల్‌ను 2020లో భారత మార్కెట్లో విడుదల చేసింది. DLX, DLX ప్రో అనే రెండు వేరియంట్లలో లభించే ఈ బైక్స్ ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 1.85 లక్షల నుంచి రూ. 1.90 లక్షలతో ప్రారంభమవుతున్నాయి. ఇప్పటి వరకు 35,000 యూనిట్లకు పైగా మోటార్‌సైకిల్‌లను విక్రయించినట్లు హోండా తెలిపింది. ఏడాది పూర్తైన తర్వాత హోండా హెచ్‌నెస్ CB350 యానివర్సరీ ఎడిషన్ మోటార్‌సైకిల్‌ను కూడా సంస్థ విడుదల చేసింది. ఇది చూడటానికి అచ్ఛంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ నుంచి వచ్చిన బై-ప్రొడక్ట్ లాగే కనిపిస్తుంది.

మోటార్‌సైకిల్ ఇంధన ట్యాంక్‌ యొక్క్ సైడ్ ప్యానెల్‌పై బంగారు రంగులో బ్యాడ్జింగ్‌ ఇచ్చారు. ట్యాంక్ మీద వార్షికోత్సవ ఎడిషన్ లోగో కూడా ఉంది. బ్రౌన్ కలర్ డ్యూయల్ సీట్, క్రోమ్ సైడ్ స్టాండ్, విభిన్నమైన కలర్ ఛాయిస్ లతో ఇచ్చిన క్రౌన్ హ్యాండిల్ అన్నీ రాయల్ ఎన్‌ఫీల్డ్ లోని మరో రెట్రో మోటార్‌సైకిల్ మోడల్ ఫీల్‌ను కలిగిస్తాయి. అయినప్పటికీ దీనిలోని ఫీచర్స్ కొన్ని అత్యాధునికంగా ఉన్నాయి. సెమీ-అనలాగ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైటింగ్ సిస్టమ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC), అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, హజార్డ్ లైట్ స్విచ్, వాయిస్ కంట్రోల్ సిస్టమ్ మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

Watch Video:

మోటార్‌సైకిల్ ముందు, వెనుక మడ్‌గార్డ్‌లను కలిగి ఉంది. ఇక ఈ బైక్ ఇంజన్ సామర్థ్యం విషయానికి వస్తే మునుపటి వెర్షన్ లాగే ఉంది. 348.3cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజన్ ఇచ్చారు. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ జత చేశారు. ఈ మోటార్ గరిష్టంగా 20.7 hp శక్తిని, 30 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ రెట్రో మోటార్‌సైకిల్ ధర ప్రస్తుతం ఎక్స్ షోరూం వద్ద రూ. 1.96 లక్షల - రూ. 2.03 లక్షల మధ్య ఉంది. 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్