Work From Beach: వర్క్ ఫ్రం బీచ్... గోవా బీచ్‌లలో కోవర్కింగ్ స్టేషన్లు, ఇక అక్కడి నుంచే పనిచేసుకోవచ్చు-work from beach coworking stations on goa beaches you can work from there ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Work From Beach: వర్క్ ఫ్రం బీచ్... గోవా బీచ్‌లలో కోవర్కింగ్ స్టేషన్లు, ఇక అక్కడి నుంచే పనిచేసుకోవచ్చు

Work From Beach: వర్క్ ఫ్రం బీచ్... గోవా బీచ్‌లలో కోవర్కింగ్ స్టేషన్లు, ఇక అక్కడి నుంచే పనిచేసుకోవచ్చు

Haritha Chappa HT Telugu
Mar 10, 2024 09:16 AM IST

Work From Beach: ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ కాలం నడుస్తోంది. త్వరలోనే వర్క్ ఫ్రం బీచ్ కూడా రాబోతోంది. గోవా బీచులలో ఇప్పటికే ఏర్పాట్లు సాగుతున్నాయి.

గోవా బీచ్
గోవా బీచ్ (pixabay)

Work From Beach: కరోనా వచ్చాక వర్క్ లైఫ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన కంపెనీల సంఖ్య పెరిగింది. ఇప్పుడు గోవా ప్రభుత్వం ఏకంగా వర్క్ ఫ్రమ్ బీచ్‌కు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. త్వరలో గోవా బీచులలో కో వర్కింగ్ స్పేస్‌లను ఏర్పాటు చేయనుంది. ఆ రాష్ట్ర పర్యాటకశాఖ గోవాలోని మొర్జిమ్, అశ్వేమ్ బీచులలో కోవర్కింగ్ స్పేస్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.

yearly horoscope entry point

గోవాకు వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. అయితే ఆఫీసు పనులు వల్ల అక్కడికి వెళ్లలేనివారి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రం బీచ్ ఏర్పాట్లు చేస్తోంది. బీచుల్లోనే కూర్చుని.... సముద్రాన్ని చూస్తూ తమ ఆఫీసు పనులను చేసేలా కోవర్కింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. పర్యాటకానికి హాట్ స్పాట్‌గా ఉన్న గోవాను మరింతగా ఎదిగేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

ఎన్నో దేశాల నుంచి గోవాకు విదేశీయులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా యూరోపియన్ పర్యాటకులు ఎక్కువ. అలాంటి వారికి గోవాలోనే వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే వారు ఇక్కడ నుంచే తమ ఆఫీసు పనిని పూర్తి చేసుకోగలరు. దీనివల్ల గోవాకి వచ్చే విదేశీయుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. తద్వారా ఎక్కువ ఆర్జించవచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్.'

ఎదురుగా సముద్రపు అలలు ఎగిసిపడుతుంటే, ఆ తీరప్రాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పని చేయడం చాలా కొత్తగా ఉంటుంది. ఇది ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది కూడా. అందుకే గోవా ప్రభుత్వం బీచులలో కోవర్కింగ్ స్టేషన్లను పరిచయం చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే గోవా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలతో ఈ విషయంపై చర్చలు కూడా ప్రారంభించింది. అతి త్వరలో గోవా బీచ్ లలో వర్కింగ్ స్టేషన్లో దర్శనం ఇస్తాయి.

గోవాకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగితే అక్కడ స్థానికుల జీవన శైలి కూడా మారుతుంది. వారికి మరింతగా ఆర్థికంగా కలిసొస్తుంది. అలాగే గోవా ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఖజానాకు ఎక్కువ సొమ్ము చేరుతుంది. అందుకే ఈ గోవాలో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం అనే ఆలోచన వారికి వచ్చింది.

గోవా బీచులకు ప్రసిద్ధి. ఎందుకంటే ఆ రాష్ట్రం చుట్టూ 100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతంలో దాదాపు 35 బీచులు ఉన్నాయి. కొన్ని బీచులు నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉంటాయి. మరి కొన్ని తాటి చెట్లతో నిండిపోయి ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇక్కడ ఇసుక బీచులు ప్రజలకు ఎంతో నచ్చుతాయి. ముఖ్యంగా రాత్రిపూట ఇక్కడ జరిగే వినోద కార్యక్రమాలు, పార్టీలు ఎక్కువ మందిని ఆకర్షిస్తాయి.

Whats_app_banner