Food For Strength | అమ్మాయిలు బలంగా మారడానికి.. ఇవి తినండి-woman should definitely eat these five foods for strength ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Food For Strength | అమ్మాయిలు బలంగా మారడానికి.. ఇవి తినండి

Food For Strength | అమ్మాయిలు బలంగా మారడానికి.. ఇవి తినండి

Vijaya Madhuri HT Telugu
Mar 02, 2022 02:43 PM IST

నేటి స్త్రీ శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడుతుంది. ఎన్నో పనుల మధ్య సతమతమవుతున్న మహిళలకు తగినంత బలం ఉండట్లేదని కొన్ని అధ్యాయనాల్లో తేలింది. ఆమె మరింత బలం పొందడానికి ఆహారం చాలా కీలకం. ఒకవేళ మీరు ఈ కోవకే చెందినవాళ్లయితే అస్సలు చింతించకండి. మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు జోడించడంవల్ల మీరు బలంగా, దృఢంగా మారవచ్చు.

<p>అమ్మాయిలు బలంగా మారేందుకు ఇవి తినండి</p>
అమ్మాయిలు బలంగా మారేందుకు ఇవి తినండి

Woman Health | ‘పొపాయ్​ ద సెయిలర్​ మ్యాన్’.. ఇది చిన్నప్పుడు అందరూ చూసే ఉంటారు. దీనిలో పొపాయ్ స్పినాచ్​ (బచ్చలికూర) డబ్బాలను తింటూ.. అకస్మాత్తుగా శక్తిని పొందుతాడు. అది ఎలా జరుగుతుందో తెలుసా? పోనీ ఛోటా భీమ్​లో కూడా లడ్డూలు తిని.. భీమ్​ శత్రువులతో పోరాడేందుకు సెకన్​లలో సిద్ధమైపోతాడు. మీకు కూడా అంత శక్తి క్షణాల్లో కావాలని ఎప్పుడైనా అనిపించిందా? ఎన్నో పనుల మధ్య సతమతమవుతూ.. వాటిని పూర్తి చేసే ఓపిక లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు ఈ ఐదు పదార్థాలను తినాల్సిందే అంటున్నారు నిపుణులు.

వీటివల్ల ఆరోగ్యం, బలమే కాదని.. అలసట, తిమ్మిర్లు, కీళ్లనొప్పులు వదిలించుకోవచ్చని చెప్తున్నారు. అంతేకాదండోయ్ మెరిసే చర్మం, మెరిసే జుట్టు మరెన్నో ప్రయోజనాలు పొందవచ్చని వెల్లడిస్తున్నారు.

తప్పనిసరిగా తీసుకోవాల్సినవి..

1. బచ్చలికూర

ఇంతకు ముందు చెప్పినట్లుగా, పొపాయ్​ను ఫాలో అయిపోవడమే. ఆకుపచ్చని ఆకు కూరలతో సహా, అపారమైన విటమిన్ ఎ, నేరుగా మీ కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది వెంటనే శక్తిని ఇవ్వదు కానీ.. క్రమంగా మీ శక్తిని పెంచుతుంది. కాలక్రమేణా మీకు బలం పెరుగుతున్నట్లు మీరే గుర్తిస్తారు.

2. గుడ్లు

గుడ్లలో అనేక విటమిన్లు, ప్రోటీన్లు వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇంకా విటమిన్ డి శరీరానికి కావాల్సిన శక్తి ఇస్తుంది. ఎందుకంటే ఇది ఆహారాన్ని వేగంగా విచ్ఛిన్నం చేసి.. వేగంగా శక్తిని ఇవ్వడంలో ఉపయోగపడుతుంది.

3. మల్టీగ్రెయిన్స్

భారతీయ కుటుంబాలు సాధారణంగా భోజనం కోసం ఆటా లేదా బియ్యాన్ని ఎంచుకుంటారు. బజ్రా, రాగులు, జొన్నలు మొదలైన అనేక రకాల ధాన్యాలు అందుబాటులో మనకు ఉన్నాయి. ఇవి ట్రాన్స్ ఫ్యాట్ భాగాలకు, శరీరానికి స్థిరమైన శక్తిని అందించడానికి ఉపయోగపడుతున్నాయి. వాటిని మీ రెగ్యులర్ ఆటాతో కలిపి, సాధారణ భోజనంతో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే జరిగే అద్భుతాలను మీరే గుర్తిస్తారు.

4. అరటిపండ్లు

పెండింగ్‌లో ఉన్న పనిని.. చాలా తక్కువ శక్తితో చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అరటిపండ్లను తినండి. అరటిపండ్లలో చాలా ఫైబర్, విటమిన్లు బి6, ముఖ్యంగా పొటాషియంతో నిండి ఉంటాయి, ఇది కండరాల బలాన్ని పెంచుతుంది. శరీరానికి చాలా స్థిరమైన పద్ధతిలో శక్తిని ఇస్తుంది.

5. గింజలు, విత్తనాలు

అడవి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. మనకు కనిపించే జంతువులలో అత్యంత ఉత్సాహభరితమైన ఉడుతలు. ఇవి కాయలు, గింజలను మెల్లగా తిని.. మునుపటి కంటే ఎక్కువ శక్తితో ఎలా పరిగెత్తుతాయో ఎప్పుడైనా గమనించారా? విత్తనాలు, గింజలు ప్రోటీన్లు, ఫైబర్​తో నిండి ఉంటాయి. సోడియం తక్కువ ఉండి ఎక్కువ శక్తిని ఇస్తాయి.

కాబట్టి అమ్మాయిలు, మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు? మీరు వెళ్లి ఈ ఆహారాలను ఆస్వాదించండి. బలాన్ని పొంది దృఢంగా తయారవండి.

Whats_app_banner