Xiaomi Mijia Glasses। కళ్లజోడులో కెమెరా.. జూమ్ చేసి చూడొచ్చు, మరెన్నో ఫీచర్లు!-xiaomi launches mijia glasses ar with 15x optical zoom check price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Xiaomi Mijia Glasses। కళ్లజోడులో కెమెరా.. జూమ్ చేసి చూడొచ్చు, మరెన్నో ఫీచర్లు!

Xiaomi Mijia Glasses। కళ్లజోడులో కెమెరా.. జూమ్ చేసి చూడొచ్చు, మరెన్నో ఫీచర్లు!

Manda Vikas HT Telugu
Aug 01, 2022 02:57 PM IST

స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ సరికొత్త AR గ్లాసెస్‌ను పరిచయం చేసింది. ఇది ఒక స్మార్ట్ కళ్లజోడు. దృశ్యాన్ని జూమ్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

<p>Xiaomi Mijia Glasses</p>
Xiaomi Mijia Glasses

చైనీస్ టెక్ కంపెనీ షావోమీ తాజాగా ఒక సరికొత్త AR గ్లాసెస్‌ను పరిచయం చేసింది. Xiaomi Mijia Glasses పేరుతో విడుదలైన ఈ కళ్లజోడు సాధారణమైన కళ్లజోడు కాదు, ఇదొక స్మార్ట్ కళ్లజోడుగా చెప్పవచ్చు. ఈ గ్లాసెస్‌కు ప్రత్యేక కెమెరా సిస్టమ్, అలాగే శక్తివంతమైన OLED స్క్రీన్లు అమర్చారు. ఈ గ్లాసెస్ పెట్టుకొని దూరపు వస్తువులను కూడా జూమ్ చేసి చూడవచ్చు.

షావోమి మిజియా గ్లాసెస్ ఇప్పుడు మీకు స్టైలిష్ లుక్ ఇవ్వడమే కాకుండా, దీని పనితీరు అబ్బుర పరుస్తుంది. ఈ గ్లాసెస్‌లో 50 మెగాపిక్సెల్‌ల రిజల్యూషన్‌ కలిగిన క్వాడ్ బేయర్ సెన్సార్ ఇన్‌స్టాల్ చేశారు. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా కూడా ఉంది. దీంతో ఈ కళ్లజోడు ఐదు రెట్ల మెరుగైన దృశ్యమానతను అందిస్తుంది. డిజిటల్, ఆప్టికల్ కలిపి దాదాపు వస్తువులను, దృశ్యాన్ని ఈ కళ్లజోడు 15x జూమ్ చేసి చూపించగలదు.

అంతేకాదు మీరు చూసిన దృశ్యాన్ని ఫోటో తీస్తుంది, వీడియో రికార్డ్ చేస్తుంది, వాటి భద్రంగా స్టోర్ కూడా చేస్తుంది. వేగవంతమైన ఆర్కైవింగ్ కోసం ప్రత్యేకమైన యాప్ అందుబాటులో ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ స్మార్ట్ గ్లాసెస్ ఎలాంటి స్మార్ట్‌ఫోన్‌తో సంబంధం లేకుండా ఇదే ఒక స్వతంత్ర గాడ్జెట్ గా పనిచేస్తుంది. ఇందులో సోనీ మైక్రో-OLED స్క్రీన్లు, 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్, ఆక్టాకోర్ ప్రాసెసర్ అన్నీ ఉన్నాయి. దీనిని వైఫై, బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 1,020 mAh బ్యాటరీని అమర్చారు. దీనిని కేవలం 30 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

Xiaomi Mijia Glasses స్పెసిఫికేషన్స్

  • సోనీ మైక్రో OLED సిలికాన్-ఆధారిత డిస్‌ప్లే
  • పీక్ బ్రైట్‌నెస్ 3000నిట్స్, యాంటీ-బ్లూ లైట్ ప్రొటెక్షన్
  • స్నాప్‌డ్రాగన్ 8-కోర్ ప్రాసెసర్
  • 3ర్యామ్ +32GB స్టోరేజ్
  • 50MP ప్రైమరీ + 8MP పెరిస్కోప్ టెలిఫోటో (OIS),
  • 15x జూమ్‌, 100 నిమిషాల నిరంతరాయమైన రికార్డింగ్‌
  • 1020mAh బ్యాటరీ, మాగ్నెటిక్ 10W ఛార్జింగ్, 30 నిమిషాల్లో 80% ఛార్జ్

ఈ గ్లాసెస్ సుమారు 100 గ్రా బరువు ఉంటుంది, 10 సెకన్ల టైమ్ రిగ్రెషన్‌, ఇంటెలిజెంట్ బయోమెట్రిక్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, జియావో ఐ ట్రాన్స్ లేషన్ వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

ప్రస్తుతం ఈ గ్లాసెస్ చైనాలో విడుదలయ్యాయి. వీటి ధర 2499 యువాన్ (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 29,500/-) ఆగష్టు 3, 2022 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం అవుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం